VC Sajanar : ఆర్టీసీ కి బై బై చెపుతూ సజ్జనార్ ఇచ్చిన సందేశం ఇదే!
VC Sajanar : ప్రస్తుతం సజ్జనార్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (HYD CP) గా నియమితులయ్యారు. RTCలో ఆయన చూపిన క్రమశిక్షణ, ప్రజాసేవా దృక్పథం, నిర్వహణా నైపుణ్యం హైదరాబాద్ పోలీస్ విభాగంలో కూడా కొనసాగుతుందనే నమ్మకం వ్యక్తమవుతోంది
- By Sudheer Published Date - 01:06 PM, Mon - 29 September 25

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన వీ.సీ. సజ్జనార్ తన చివరి రోజున కూడా సాధారణ ఉద్యోగిలా బస్సులో కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా RTC ఉద్యోగులు బ్యాండు బాజాలతో ఘనంగా స్వాగతం పలికారు. సాధారణంగా ఉన్నతాధికారులు తమ పదవి వీడే సమయంలో ప్రత్యేక వాహనాలు ఉపయోగించుకుంటారు కానీ సజ్జనార్ మాత్రం సంస్థ బస్సును ఎంచుకోవడం ద్వారా తన వినయాన్ని, ఆ సంస్థపై తనకున్న అనుబంధాన్ని స్పష్టంగా చూపించారు.
Gold Price : ఈరోజు గోల్డ్ ధర ఎంత పెరిగిందంటే !!
సజ్జనార్ తన పదవీకాలాన్ని గుర్తుచేసుకుంటూ మాట్లాడుతూ.. “నేను ఎండీగా వచ్చిన మొదట్లో ‘ఈ సంస్థను కాపాడుకుందాం’ అనే ధోరణి ఉండేది. కానీ ఇప్పుడు ‘ఈ సంస్థ నాది, నా సంస్థ ఇంకా అభివృద్ధి చెందాలి’ అనే ఆత్మవిశ్వాసం పెరిగింది” అని తెలిపారు. ఈ మాటలు ఉద్యోగుల్లో సానుకూల భావనను పెంచాయి. RTCలో డిజిటలైజేషన్, ఫ్లీట్ మోడర్నైజేషన్, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు వంటి పలు సంస్కరణలను ఆయన అమలు చేసి, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి చేశారు. ఈ క్రమంలో ఉద్యోగులు, కార్మిక సంఘాల మధ్య సమన్వయం సాధించడం కూడా సజ్జనార్‌కు పెద్ద సవాలే అయినా, దానిని సమర్థవంతంగా నిర్వహించారు.
ప్రస్తుతం సజ్జనార్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (HYD CP) గా నియమితులయ్యారు. RTCలో ఆయన చూపిన క్రమశిక్షణ, ప్రజాసేవా దృక్పథం, నిర్వహణా నైపుణ్యం హైదరాబాద్ పోలీస్ విభాగంలో కూడా కొనసాగుతుందనే నమ్మకం వ్యక్తమవుతోంది. RTCలో ఉద్యోగుల సహకారాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఒక ప్రభుత్వాధికారి తన పదవిని వదిలే సమయంలో ఇంత వినయంగా, అనుబంధంతో వ్యవహరించడం ఉద్యోగుల్లోనూ, ప్రజల్లోనూ ఆయనకు గౌరవాన్ని మరింత పెంచింది.
113 I/M it is 🫣
VC Sajjanar on his last day as Managing Director of TGRTC took a bus ride
— Naveena (@TheNaveena) September 29, 2025