Tollywood : టాలీవుడ్ పెద్దలు కావాలని కష్టాలు కొనితెచ్చుకుంటున్నారా..?
Tollywood : స్టూడియోలు నిర్మించుకోవడానికి భూములు, ప్రోత్సాహకాలు ప్రకటించినా, సినీ ప్రముఖులు స్పందించకపోవడం పట్ల ప్రభుత్వం ఆగ్రహం గా ఉంది.
- By Sudheer Published Date - 05:45 PM, Sun - 25 May 25

తెలుగు సినీ పరిశ్రమ(Tollywoood)లో ప్రముఖుల వైఖరి ప్రస్తుతం టాలీవుడ్‌కు నష్టాలు కలిగించే స్థితికి తీసుకెళ్తోంది. పుష్ప-2 సినిమా ప్రీ రిలీజ్ సందర్బంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనతో సినీ ప్రముఖుల ధోరణిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) అసెంబ్లీలోనే తీవ్రంగా స్పందించారు. టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలపై కఠినంగా వ్యవహరించనున్నట్లు ఆయన ప్రకటించారు. గతంలో బీఆర్‌ఎస్ పాలనలో దగ్గరగా ఉన్న సినీ ప్రముఖులు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రావాల్సిన శ్రద్ధ చూపకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
New Phones : కొత్త ఫోన్ కొనుగోలు చేయాలనీ చూస్తున్నారా..? అయితే మీకో గుడ్ న్యూస్
తెలంగాణలో ఎలాంటి వైఖరి సినీ ప్రముఖులు ప్రదర్శించారో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్(AP)లో కూడా అదే ధోరణిని చూపుతున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawankalayan) తీవ్రంగా విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన సత్కారాన్ని పక్కనపెట్టి, ఇప్పటికీ సినీ ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలవడం లేదు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు సినీ ప్రముఖులు ఎదుర్కొన్న అవమానాలను మరచిపోయి. ప్రస్తుతం చిత్రసీమకు మేలు చేస్తున్న ప్రభుత్వం తో సహకరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పవన్ మండిపడ్డారు.
తెలంగాణలో ప్రాధాన్యం తగ్గిపోతున్న తరుణంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టాలీవుడ్‌ను ఆత్మీయంగా ఆహ్వానించడంతో కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయి. స్టూడియోలు నిర్మించుకోవడానికి భూములు, ప్రోత్సాహకాలు ప్రకటించినా, సినీ ప్రముఖులు స్పందించకపోవడం పట్ల ప్రభుత్వం ఆగ్రహం గా ఉంది. ఇక రాబోయే రోజుల్లో చిత్రసీమ కు ఏపీ సర్కార్ గట్టి షాకులు ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. మరి ఇప్పటికైనా చిత్రసీమ మేల్కొంటే బాగుండని అంత కోరుకుంటున్నారు.