HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Balayya Chiru Enter The Fray Once Again

మరోసారి బరిలోకి బాలయ్య – చిరు

వీరిద్దరి మధ్య సాగే సంక్రాంతి పోరు అంటేనే అభిమానులకు అసలైన పండుగ. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే 2027 సంక్రాంతి బరిలో ఈ ఇద్దరు దిగ్గజ హీరోలు పోటీ పడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది

  • Author : Sudheer Date : 30-01-2026 - 11:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chiru Vs Balayya
Chiru Vs Balayya

Chiranjeevi Vs Balakrishna : తెలుగు సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా బాక్సాఫీస్ యుద్ధానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ మరోసారి ముఖాముఖి తలపడేందుకు సిద్ధమవుతున్నారు. వీరిద్దరి మధ్య సాగే సంక్రాంతి పోరు అంటేనే అభిమానులకు అసలైన పండుగ. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే 2027 సంక్రాంతి బరిలో ఈ ఇద్దరు దిగ్గజ హీరోలు పోటీ పడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

సంక్రాంతి సమరం: గ్యాంగ్‌స్టర్లుగా చిరు, బాలయ్య!

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చిరంజీవి, బాలకృష్ణల పోటీ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. విశేషమేమిటంటే, ఈసారి వీరిద్దరూ ఒకే తరహా ‘గ్యాంగ్‌స్టర్’ కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం. బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న చిత్రం గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో సాగనుండగా, అటు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య చేయబోయే సినిమా కూడా అదే జానర్‌లో ఉండబోతోందని టాక్. ఒకే పండుగ సీజన్‌లో, ఒకే తరహా కథలతో ఇద్దరు అగ్ర హీరోలు ఢీకొనబోతుండటం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఈ తరహా పోటీ గతంలోనూ సినీ ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా 2023 సంక్రాంతి సమయంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘వీరసింహారెడ్డి’ (బాలయ్య – గోపీచంద్ మలినేని), ‘వాల్తేరు వీరయ్య’ (చిరంజీవి – బాబీ) చిత్రాలు ఒకరోజు వ్యవధిలో విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. రెండు చిత్రాలు ఘనవిజయం సాధించి గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరుపుకోవడం విశేషం. ఇప్పుడు అదే కాంబినేషన్లు రిపీట్ అవుతుండటంతో, 2027 సంక్రాంతికి కూడా అదే మ్యాజిక్ పునరావృతం అవుతుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

గతంలో చిరంజీవి ‘లంకేశ్వరుడు’, ‘గూండా’ వంటి చిత్రాల్లో గ్యాంగ్‌స్టర్‌గా మెప్పించగా, బాలయ్య ‘యువరత్న రాణా’, ‘అశోక చక్రవర్తి’ సినిమాల్లో తన మాస్ పవర్ చూపించారు. అయితే, ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా నవతరం ప్రేక్షకులను ఆకట్టుకునేలా బాబీ, గోపీచంద్ మలినేని ఈ సీనియర్ స్టార్లను ఏ రీతిన ప్రజెంట్ చేస్తారో చూడాలన్న కుతూహలం అందరిలోనూ నెలకొంది. ఈ ‘గ్యాంగ్‌స్టర్ వార్’లో ఈసారి ఎవరిది పైచేయి అవుతుందోనని మెగా, నందమూరి అభిమానులు ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో చర్చలు మొదలుపెట్టారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2027 sankranti
  • 2027 sankranti movies
  • balakrishna
  • chiranjeevi
  • Chiranjeevi Vs Balakrishna
  • tollywood

Related News

Actor JD Chakravarthy Reveals Unknown Facts

JD Chakravarthy: అందుకే సినిమా ఇండస్ట్రీలో హీరోలు తమ కూతుళ్ళను సినిమాల్లోకి రానివ్వరు: జేడీ చక్రవర్తి

ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే సినీ నటుడు జేడీ చక్రవర్తి, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలుగు సినీ పరిశ్రమలోని కొన్ని చేదు నిజాలను బయటపెట్టారు. ముఖ్యంగా నటీమణులకు ఎదురయ్యే సవాళ్లు, అగ్ర హీరోల ఆలోచనా దృక్పథంపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇండస్ట్రీలో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయని, కానీ అవి బయటి ప్రపంచానికి తెలియవని జేడీ పేర్కొన్నారు. తెలిసిన వారు కూడా భయం వల్ల నో

  • Koratala Siva Balakrishna Combination

    బాలయ్య – కొరటాల కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్

Latest News

  • Kadapa : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేయించేందుకు భార్య ప్లాన్

  • Preethi Reddy : BJP లో చేరడంపై మల్లారెడ్డి కోడలు క్లారిటీ !!

  • YCP MLC అనంతబాబు అరెస్ట్

  • RTC Driver Suicide : డ్రైవర్ కుటుంబానికి రూ.10లక్షలు, ఉద్యోగం..ప్రభుత్వం ప్రకటన

  • WB Elections : TMC నేతలను గుండాలతో పోల్చిన మోడీ

Trending News

    • ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం!

    • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

    • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

    • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

    • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd