HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Pawan Kalyan Is A Person Who Does Not Give In To Money At All

పవన్ కళ్యాణ్ డబ్బుకి ఏమాత్రం లొంగని వ్యక్తి..

  • Author : Vamsi Chowdary Korata Date : 23-02-2026 - 10:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Harish Shankar
Harish Shankar
Harish Shankar  పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కేవలం డబ్బు కోసం పనిచేసే వ్యక్తి కాదని, తనకంటూ కొన్ని బలమైన సిద్ధాంతాలు, విలువలు ఉన్నాయని దర్శకుడు హరీశ్‌ శంకర్ అన్నారు. పవన్ డబ్బుకు ఏమాత్రం లొంగరని, ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని కోట్ల రూపాయల ఆఫర్‌ను సైతం తిరస్కరించారని ఆయన ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. పవన్ హీరోగా హరీశ్‌ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా మల్లారెడ్డి విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘గబ్బర్ సింగ్’ (2012) సినిమా బ్లాక్‌బస్టర్ అయిన తర్వాత పవన్ కల్యాణ్‌కు దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ వచ్చిందని హరీశ్‌ శంకర్ గుర్తుచేశారు. ఆ సమయంలో ఒక ప్రముఖ కార్పొరేట్ సంస్థ, అప్పట్లో షారుఖ్ ఖాన్ తీసుకునేంత భారీ రెమ్యూనరేషన్‌తో ఒక యాడ్ కోసం పవన్‌ను సంప్రదించిందని తెలిపారు. అయితే, ఆ ఉత్పత్తి ప్రజల ఆరోగ్యానికి, ముఖ్యంగా చిన్నపిల్లలకు మంచిది కాదనే కారణంతో పవన్  కోట్ల రూపాయల ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారని హరీశ్‌ శంకర్ వివరించారు. ఆయన వ్యక్తిత్వానికి ఇది ఒక నిదర్శనమని అన్నారు.

ఈ కార్యక్రమంలో చిత్రంలోని రెండో పాట ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌ శంకర్ మాట్లాడుతూ.. పవన్ మెడపై చెయ్యి వేసుకునే మేనరిజానికి మాటల రూపం ఇవ్వాలనే ఆలోచనతోనే “నేను మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే” అనే డైలాగ్ రాశానన్నారు. ఈ పాట కేవలం అభిమానం కోసం రాసింది కాదని, పవన్ జీవిత ప్రయాణం, ఆయన పడిన కష్టం, ఆయన వ్యక్తిత్వం ఇందులో ప్రతిఫలిస్తాయని తెలిపారు. చంద్రబోస్ కేవలం రెండు రోజుల్లో ఈ అద్భుతమైన పాటను రాశారని, దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో పాటాభిషేకం చేశారని కొనియాడారు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా మార్చి 26న విడుదల కానుంది. సినిమాలో ఫ్యాన్స్‌కు కావాల్సిన అన్ని అంశాలు ఉంటాయని, 2 గంటల 35 నిమిషాల సినిమాలో దాదాపు 2 గంటల పాటు పవన్ ను అభిమానులు కనులారా చూసి తృప్తి చెందుతారని హరీశ్‌ శంకర్ ధీమా వ్యక్తం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Deputy CM Pawan kalyan
  • Corporate Ad Offer
  • Director Harish Shankar
  • gabbar singh
  • Movie Promotion
  • public welfare
  • Raashi Khanna
  • sreeleela
  • tollywood
  • Ustaad Bhagat Singh

Related News

Surgery For Appearance Avika Gor

Avika Gor: లుక్ కోసం సర్జరీ: అవికా గోర్

ఇటీవలే ‘అగ్లీ స్టోరీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కథానాయిక అవికా గోర్ ప్లాస్టిక్ సర్జరీలు, కాస్మోటిక్ ట్రీట్‌మెంట్లు చేయించుకుందంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ రూమర్లపై ఆమె స్పందిస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. తమపై వస్తున్న సర్జరీ వదంతులను అవికా పూర్తిగా తోసిపుచ్చింది. “నేను ముఖంపై ఒక చిన్న ట్రీట్‌మెంట్ తీసుకున్న మాట వ

  • Prakash Raj Controversy

    Prakash Raj: ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు ప్రకాష్ రాజ్ మద్దతు

Latest News

  • BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

  • Revanth Reddy : తెలుగు ఆత్మగౌరవం నుంచి ప్రజా సంక్షేమం వరకు.. రేవంత్ రెడ్డి విజన్

  • Krishna Jayashankar : బాడీ షేమింగ్ నుంచి బంగారు పతకం వరకు.. కృష్ణ జయశంకర్ సరికొత్త చరిత్ర!

  • Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

  • Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd