HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >Salman Khan Death Threat Case Accused Released On Grounds Of Mental Health Salman Shares Pics Of Biceps

Salman Khan : సల్మాన్‌ఖాన్‌‌కు బెదిరింపు మెసేజ్ పంపిన వ్యక్తి దొరికాడు.. అయితే !!

అవసరమైతే సల్మాన్ ఖాన్(Salman Khan) కారులో బాంబు పెట్టి పేలుస్తాం’’ అని బెదిరింపు మెసేజ్‌లో మయాంక్ హెచ్చరించాడు.

  • By Pasha Published Date - 12:09 PM, Tue - 15 April 25
  • daily-hunt
Salman Khan Biceps Mumbai Vadodara Gujarat Mental Health Worli Police

Salman Khan : బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌‌కు మూడు రోజుల క్రితం హత్య బెదిరింపు సందేశాలు పంపిన వ్యక్తి  దొరికాడు. సదరు నిందితుడి పేరు మయాంక్ పాండ్యా. వయసు 26 ఏళ్లు.  గుజరాత్‌లోని వడోదర వాస్తవ్యుడు.  ముంబైలోని వర్లీ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మయాంక్ ఏప్రిల్ 13న ఉదయం 6:30 గంటలకు ముంబైలోని వర్లీ ట్రాఫిక్ పోలీసుల వాట్సాప్ హెల్ప్‌లైన్‌ నంబరుకు బెదిరింపు సందేశాన్ని పంపాడు. ఆ నంబరును ట్రాక్ చేయగా.. అది గుజరాత్‌లోని వడోదరలో ఉన్నట్లు వెల్లడైంది. ‘‘సల్మాన్‌ను ఇంట్లోకి వెళ్లి చంపుతాం. అవసరమైతే సల్మాన్ ఖాన్(Salman Khan) కారులో బాంబు పెట్టి పేలుస్తాం’’ అని బెదిరింపు మెసేజ్‌లో మయాంక్ హెచ్చరించాడు. ఈ  సందేశంలో అతడు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరును కూడా ప్రస్తావించాడని తెలుస్తోంది.  దీనిపై వర్లీ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 351(2), 351(3) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Also Read :Robert Vadra : ఈడీ ఎదుటకు రాబర్ట్ వాద్రా.. ఆయనపై అభియోగం ఏమిటి ?

రెండు, మూడు రోజుల తర్వాత మళ్లీ.. 

ముంబై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (జోన్ 3), దత్తాత్రే కాంబాలే వెంటనే ఒక పోలీసు బృందాన్ని వడోదరకు పంపారు. అక్కడ వారు అనుమానితుడు మయాంక్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మయాంక్‌ను తీవ్రంగా ప్రశ్నించిన అనంతరం పోలీసులు వదిలేశారు. మయాంక్ మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. రెండు, మూడు రోజుల తర్వాత మరోసారి తమ ఎదుట విచారణకు హాజరుకావాలని మయాంక్‌కు ముంబై పోలీసులు సూచించారట.

Also Read :Split In NDA : ఎన్‌డీఏకు కటీఫ్.. ‘ఇండియా’లోకి ఆ పార్టీ ?

మయాంక్‌కు పిచ్చి నిజమేనా ? 

మానసిక సమస్యలు కలిగిన వారు తమ గురించి తామే సరిగ్గా ఆలోచించుకోలేరు. సల్మాన్ ఖాన్ గురించి ఎలా ఆలోచిస్తారు ? ఒకవేళ సల్లూ భాయ్ గురించి ఆలోచించినా.. చంపాలని ఎందుకు అనుకుంటారు ? ఇతరులను చంపాలని నిర్ణయించుకునే పిచ్చి వ్యక్తి.. అంత పర్ఫెక్టుగా వార్నింగ్ మెసేజ్‌ను రాయగలడా ? ఈ ప్రశ్నలన్నింటికీ ముంబై పోలీసు వర్గాలు సమాధానాలను అన్వేషించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే చాలాసార్లు సల్మాన్ ఖాన్‌కు హత్య బెదిరింపులు పంపిన లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం గుజరాత్‌లోని సబర్మతీ జైలులోనే ఉన్నాడు. ఈసారి సల్మాన్‌కు బెదిరింపు మెసేజ్ వచ్చింది కూడా గుజరాత్ నుంచే. ఇటీవలే బెదిరింపు మెసేజ్ పంపిన మయాంక్ పాండ్యాకు పిచ్చి ఉండి ఉంటే.. అతడి ఫోన్‌ ద్వారా చక్కగా వార్నింగ్ మెసేజ్‌ను రాసి పంపింది ఎవరు ? అనే విషయాన్ని పోలీసులు తేల్చాల్సి ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan)

కండలు చూపిస్తూ సల్లూభాయ్ ఫొటోలు

ఓ వైపు హత్య బెదిరింపులు వస్తున్నా.. సల్మాన్ ఖాన్ కూల్‌గా తన పని తాను కానిస్తున్నారు. రోజూ ఆయన జిమ్ వర్కౌట్లు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. తాజాగా జిమ్ వర్కౌట్ వేళ తన కండలను చూపిస్తూ దిగిన పలు ఫొటోలను ఆయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. తద్వారా బెదిరింపులకు భయపడేది లేదనే సందేశాన్ని ఇచ్చారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crime
  • gujarat
  • Mental Health
  • mumbai
  • Salman Biceps
  • salman khan
  • Vadodara
  • Worli Police

Related News

Bomb Threat

Bomb Threat : ఉలిక్కపడ్డ ముంబయి.. ఫ్రెండ్ మీద కోపంతో ఫేక్‌ ఉగ్ర బెదిరింపు మెయిల్‌

Bomb Threat : దేశ ఆర్థిక రాజధాని ముంబయి మరోసారి ఉగ్ర బెదిరింపులతో కాసేపు ఉలిక్కిపడింది. నగరంలో భారీ ఉగ్రదాడులు జరగనున్నాయంటూ శుక్రవారం ముంబయి ట్రాఫిక్‌ పోలీసులకు ఒక ఇమెయిల్‌ రావడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.

  • High alert in Mumbai.. Security tightened due to warning of terror attacks

    Ganesh Immersion : ముంబైలో హై అలర్ట్.. ఉగ్రదాడుల హెచ్చరికతో భద్రత కట్టుదిట్టం

  • Do you know who was the first person to buy the first Tesla car in India?

    Tesla Car : భార‌త్‌లో తొలి టెస్లా కారు.. కొన్న మొద‌టి వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

Latest News

  • Ganesh Immersion : బై బై గణేశా.. నేడే మహానిమజ్జనం

  • Production of Eggs : గుడ్ల ఉత్పత్తిలో ఏపీ నం.1

  • Alert : 13న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

  • GST 2.0 : GST 2.0తో ప్రభుత్వానికి ఎంత నష్టమంటే?

  • Kavitha Vs Harish : నాపై చేసిన ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా..కవిత కు ఇన్ డైరెక్ట్ కౌంటర్ ఇచ్చిన హరీశ్

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd