Komaram Venkatesh: తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం.. ఫిల్మ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు మృతి
తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ఫిల్మ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు కొమరం వెంకటేష్ (Komaram Venkatesh) కన్నుమూశారు.
- By Gopichand Published Date - 09:14 AM, Sat - 8 April 23

Hyderabad: తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ఫిల్మ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు కొమరం వెంకటేష్ (Komaram Venkatesh) కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా సిటీ న్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కొమరం వెంకటేష్ జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్‌గా, చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన మృతికి సినీ కార్మిక సంఘాలు సంతాపం తెలిపాయి. కొమర వెంకటేష్ మరణించిన విషయాన్ని టాలీవుడ్ నిర్మాతల మండలి అధికారికంగా ప్రకటించింది.
తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షులు శ్రీ కొమరం వెంకటేష్, బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి. pic.twitter.com/Rj09xuCUrw
— Telugu Film Producers Council (@tfpcin) April 7, 2023
Also Read: Telangana: రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్‌కు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఇకపై 24 గంటలు షాపులు ఓపెన్..!
వెంకటేష్ ప్రకాశం జిల్లాలోని మాచర్లకి చెందినవారు. టాలీవుడ్ లో ఆయన జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ గా కెరీర్ ప్రారంభించారు. ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడిగా పలుమార్లు విజయం సాధించారు. అలాగే చిత్ర పురి కాలనీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. 2015లో విడుదలైన నందమూరి కళ్యాణ్ రామ్ “షేర్” చిత్రాన్ని నిర్మించింది కొమరం వెంకటేష్. కొమర వెంకటేష్ అకాల మరణంతో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి చెందగా, వెంకటేష్ ఆత్మకు శాంతి కలగాలని పలువురు సినీ ప్రముఖులు, సహచరులు ప్రార్థిస్తున్నారు.