Singer Kalpana: మా కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవు.. కల్పన సూసైడ్ పై క్లారిటీ ఇచ్చిన కూతురు!
టాలీవుడ్ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం గురించి ఆమె కూతురు స్పందిస్తూ ఎలాంటి గొడవలు లేవు అంటూ సమాధానం ఇచ్చింది.
- By Anshu Published Date - 04:35 PM, Wed - 5 March 25

టాలీవుడ్ ప్రముఖ సింగర్ కల్పన తాజాగా ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలిసిందే. ఇది అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. చాలా మంది ఈ విషయం తెలిసి షాక్ అవుతున్నారు సెలబ్రిటీస్. అయితే ఆమె ఆత్మహత్యాయత్నం చేసిన తర్వాత సరైన సమయంలో స్పందించిన పోలీసులు స్థానికులు వెంటనే ఆమెను హాస్పిటల్ లో చేర్పించడంతో పరిస్థితి కాస్త కుదుటపడింది. అయితే కల్పన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.
అయితే కల్పన ఆత్మహత్యాయత్నంపై ప్రస్తుతం అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. కల్పన ఆత్మహత్య యత్నంపై పోలీసులు తొలుత ఆమె భర్తని అనుమానించారు. మంగళవారం సాయంత్రం ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. కానీ చాలా సినిమా తెలిసిన విషయం ఏమిటంటే కూతురితో జరిగిన వాగ్వాదం వల్లే కల్పన ఇలా చేశారనే విషయం ఒకటి బయటకొచ్చింది. ఇప్పుడు మీడియాతో మాట్లాడిన కల్పన కూతురు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కల్పనా కూతురు మాట్లాడుతూ.. నా తల్లి కల్పన ఆత్మహత్యాయత్నం చేయలేదు.
డాక్టర్స్ సూచన మేరకు జోల్ ఫ్రెష్ మాత్రలు తీసుకుంటుంది. మాత్రలు ఎక్కువ మోతాదులో తీసుకోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. మా కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవు. హైదరాబాద్ లో మా అమ్మ లా పీజీ చేస్తోంది. మానసిక ఒత్తిడితో నిద్రలేమికి గురవుతూ ఉండేది అని కల్పన కూతురు చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఇందులో నిజా నిజాలు తెలియాలి అంటే కల్పన స్పృహ లోకి వచ్చే వరకు వేచి చూడాల్సిందే మరి..