Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి యూఏఈ గోల్డెన్ వీసా
- Author : Latha Suma
Date : 28-05-2024 - 11:44 IST
Published By : Hashtagu Telugu Desk
Megastar Chiranjeevi: ప్రముఖ సినీ నటుడు చిరంజీవికి ఇటివల పద్మవిభూషణ్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గోల్డెన్ వీసాను(UAE Golden Visa) అందుకున్నారు. చిరంజీవికి గోల్డెన్ వీసా దక్కడంతో అభిమానుల ఆనందానికి అంతేలేకుండా పోయింది. నెట్టింట ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం(UAE Govt) ఈ వీసాను అందిస్తుందన్న విషయం తెలిసిందే. ఇన్వెస్టర్లు, వ్యవస్థాపకులు, శాస్త్రవేత్తలు, నటులు, అసాధారణ ప్రతిభ కలిగిన గ్రాడ్యుయేట్లకు 10 ఏళ్ల కాలపరిమితితో యూఏఈ ఈ వీసాను జారీ అందిస్తోంది. గతంలో భారత చిత్రపరిశ్రమకు చెందిన షారుఖ్ ఖాన్, అల్లు అర్జున్, దుల్కర్ సల్మాన్, త్రిష, అమలాపాల్, మోహన్‌లాల్, మమ్ముట్టి, టొవినో థామస్ తదితరులు గోల్డెన్ వీసా అందుకున్నారు.
Read Also: Basara Triple IT : బాసర ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లు షురూ
ఇంకా..చిరంజీవి(Chiranjeevi) సినిమాల విషయానికొస్తే.. ‘విశ్వంభర’ లో నటిస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ కథ, రూ. 200 కోట్ల బడ్జెట్‌తో దీన్ని రూపొందిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని సమాచారం. మూవీలో ఐదుగురు హీరోయిన్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే త్రిష, ఆషికారంగనాథ్‌లు చిత్రబృందం ప్రకటించింది. సురభి, ఇషా చావ్లా, మీనాక్షి చౌదరి పేర్లను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.