HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Tollywood Has Lost Rs 3700 Crore Due To Piracy Cp Anand

Piracy : పైరసీ వల్ల టాలీవుడ్ రూ.3,700 కోట్ల నష్టం – సీపీ ఆనంద్

Piracy : కిరణ్ ముఠా అనే ప్రధాన నిందితుడు ఆధ్వర్యంలో పనిచేసిన పైరసీ గ్యాంగ్‌ టాలీవుడ్‌కు సుమారు రూ. 3,700 కోట్ల భారీ నష్టం కలిగించినట్లు పోలీసులు తెలిపారు.

  • Author : Sudheer Date : 29-09-2025 - 2:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Movie Piracy
Movie Piracy

టాలీవుడ్‌ పరిశ్రమపై పైరసీ (Piracy ) ముఠాల దాడి రోజు రోజుకూ పెరుగుతోంది. తాజాగా హైదరాబాద్ సీపీ ఆనంద్ (CP Anand) వెల్లడించిన వివరాలు సినీ వర్గాలను షాక్‌కు గురి చేశాయి. కిరణ్ ముఠా అనే ప్రధాన నిందితుడు ఆధ్వర్యంలో పనిచేసిన పైరసీ గ్యాంగ్‌ టాలీవుడ్‌కు సుమారు రూ. 3,700 కోట్ల భారీ నష్టం కలిగించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠా ప్రత్యేకమైన యాప్‌ సహాయంతో 40కి పైగా సినిమాలను నేరుగా థియేటర్లలోనే రికార్డ్ చేసి, పైరసీ వెబ్‌సైట్లు, ఛానెల్స్‌ ద్వారా వ్యాప్తి చేసినట్లు విచారణలో తేలింది.

VC Sajanar : ఆర్టీసీ కి బై బై చెపుతూ సజ్జనార్ ఇచ్చిన సందేశం ఇదే!

ఇప్పటి వరకు పైరసీని కేవలం కెమెరా రికార్డింగ్ వరకు మాత్రమే అనుకునే పరిస్థితి ఉండగా, ఈ ముఠా దాన్ని మరింత ప్రమాదకర స్థాయికి తీసుకెళ్లింది. సినిమాలను నేరుగా డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్‌ నుంచే హ్యాక్‌ చేసి కాపీ చేయడం ద్వారా, అత్యున్నత సాంకేతిక నేరాలకు పాల్పడింది. పైరసీ కంటెంట్‌ను టెలిగ్రామ్ ఛానెల్స్, టొరెంట్స్ వంటి వేదికలపై అప్‌లోడ్ చేసి, వాటి ద్వారా బెట్టింగ్, గేమింగ్ యాప్‌ల ప్రకటనలు పెట్టి అధిక ఆదాయం పొందడం ఈ గ్యాంగ్ వ్యూహంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మోడల్‌ వల్ల సినిమా థియేటర్లు, నిర్మాతలు మాత్రమే కాకుండా, మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీకి ఉద్యోగాల కోత, పెట్టుబడుల తగ్గింపు వంటి పరిణామాలు కలుగుతున్నాయి.

ఈ ఘటనతో టాలీవుడ్‌లో పైరసీ సమస్య ఎంత లోతుగా వేర్లు వేసిందో మరోసారి బయటపడింది. ఫిల్మ్ ఇండస్ట్రీ కృషి, పెట్టుబడులను ఒక్క క్షణంలో తారుమారు చేసే ఈ నేరాన్ని అరికట్టడానికి కఠిన చట్టాలు, ప్రత్యేక సాంకేతిక పద్ధతులు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. పైరసీ కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసే వారు, పంచే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. సినీ రంగం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం, పోలీస్ శాఖ, సాంకేతిక సంస్థలు కలిసి పని చేస్తూ ఈ డిజిటల్ నేరాలపై అడ్డుకట్ట వేయడం అత్యవసరమని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 700 crore
  • CP Anand
  • Loss of Rs. 3
  • movies
  • Piracy
  • Piracy effect
  • tollywood

Related News

Launch of Ram Pothineni's new movie as hero and director.

RAPO 23: హీరోగా, దర్శకుడిగా రామ్ పోతినేని కొత్త సినిమా ఓపెనింగ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన 23వ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. RAPO23 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిశోర్ ఈ కార్యక్రమానికి హాజరై క్లాప్ కొట్టగా, రామ్ తండ్రి మురళీ పోతినేని కెమెరా స్విచ్ ఆన్ చేసి సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ఈ చిత్రాన్ని రామ్ సోదరుడు కృష్ణ

  • Good news for NTR fans: Time fixed for the 'God of War' announcement.

    NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్​మెంట్​కు టైమ్ ఫిక్స్​

Latest News

  • NTR Trivikram: ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ మూవీ.. ఫ్యాన్స్‌కు పండగ.. పోస్టర్ అదిరిందిగా

  • DSP Transfers: తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు

  • Alcohol: మీకు ఆల్కహాల్ తాగే అలవాటు ఉందా..? అయితే వీటి వినియోగంలో జాగ్రత్త…!!

  • Ashok Gajapathi Raju: నా స్థలాన్ని ప్రభుత్వ భూమిగా మార్చారు: అశోక్ గజపతిరాజు

  • Hero MotoCorp : హీరో మోటోకార్ప్ సరికొత్త ప్రయోగం.. మార్కెట్లోకి ‘ప్యాషన్+ డిస్క్’ లాంచ్!

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd