Shruthi Hassan : అలా శారీరకంగా అలసిపోవడం ఇష్టమంటున్న శృతి హాసన్..!
కమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్ (Shruthi Hassan) మళ్లీ ఇప్పుడు తిరిగి ఫాం లోకి వచ్చింది. ఆమధ్యలో కొన్నాళ్లు అమ్మడు సినిమాల విషయంలో చూపించిన అశ్రద్ధ వల్ల చేతి దాకా వచ్చిన అవకాశాలు
- By Ramesh Published Date - 11:56 AM, Tue - 20 February 24
కమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్ (Shruthi Hassan) మళ్లీ ఇప్పుడు తిరిగి ఫాం లోకి వచ్చింది. ఆమధ్యలో కొన్నాళ్లు అమ్మడు సినిమాల విషయంలో చూపించిన అశ్రద్ధ వల్ల చేతి దాకా వచ్చిన అవకాశాలు కూడా కోల్పోయింది. వకీల్ సాబ్ తో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ వరుస క్రేజీ ఛాన్స్ లతో అదరగొట్టేస్తుంది. లాస్ట్ ఇయర్ 3 సినిమాల్లో నటించిన శృతి హాసన్ ప్రభాస్ సలార్ 1 తో కూడా మెప్పించింది. ప్రస్తుతం అడివి శేష్ తో చేస్తున్న సినిమా లో భాగం అవుతుంది అమ్మడు.
ఇక రీసెంట్ స్పెషల్ చిట్ చాట్ లో భాగంగా తన సినిమా సెలక్షన్.. తన కష్టపడే పనితీరు గురించి చెప్పుకొచ్చింది అమ్మడు. సినిమాల్లో తను ఎలాంటి పాత్ర అయినా చేసేందుకు రెడీ అంటుంది. అది హీరోయిన్ పాత్ర కానవసరం లేదు. ఇంపార్టెంట్ రోల్ అయితే వేరే వారి సినిమాల్లో కూడా చేస్తానని చెప్పుకొచ్చింది. అంతేకాదు చేసే పని మీద 100 శాతం ఫోకస్ పెడతానని అంటుంది.
రోజంతా కష్టపడి పనిచేస్తే మానసికంగా శారీరకంగా అలసిపోవడం తనకు ఇష్టమని. అలా కష్టపడ్డ రోజు తను ప్రశాంతంగా నిద్రపోతానని.. అలా కష్టపడని రోజు అంతగా ఇష్టం ఉండదని అంటుంది శృతి హాసన్. శ్రమించడం కోసం తాను రెడీ అంటుంది అమ్మడు. తెలుగు తమిళ భాషల్లో ప్రస్తుతం ఫాం కొనసాగిస్తున్న శృతి హాసన్ కొన్నాళ్లు ఇదే హవా కొనసాగించేలా ఉందని చెప్పొచ్చు.
Also Read : Anupama Parameswaran : సావిత్రి సౌందర్య అనుకుంటే నువ్విలా చేస్తావా.. అనుపమపై అభిమాని ఆవేదన వీడియో వైరల్..!