Pawan Kalyan: అల్లు కనకరత్నమ్మ ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్
చెన్నైలో ఉన్నప్పటి నుంచి ఎంతో ఆప్యాయత చూపేవారని పవన్ గుర్తు చేశారు. చుట్టూ ఉన్నవారిపట్ల అమిత ప్రేమాభిమానాలు కురిపించేలా తన కుమార్తె, మా వదినమ్మ సురేఖని తీర్చిదిద్దారని పేర్కొన్నారు.
- Author : Gopichand
Date : 30-08-2025 - 1:22 IST
Published By : Hashtagu Telugu Desk
Pawan Kalyan: దివంగత అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నమ్మ కన్నుమూశారని తెలిసి చింతిస్తున్నాను అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ట్వీట్ చేశారు. చెన్నైలో ఉన్నప్పటి నుంచి ఎంతో ఆప్యాయత చూపేవారని పవన్ గుర్తు చేశారు. చుట్టూ ఉన్నవారిపట్ల అమిత ప్రేమాభిమానాలు కురిపించేలా తన కుమార్తె, మా వదినమ్మ సురేఖని తీర్చిదిద్దారని పేర్కొన్నారు. కనకరత్నమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. అల్లు అరవింద్‌కి, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అని పవన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
అల్లు కనకరత్నమ్మ కన్నుమూత
గీతా ఆర్ట్స్ అధినేత, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి, దివంగత ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నమ్మ (94) కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె తెల్లవారుజామున 1:45 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. కనకరత్నమ్మ అంత్యక్రియలు హైదరాబాద్‌లోని కోకాపేటలో కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో నేడు జరగనున్నాయి. ఈ విషాద వార్త తెలియగానే ముంబైలో ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మైసూర్‌లో షూటింగ్‌లో ఉన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వెంటనే నగరానికి చేరుకున్నారు.
Also Read: Modi China Tour : శాశ్వత మిత్రులు-శత్రువులంటూ ఏమీ ఉండదు..దేశ ప్రయోజనాలే శాశ్వతం: రాజ్‌నాథ్ సింగ్
శ్రీమతి అల్లు కనకరత్నమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలి
దివంగత శ్రీ అల్లు రామలింగయ్య గారి సతీమణి శ్రీమతి అల్లు కనకరత్నమ్మ గారు కన్నుమూశారని తెలిసి చింతిస్తున్నాను. చెన్నైలో ఉన్నప్పటి నుంచి ఎంతో ఆప్యాయత చూపేవారు. చుట్టూ ఉన్నవారిపట్ల అమిత ప్రేమాభిమానాలు కురిపించేలా తన కుమార్తె, మా…
— JanaSena Party (@JanaSenaParty) August 30, 2025
ప్రస్తుతం అల్లు అరవింద్, మెగాస్టార్ చిరంజీవి అంత్యక్రియల ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్, నాగబాబు ఒక బహిరంగ సభలో పాల్గొనడం వల్ల ఆగస్టు 31న హైదరాబాద్‌కు చేరుకుని అల్లు అరవింద్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అల్లు కనకరత్నమ్మ మరణ వార్త తెలిసిన వెంటనే టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు, సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అల్లు కుటుంబానికి సంతాపం తెలుపుతున్నారు.