Prabhas: ఫుల్ జోష్ లో డార్లింగ్ ప్రభాస్.. మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రెబల్ స్టార్?
ప్రస్తుతం బోలెడు పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ఉన్న హీరో ప్రభాస్ ఇప్పుడు పరువు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 11:03 AM, Wed - 26 February 25

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు ప్రభాస్. ఒకదాని తర్వాత ఒకటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్నారు. కాగా ప్రస్తుతం ప్రభాస్ చివరగా సలార్ మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగైదు పాన్ ఇండియా సినిమాలు ఉన్న విషయం తెలిసిందే.
ఎక్కువ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న హీరోలలో మొదటి స్థానంలో ఉన్నారు డార్లింగ్ ప్రభాస్. అరడజను సినిమాలతో బిజీగా ఉన్నారు.. కల్కి 2, రాజాసాబ్, హను రాఘవపూడి సినిమా, స్పిరిట్, సలార్ 2వంటి సినిమాలు ప్రభాస్ చేతిలో ఉన్నాయి. వీటిలో రాజా సాబ్ సినిమా మొదట విడుదల కానుంది. ఆ తర్వాత ఫౌజీ సినిమా విడుదల కానుంది. ఇలా చేతినిండా బోలెడు ప్రాజెక్టులతో బిజీబిజీగా గడుపుతున్న ప్రభాస్ ఇంకా ఈ సినిమాలో పూర్తికాక ముందే ఇప్పుడు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ది రాజా సాబ్ మూవీ ఏప్రిల్ 10న సినిమాను విడుదల చేయనున్నట్టు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఇప్పుడు మరో దర్శకుడికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఆ దర్శకుడు ఎవరో కాదు హనుమాన్ సినిమాతో సంచలన విజయం సాధించిన ప్రశాంత్ వర్మ. ఇప్పుడు వరుస ఆఫర్స్ అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రభాస్ తోనూ సినిమా చేయనున్నాడని ఇండస్ట్రీ టాక్. అంతే కాదు ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించే అవకాశా లున్నాయి. శివరాత్రి సందర్భంగా ఈ సినిమా కోసం లుక్ టెస్ట్ జరుగుతుందని అంటున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ జై హనుమన్ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో కన్నడ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.