Allu Arjun-Samantha: నా యాక్టింగ్ రోల్ మోడల్ అన్ని ఆ హీరోనే : సమంత
- Author : Sailaja Reddy
Date : 05-03-2024 - 10:00 IST
Published By : Hashtagu Telugu Desk
టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2 లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. గతంలో విడుదల అయిన పుష్ప వన్ సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం పాన్ ఇండియా అభిమానులు కళ్ళు కాయలు కాచే విధంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. ఇది ఇలా ఉంటే తాజాగా అల్లు అర్జున్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.
అల్లు అర్జున్ సమంత ఇద్దరు కలిసి సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అలాగే పుష్ప పార్ట్ 1 సినిమాలో ఊ అంటావా మామ అంటూ పాటతో ఒక ఊపు ఊపేసింది సమంత. ఐటెం సాంగ్ లో కలిసి చిందేసి ఆడియన్స్ ని ఉర్రూతలూగించారు. వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా వస్తే చూడాలని ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే సమంత ప్రస్తుతం యాక్టింగ్ కి బ్రేక్ ఇచ్చి తన హెల్త్ పై ఫోకస్ పెట్టింది. మైయోసైటిస్ నుంచి కోలుకునేందుకు చికిత్స తీసుకుంటున్న సమంత సినిమాలతో దూరంగా ఉన్నా, కొన్ని ఈవెంట్స్ కి గెస్ట్ గా హాజరవుతూ ఆడియన్స్ కి అప్పుడప్పుడు కనిపిస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే రీసెంట్ గా ఒక కాలేజీ ఈవెంట్ లో పాల్గొన్నారు.
Industry always Inspired by the best @alluarjun 🙌
AlluArjun transformed into an ACTING BEAST – @Samanthaprabhu2 pic.twitter.com/fVZNQ5iBuf
— Trends Allu Arjun ™ (@TrendsAlluArjun) March 4, 2024
ఈ ఈవెంట్ లో స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయిన సమంత.. వారు అడిగిన ప్రశ్నలకు జవాబు ఇస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఒక స్టూడెంట్.. మీకు యాక్టింగ్ రోల్ మోడల్ ఎవరు? అని ప్రశ్నించగా.. దానికి సమంత బదులిస్తూ..నా యాక్టింగ్ రోల్ మోడల్ అల్లు అర్జున్. తనతో కలిసి మరో నటించాలని అనుకుంటున్నాను. ఎందుకంటే, తను ఇప్పుడు ఒక యాక్టింగ్ బీస్ట్ గా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోని అల్లు ఫ్యాన్స్ నెట్టింట వైరల్ చేస్తూ సందడి చేస్తున్నారు.