HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Veteran Actor Dharmendra Passes Away At 89

Dharmendra: ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో మ‌రో విషాదం.. ప్ర‌ముఖ న‌టుడు క‌న్నుమూత‌!

ధర్మేంద్ర మరణానంతరం ఆయన చివరి చిత్రం 'ఇక్కీస్' (Ikis) ఈ ఏడాదే విడుదల కానుంది. ఈ చిత్రంలో నటుడు, అమితాబ్ బచ్చన్ మనవడు అయిన అగస్త్య నందా తండ్రి పాత్రలో కనిపించనున్నారు.

  • Author : Gopichand Date : 24-11-2025 - 3:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dharmendra Death Cause
Dharmendra Death Cause

Dharmendra: ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర (Dharmendra) కన్నుమూశారు. ‘హీ-మ్యాన్’గా పిలువబడే ఈ నటుడు 89 సంవత్సరాల వయస్సులో నేడు తుది శ్వాస విడిచారు. ధర్మేంద్ర గత కొన్ని రోజులుగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ.. అక్కడే తుదిశ్వాస విడిచారు. ఈ దిగ్గజ నటుడి మరణంతో బాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ధర్మేంద్ర మరణవార్తను బాలీవుడ్ మీడియా ధృవీకరించింది.

ధర్మేంద్ర అక్టోబర్ 31, 2025న సాధారణ ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో నటుడిని ఆసుపత్రిలో చేర్చారు. గత కొద్ది రోజులుగా ధర్మేంద్ర ఐసీయూలో చికిత్స పొందుతుండగా.. నవంబర్ 10న ఆయన ఆరోగ్యం విషమంగా ఉందనే వార్తలు వచ్చాయి. దీంతో హేమా మాలిని, సన్నీ డియోల్, ఈషా డియోల్, ఆయన మనవళ్లు కరణ్ డియోల్, రాజ్‌వీర్ డియోల్ ఆసుపత్రికి వెళ్లి ఆయన్ని పరామర్శించారు. అలాగే న‌వంబ‌ర్ 11న ఆయ‌న మృతిచెందార‌నే వార్త కూడా వైర‌ల్ అయింది. అయితే ఆయ‌న మ‌ర‌ణించ‌లేద‌ని ధ‌ర్మేంద్ర కుమార్తె ఆరోజే వివ‌ర‌ణ ఇచ్చారు.

1960లో బాలీవుడ్ అరంగేట్రం

ధర్మేంద్ర పూర్తి పేరు ధర్మేంద్ర కేవల్ కృష్ణ డియోల్. ఆయన డిసెంబర్ 8, 1935న పంజాబ్‌లోని నస్రాని గ్రామంలో జన్మించారు. ఆయన తన నటనా జీవితాన్ని 1960లో విడుదలైన ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరే’ సినిమాతో ప్రారంభించారు. ఆ తర్వాత 1961లో వచ్చిన ‘బాయ్ ఫ్రెండ్’ సినిమాలో సహాయక పాత్రలో కనిపించారు.

Also Read: Khammam : కలెక్టర్ అనుదీప్ చేపట్టిన ‘చదవండి..అర్ధం చేసుకోండి..ఎదగండి’ కార్యక్రమానికి విశేష స్పందన

ధర్మేంద్ర కుటుంబం వివరాలు

ధర్మేంద్ర తన జీవితంలో రెండు వివాహాలు చేసుకున్నారు. ఆయన మొదటి వివాహం ప్రకాష్ కౌర్‌తో జరిగింది. వీరికి సన్నీ డియోల్, బాబీ డియోల్, విజేత డియోల్, అజితా డియోల్ అనే నలుగురు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే దివంగత నటుడు 1980లో హేమా మాలినిని వివాహం చేసుకున్నారు. రెండవ వివాహం చేసుకోవడానికి ధర్మేంద్ర ఇస్లాం మతాన్ని స్వీకరించారు. హేమా మాలినితో ఆయనకు ఈషా డియోల్, అహానా డియోల్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ధర్మేంద్ర హిట్ సినిమాలు

ధర్మేంద్ర తన 65 ఏళ్ల నటనా జీవితంలో అనేక హిట్, సూపర్ హిట్, బ్లాక్‌బస్టర్ చిత్రాలలో నటించారు. షోలే (1975), చుప్కే-చుప్కే (1975), సీతా ఔర్ గీతా (1972), ధరమ్‌వీర్ (1977), ఫూల్ ఔర్ పత్థర్ (1966), జుగ్ను (1973), యాదోన్ కీ బారాత్ (1973) ఆయన అద్భుతమైన చిత్రాల జాబితాలో ఉన్నాయి. రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ (2023), తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా (2024) ఆయన ఇటీవలి విడుదలైన సినిమాలు.

మరణానంతరం విడుదల కానున్న ధర్మేంద్ర చివరి చిత్రం

ధర్మేంద్ర మరణానంతరం ఆయన చివరి చిత్రం ‘ఇక్కీస్’ (Ikis) ఈ ఏడాదే విడుదల కానుంది. ఈ చిత్రంలో నటుడు, అమితాబ్ బచ్చన్ మనవడు అయిన అగస్త్య నందా తండ్రి పాత్రలో కనిపించనున్నారు. అగస్త్య నందా ఈ చిత్రం ద్వారా బాలీవుడ్‌కు పరిచయం కానున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 25, 2025న థియేటర్లలో విడుదల కానుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bollywood
  • Cinema News
  • Dharmendra
  • Dharmendra Demise
  • Dharmendra Died
  • Sholay Actor

Related News

Peddi - Giri Giri Giri Song Peddi 2nd Song

రామ్ చరణ్ పెద్ది సెకండ్ సాంగ్ కి లేటెస్ట్ ప్లాన్!

Ram Charan మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం పెద్దిపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి విడుదలైన తొలి పాట “చికిరి చికిరి” యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్ దాటి సంచలనం సృష్టించింది. ఐదు భాషల్లో విడుదలైన ఈ సాంగ్ మొత్తం 150 మిలియన్‌కు పైగా వ్యూస్ సాధించింది. ఈ విజయంతో ఇప్పుడు రెండో సింగిల్‌పై భారీ బజ

    Latest News

    • ఆ వయసు లోనే నాపై లైంగిక దాడి ! బయటపెట్టిన సమీరా..

    • దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్‌ రైలు పరుగులు పెట్టేందుకు రెడీ అవుతోంది

    • తెలంగాణ లో మరో జిల్లా ఏర్పాటుకు రంగం సిద్ధం.. పీవీ నరసింహారావు పేరు ఖరారు ?

    • కేసీఆర్‌ను కలవనున్న మంత్రి సీతక్క,కొండా సురేఖ.. ఎందుకంటే?

    • భారతదేశ జనగణనపై బిగ్ అప్డేట్‌.. రెండు ద‌శ‌ల్లో కీల‌క ఘ‌ట్టం!

    Trending News

      • చ‌రిత్ర సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్‌!

      • సీసాలు వాళ్లవే…. స్క్రిప్ట్ వాళ్లదే….. తిరుమలలో వైసీపీ మద్యం డ్రామా!

      • డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 500 శాతం టారిఫ్‌లు.. ఆ బిల్లుకు గ్రీన్‌ సిగ్నల్‌

      • బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్.. భారత్‌లోనే వరల్డ్ కప్ ఆడాలని స్పష్టం!

      • పదేళ్ల తర్వాత పర్ఫెక్ట్ ‘ఫిబ్రవరి’ ఈసారి రాబోతుంది !!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd