Raja Saab Trailer: రాజాసాబ్ ట్రైలర్, రిలీజ్ డేట్ వచ్చేసింది!
దర్శకుడు మారుతి స్టైలిష్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ ద్విపాత్రాభినయం (డ్యూయల్ రోల్) పోషిస్తుండటం విశేషం. ట్రైలర్ ద్వారా ఈ మూవీ హరర్ జానర్‌కు సంబంధించినట్లు తెలుస్తుంది.
- By Gopichand Published Date - 06:33 PM, Mon - 29 September 25

Raja Saab Trailer: ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘రాజాసాబ్’ విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. తాజాగా చిత్రబృందం ఈ సినిమా ట్రైలర్‌ను (Raja Saab Trailer) విడుదల చేయడంతో పాటు, రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించింది. ఈ సినిమాను వచ్చే ఏడాది అంటే జనవరి 9, 2026 నాడు సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.
మారుతి మార్క్, ప్రభాస్ డ్యూయల్ రోల్
దర్శకుడు మారుతి స్టైలిష్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ ద్విపాత్రాభినయం (డ్యూయల్ రోల్) పోషిస్తుండటం విశేషం. ట్రైలర్ ద్వారా ఈ మూవీ హరర్ జానర్‌కు సంబంధించినట్లు తెలుస్తుంది. ఈ మూవీలో ప్రభాస్ తాతగా.. మనువడిగా రెండు పాత్రల్లో నటిస్తున్నారు. ఈ రెండు పాత్రలలో ప్రభాస్ వేరియేషన్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.మారుతి తనదైన శైలిలో ఎమోషన్, కామెడీ, హై-ఆక్షన్ అంశాలను సమపాళ్లలో మిళితం చేసి ఈ చిత్రాన్ని రూపొందించినట్లు ట్రైలర్ స్పష్టం చేసింది. ఈ సినిమా విజువల్స్, నిర్మాణ విలువలు చాలా గ్రాండ్‌గా ఉండటం, మారుతి మేకింగ్‌లో ప్రభాస్ సరికొత్తగా కనిపించడం అభిమానులను అలరిస్తోంది.
Also Read: Chris Woakes: అంతర్జాతీయ క్రికెట్‌కు స్టార్ ప్లేయర్ గుడ్ బై!
ముగ్గురు కథానాయికల గ్లామర్
‘రాజాసాబ్’ చిత్రంలో ముగ్గురు అగ్ర కథానాయికలు ప్రభాస్ సరసన నటించారు. ఈ ముగ్గురు హీరోయిన్ల మధ్య నడిచే లవ్ ట్రాక్, కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించేలా కనిపిస్తున్నాయి. ట్రైలర్‌లో వీరి పాత్రలకు సంబంధించిన కొన్ని కీలకమైన దృశ్యాలను చూపించడంతో కథానాయికల పాత్రలకు కూడా కథలో తగిన ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది.
సంక్రాంతి పండుగ రేసులో ‘రాజాసాబ్’ బరిలోకి దిగడంతో ఇది భారీ వసూళ్లను సాధించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రభాస్ అభిమానులంతా ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద ప్రభంజనాన్ని చూడటానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. జనవరి 9, 2026న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.