Prashanth Varma : తేజాని స్టార్ ని చేసినందుకు సంతోషంగా ఉంది.. వాళ్లవల్లే ఇదంతా సాధ్యమైంది..!
హనుమాన్ సినిమాతో తేజాని స్టార్త్ ని చేసినందుకు సంతోషంగా ఉందని అన్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Varma). సంక్రాంతికి రిలీజైన హనుమాన్ సినిమా తీవ్రమైన పోటీని తట్టుకుని
- Author : Ramesh
Date : 28-01-2024 - 9:14 IST
Published By : Hashtagu Telugu Desk
హనుమాన్ సినిమాతో తేజాని స్టార్త్ ని చేసినందుకు సంతోషంగా ఉందని అన్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Varma). సంక్రాంతికి రిలీజైన హనుమాన్ సినిమా తీవ్రమైన పోటీని తట్టుకుని నిలబడి సంక్రాంతి సెన్సేషనల్ విన్నర్ గా నిలిచింది. ఈ సినిమా తెలుగుతో పాటుగా పాన్ ఇండియా లెవెల్ లో బీభత్సమైన వసూళ్లను రాబడుతుంది.
We’re now on WhatsApp : Click to Join
15 రోజుల్లో 250 కోట్లతో హనుమాన్ బాక్సాఫీస్ పై వసూళ్ల సునామి సృష్టించింది. ఈ సందర్భంగా సినిమా సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు మేకర్స్.
ఈవెంట్ లో మాట్లాడిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తనకు మొదటి నుంచి ఎంతో సపోర్ట్ గా ఉన్న తన భార్య, తల్లికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు. తనని నిర్మాత నిరంజన్ రెడ్డికి పరిచయం చేసిన పి.ఆర్.ఓ వంశీ శేఖర్ కి స్పెషల్ థాంక్స్ అన్నారు ప్రశాంత్ వర్మ. నిర్మాత నిరంజన్ రెడ్డి లాంటి మంచి మనసున్న నిర్మాత దొరకడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. సినిమా మొత్తం ఆయన అందించిన సపోర్ట్ ఎంతో గొప్పదని అన్నారు.
తేజ చైల్డ్ ఆర్టిస్ట్ అప్పటి నుంచి తనకు తెలుసని.. అయితే అతడితో సినిమా ఎప్పుడు చేస్తావని కొందరు అడిగితే తాను మంచి యాక్టర్స్ తోనే సినిమలు చేస్తానని అన్నాను.. అయితే హనుమాన్ కి అతన్ని ఎంచుకోవడం రైట్ చాయిస్ అని.. ఆ పాత్రలో తేజ ఒదిగిపోయిన తీరు అద్భుతమని అన్నారు. తేజని హీరోగా చేయడం ఎంత సంతృప్తి అనిపించిందో.. ఈ మూవీతో అతన్ని స్టార్ గా పేరు తెచ్చుకోవడం అంత ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు ప్రశాంత్ వర్మ.
ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరు అద్భుతంగా నటించి సినిమాకు వన్నె తెచ్చారని.. తమ సినిమాను ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.
Also Read : Sukumar : పుష్ప 2 తర్వాత సుకుమార్ ప్లన్ ఏంటి.. స్టార్స్ అంతా బిజీ.. అతనొక్కడే ఆప్షన్..!