Kalki 2898AD Kamal Hassan Remuneration : కల్కి కోసం కమల్ హాసన్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత..?
Kalki 2898AD Kamal Hassan Remuneration రెబల్ స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కల్కి 2898 AD. వైజయంతి మూవీస్ 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న
- By Ramesh Published Date - 12:23 PM, Tue - 20 February 24

Kalki 2898AD Kamal Hassan Remuneration రెబల్ స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కల్కి 2898 AD. వైజయంతి మూవీస్ 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా లో లోకనాయకుడు కమల్ హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో దీపిక పదుకొనె హీరోయిన్ గా నటిస్తుండగా దిశా పటాని, అమితాబ్ బచ్చన్ లు కూడా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారు.
రెండు భాగాలుగా వస్తున్న కల్కి సినిమా లో నటించినందుకు గాను ప్రభాస్ భారీ రెమ్యునరేషన్ నే అందుకుంటున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ 100 కోట్ల పైన రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది. అయితే ప్రభాస్ కి ప్రతి నాయకుడిగా నటిస్తున్న కమల్ హాసన్ కి కూడా ప్రభాస్ తర్వాత భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నారని తెలుస్తుంది.
కమల్ హాసన్ కెరీర్ బెస్ట్ రెమ్యునరేషన్ గా కల్కి కి అందుకుంటున్నారని తెలుస్తుంది. ఈ సినిమాకు కమల్ హాసన్ కు కూడా 50 కోట్ల పైన రెమ్యునరేషన్ ఇస్తున్నారని తెలుస్తుంది. సినిమాలో మరో హైలెట్ గా కమల్ నటన ఉంటుందని చెప్పుకుంటున్నారు. సో ప్రభాస్, కమల్ ఇద్దరి రెమ్యునరేషన్ కోసమే దాదాపు 150 కోట్ల దాకా ఖర్చు అవుతుందని తెలుస్తుంది.
ప్రభాస్ కల్కి సినిమా మే 9న రిలీజ్ లాక్ చేశారు. హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందని తెలుస్తుంది. సినిమాపై మేకర్స్ అంతా కూడా భారీ హోప్స్ తో ఉన్నారు.
Also Read : Shruthi Hassan : అలా శారీరకంగా అలసిపోవడం ఇష్టమంటున్న శృతి హాసన్..!