HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Tabu In Nagarjunas 100th Movie

నాగార్జున 100 మూవీ లో టబు..!

  • Author : Vamsi Chowdary Korata Date : 28-01-2026 - 4:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
King 100 Movie
King 100 Movie

Akkineni Nagarjuna  అక్కినేని నాగార్జున తన కెరీర్ లో మైలురాయి 100వ చిత్రంలో నటిస్తున్నారు. రా. కార్తీక్ అనే తమిళ దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో సీనియర్ నటి టబు కీలక పాత్రలో నటిస్తున్నారని సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ యాక్షన్ ఎమోషనల్ డ్రామా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కానీ చిత్ర బృందం ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా సైలెంట్ గా చిత్రీకరణ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన న్యూస్ వినిపిస్తోంది.

కింగ్ అక్కినేని నాగార్జున తన కెరీర్ లో మైల్ స్టోన్ మూవీకి చేరువయ్యారు. వైవిధ్యమైన సినిమాలతో, విలక్షణమైన పాత్రలతో గత మూడున్నర దశాబ్దాలుగా సినీ అభిమానులను అలరిస్తున్న ఆయన.. ప్రస్తుతం తన 100వ చిత్రంలో నటిస్తున్నారు. ‘కింగ్‌ 100’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో సెట్స్ మీదకు వెళ్లిన ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అప్డేట్ కోసం అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

కోలీవుడ్ డైరెక్టర్ రా. కార్తీక్ దర్శకత్వంలో ‘కింగ్‌ 100’ చిత్రం తెరకెక్కుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతేడాది ఎలాంటి హడావిడి లేకుండా సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కానీ మేకర్స్ సైడ్ నుంచి ఇంతవరకూ ఎలాంటి అప్డేట్ లేదు. అనౌన్స్ మెంట్ లేకుండానే సైలెంట్ గా షూటింగ్ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్‌ సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. నాగార్జునతో పాటు ఇతర ప్రధాన తారాగణం పాల్గొనే కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నట్లు సమాచారం.

జోనర్ ఏంటనేది క్లారిటీ లేదు కానీ.. యాక్షన్‌, ఎమోషన్స్ ప్రధానంగా సాగే కథతో ‘కింగ్‌ 100’ చిత్రం తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఇప్పటివరకూ వచ్చిన సినిమాల మాదిరిగా కాకుండా, డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమా ఉంటుందట. సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని, రియలిస్టిక్ యాక్షన్ తో రూపొందుతోందని నాగ్ ఓ ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో కథానుగుణంగా నాగార్జున మూడు గెటప్స్ లో కనిపిస్తారని, ముగ్గురు కథానాయికలు ఉంటారని టాక్ వినిపిస్తోంది.

సీనియర్ హీరోయిన్ టబుని ఒక పాత్రకి ఫిక్స్ చేశారు. టబు స్వయంగా తన వందో సినిమాలో ఉండాలని కోరుకుందని నాగ్ తెలిపారు. ‘నాట్యం’ ఫేమ్ సుస్మితా భ‌ట్ లను మరో హీరోయిన్ ఎంపిక చేశారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల శిర్డీ సాయిబాబాని దర్శించుకున్న నాగార్జున.. తన 100వ సినిమా ఈ ఏడాదే ఉంటుందని తెలిపారు. ఎంతో ఎగ్జైటెడ్ గా ఉన్నానని, తనకు బిగ్ మైల్ స్టోన్ మూవీ అని అన్నారు. తనను అభిమానించే వారందరికీ గుర్తుండిపోయే సినిమా అవుతుందని పేర్కొన్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాని ఎక్కువ శాతం దసరా సీజన్ లో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని టాక్.

2024 సంక్రాంతికి ‘నా సామిరంగా’ సినిమాతో హిట్టు కొట్టిన నాగ్.. లాస్ట్ ఇయర్ ‘కూలీ’, ‘కుబేర’ లాంటి చిత్రాలతో అలరించారు. కానీ ఈ రెండిటిలో ఆయన మెయిన్ హీరో కాదు. అందుకే ‘కింగ్‌ 100’ సినిమాతో సత్తా చాటాలని అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంటి తన సమకాలీన హీరోలు బాక్సాఫీస్ దగ్గర వందల కోట్ల కలెక్షన్స్ సాధిస్తున్న తరుణంలో.. నాగార్జున కూడా భారీ బ్లాక్ బస్టర్ కొట్టాలని ఆశిస్తున్నారు. మరి మైలురాయి మూవీ ఎలాంటి విజయాన్ని అందిస్తుందో వేచి చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • akkineni nagarjuna
  • cinema updates
  • heroine tabu
  • King 100 movie
  • latest update
  • shooting update
  • Tollywood Cinema Updates

Related News

Premabhishekam 45 Years

ఏఎన్ఆర్ ప్రేమాభిషేకంకి 45 ఏళ్లు..స్పెషల్‌ వీడియో షేర్‌ చేసిన అన్నపూర్ణ స్టూడియోస్‌

Premabhishekam 45 Years  అక్కినేని నాగేశ్వరరావు కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన సినిమాలలో ‘ప్రేమాభిషేకం’ ఒకటి. దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం.. విడుదలై నేటికి (ఫిబ్రవరి 18) సరిగ్గా 45 ఏళ్లు పూర్తయింది. ప్రేమ, త్యాగం మేళవింపుగా సాగే ఈ ప్రేమకథ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా నిలిచిపోయింది. ఈ హిస్టారికల్ బ్లాక్ బస్టర్ 45 ఏళ్లు పూర్తి చేసు

    Latest News

    • Kutami (Alliance) Govt : కూటమిని కూల్చే వరకు నా పోరాటం ఆగదు- అంబటి కీలక వ్యాఖ్యలు

    • Condoms : కండోమ్స్ ఎక్కువగా వాడుతున్నారా..? అయితే మీకు ఈ సమస్య వచ్చినట్లే ? నిజమా ?

    • డ‌బ్ల్యూహెచ్‌వో హెచ్చ‌రిక‌.. 2050 నాటికి ప్రతి నలుగురిలో ఒకరికి ఆ స‌మ‌స్య‌!!

    • PEPAIR : శ్వాసకోశ రోగులకు ‘పిపెయిర్’ వరం

    • ఐపీఎల్ 2026.. ఫిట్‌గా స్టార్ ప్లేయ‌ర్!

    Trending News

      • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

      • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

      • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

      • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

      • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd