HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Nandamuri Hero Giving A Chance To A New Director

Nandamuri Kalyan Ram : కొత్త డైరెక్టర్‌కి ఛాన్స్ ఇస్తోన్న నందమూరి హీరో..!

  • By Vamsi Chowdary Korata Published Date - 03:40 PM, Fri - 24 October 25
  • daily-hunt
Kalyan Ram
Kalyan Ram

నందమూరి హీరో నందమూరి కళ్యాణ్ రామ్ విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నాడు. మాస్, యాక్షన్, ఎమోషన్ మిళితమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఎప్పుడూ సంతృప్తిపరుస్తూ ఉంటాడు. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నాడు. 2003లో ‘తొలిచూపులోనే’ చిత్రంలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన 2005లో ‘అతనొక్కడే’తో బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నాడు. కెరీర్లో పడుతూ లేస్తూ ఉండటంతో ఆయన రేంజ్ పెరగడం లేదు. ఎప్పుడో ఒక హిట్ వచ్చినా దాన్ని నిలబెట్టుకోలేక సతమతమవుతున్నాడు. 2022లో ‘బింబిసార’లో కెరీర్లోనే పెద్ద హిట్టు కొట్టిన కళ్యాణ్రామ్.. అమిగోస్, డెవిల్, సన్నాఫ్ వైజయంతి చిత్రాలతో మళ్లీ పరాజయాల బాట పట్టాడు. దీంతో ఆయన పరిస్థితి మూడు అడుగులు ముందుకు ఆరగుడులు వెనక్కి అన్న చందంగా తయారైంది.

బింబిసార సినిమా ఆయన కెరీర్లో మేజర్ టర్నింగ్ పాయింట్గా నిలిచింది. ఆ సినిమాతో ఆయన నటనకు మంచి ప్రశంసలు లభించాయి. విజువల్ ప్రెజెంటేషన్, బీజీఎం, కళ్యాణ్ రామ్ పెర్ఫార్మెన్స్ కలిసి సినిమాను బ్లాక్బస్టర్ హిట్గా నిలబెట్టాయి. ఇటీవల వచ్చిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా తల్లి, కొడుకు సెంటిమెంట్ ఉన్నప్పటికీ ఆశించిన స్థాయి సక్సెస్ సాధించలేకపోయింది. ఆ తర్వాత కొంత విరామం తీసుకున్న కళ్యాణ్ రామ్ ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం, కళ్యాణ్ రామ్ రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వాటిలో ఒకటి బింబిసార 2 కాగా, మరొకటి కొత్త దర్శకుడితో తెరకెక్కనుందని తెలుస్తోంది. ఆ కొత్త దర్శకుడు మరెవరో కాదు రైటర్గా పేరుపొందిన శ్రీకాంత్ విస్సా. ఇప్పటివరకు పలు హిట్ సినిమాలకు డైలాగులు రాసిన ఆయన దర్శకుడిగా మారుతున్నారు. ఆయన రాసిన కథ కళ్యాణ్ రామ్కి బాగా నచ్చడంతో వెంటనే ప్రాజెక్ట్కి ఓకే చెప్పారట. ఈ సినిమాను 2026లో సెట్స్ మీదకు తీసుకెళ్లాలని యూనిట్ ప్లాన్ చేస్తోంది. నందమూరి అభిమానులు ఈ కాంబినేషన్పై సోషల్ మీడియాలో భారీ చర్చలు మొదలుపెట్టారు.

ఇక బింబిసార 2 విషయానికొస్తే.. ఇది క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో మగధ సామ్రాజ్యాధిపతి బింబిసారుడి కథ ఆధారంగా తెరకెక్కిన మొదటి సినిమాకి సీక్వెల్. వశిష్ఠ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ డ్యుయెల్ రోల్ పోషించగా, కేథరిన్ థ్రెసా, సంయుక్త మీనన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆ సినిమా అద్భుత విజయాన్ని సాధించింది. అదే విజయాన్ని మరింత పెద్ద స్థాయిలో కొనసాగించేలా బింబిసార 2 రూపుదిద్దుకుంటోంది. ప్రీ–ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. వచ్చే ఏడాదిలో షూటింగ్ మొదలుపెట్టి 2026లో థియేటర్లలో విడుదల చేయాలనే ఆలోచనలో టీమ్ ఉంది. ‘బింబిసార 2 ’ పక్కనపెడితే మరో చిత్రానికి గాను ఆయన కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇవ్వడం టాలీవుడ్లో చర్చనీయాంశమైంది. కొత్త కథల్ని ప్రోత్సహించే హీరోనని కళ్యాణ్ రామ్ మరోసారి నిరూపించబోతున్నాడని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Amigos
  • Arjun S/O Vyjayanthi
  • Athanokkade
  • Bimbisara
  • bimbisara film
  • Devil
  • Hare Ram
  • kalyan ram
  • Nandamuri Kalyan Ram
  • Tolichupulone
  • tollywood

Related News

Revanth Reddy Nara Rohit

Nara Rohit : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నారా రోహిత్..!

టాలీవుడ్ హీరో నారా రోహిత్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. తన కోస్టార్ శిరీషతో ఆయన వివాహం జరగనుంది. అక్టోబర్ 30న హైదరాబాద్ లో వైభవంగా పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రోహిత్ ఇవాళ శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నటుడు శ్రీ నారా రోహిత్ కలిసి ఈ నెల 30న జరిగే తన వివాహ శుభకార్యానికి ఆహ్వానించారు. pic.twitter.com/

    Latest News

    • SSMB 29 Update: మ‌హేష్‌- రాజ‌మౌళి మూవీ.. లీక్ వ‌దిలిన త‌న‌యుడు!

    • Credit Card: క్రెడిట్ కార్డు భద్రత: 6 ముఖ్యమైన రహస్యాలు మీ కార్డును రక్షించుకోండి

    • Blood Sugar: మ‌ధుమేహం స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆకు జ్యూస్ తాగండి!

    • New Hyundai Venue: హ్యుందాయ్ వెన్యూ బుకింగ్‌లు ప్రారంభం!

    • Nandamuri Kalyan Ram : కొత్త డైరెక్టర్‌కి ఛాన్స్ ఇస్తోన్న నందమూరి హీరో..!

    Trending News

      • CM Chandrababu Naidu : కర్నూల్ బస్ ప్రమాదం చంద్రబాబు సీరియస్ ..వారిపై కఠిన చర్యలు.!

      • Akhanda 2: ‘అఖండ 2’లో బాలకృష్ణ డ్యూయల్ రోల్.. ఎమ్మెల్యేగా కూడా కనిపించనున్నారా?

      • Bus Accident’s : సరిగ్గా 12 ఏళ్ల తర్వాత ‘పాలెం’ ఘటన రిపీట్.. మృత్యు రహదారి నేషనల్ హైవే 44..!

      • Justice Surya Kant: సుప్రీంకోర్టు త‌దుప‌రి ప్ర‌ధాని న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ సూర్య‌కాంత్‌.. ఎవ‌రీయ‌న‌?

      • Bus Fire Accident : కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది ఫోన్లు స్విచాఫ్.. ఏమయ్యారు?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd