Basara Triple IT : బాసర ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లు షురూ
తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో ఉన్న బాసర ట్రిపుల్ ఐటీలోకి అడ్మిషన్లకు చాలా పోటీ ఉంటుంది.
- By Pasha Published Date - 11:22 AM, Tue - 28 May 24

Basara Triple IT : తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో ఉన్న బాసర ట్రిపుల్ ఐటీలోకి అడ్మిషన్లకు చాలా పోటీ ఉంటుంది. ఇందులో అడ్మిషన్ పొందాలని చాలామంది విద్యార్థులు భావిస్తుంటారు. బాసర ట్రిపుల్ ఐటీని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ అని పిలుస్తుంటారు. ఇందులో ఆరేళ్ల బీటెక్ కోర్సు (ఇంటర్ + బీటెక్) అందుబాటులో ఉంది. ఈ కోర్సులో అడ్మిషన్లు ఇచ్చేందుకు మే 27న నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
- విద్యార్థులకు పదోతరతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఆరేళ్ల బీటెక్ కోర్సులో(Basara Triple IT) అడ్మిషన్ లభిస్తుంది.
- మొదటి ప్రయత్నంలోనే పదోతరగతి పాసైన వారు అప్లై చేయడానికి అర్హులు.
- 01.06.2024 నాటికి 18 సంవత్సరాలలోపు వయసున్న వారు అప్లై చేయొచ్చు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 21 సంవత్సరాల వరకు మినహాయింపు ఉంది.
- గవర్నమెంట్ స్కూలులో చదివిన విద్యార్థులకు వారి పదో తరగతి గ్రేడ్‌కు 0.40 స్కోరును కలుపుతారు.
- ఒకవేళ ఎవరైనా విద్యార్థుల స్కోర్ సమానంగా ఉంటే.. మొదట గణితంలో, తర్వాత సైన్స్, ఆంగ్లం, సాంఘికశాస్త్రం, ప్రథమ భాషలో వచ్చిన గ్రేడ్లను పరిశీలించి సీట్లు ఇస్తారు. అవి కూడా సమానంగా ఉంటే పుట్టిన తేదీ ఆధారంగా ఎక్కువ వయసున్న వారికి సీటు ఇస్తారు. అది కూడా సమానంగా ఉంటే హాల్‌టికెట్ ర్యాండమ్ నంబరు విధానాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.
- బాసర ట్రిపుల్ ఐటీలో అందించే బీటెక్ కోర్సులో వేర్వేరు బ్రాంచీలు ఉన్నాయి. విద్యార్థులు ఆసక్తిని బట్టి ఈ బ్రాంచీలను ఎంపిక చేసుకోవచ్చు.
Also Read :Bribe To Doctors : లగ్జరీ ‘కారు’ కేసు.. 3 లక్షలు పుచ్చుకొని బ్లడ్ శాంపిల్ మార్చేశారు
- తొలి ఏడాదికి రూ.37 వేల ఫీజు చెల్లించాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్ అర్హత ఉన్న వాళ్లు ఈ అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదు.
- అడ్మిషన్ కోసం రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.1000, కాషన్ డిపాజిట్‌గా రూ.2 వేలు, ఆరోగ్య బీమా కోసం రూ.700 కట్టాలి.
- బాసర ట్రిపుల్ ఐటీలో ఈ విద్యా సంవత్సరానికి 1650 ఇంటిగ్రెటెడ్ బీటెక్(ఇంటర్+బీటెక్) సీట్లు భర్తీ చేయనున్నారు. 85 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకు, 15 శాతం సీట్లను తెలంగాణతో పాటు ఏపీ విద్యార్థులకు కేటాయిస్తారు. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయుల పిల్లలకు 5 శాతం సీట్లు సూపర్ న్యూమరీ కింద ఇస్తారు.
- అడ్మిషన్లకు సంబంధించిన వివరాల కోసం బాసర ట్రిపుల్ ఐటీ వెబ్‌సైట్ లేదా 7416305245, 7416058245, 7416929245 హెల్ప్‌లైన్ నెంబర్లలో సంప్రదించవచ్చు.
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.06.2024.
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 22.06.2024.
- స్పెషల్ కేటగిరీ విద్యార్థుల దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 29.06.2024.
- సీట్ల కేటాయింపు (స్పెషల్ కేటగిరీ మినహాయించి): 03.06.2024.
- సర్టిఫికెట్ వెరిఫికేషన్: 08.06.2024 నుంచి 10.06.2024 వరకు.