Telangana: రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్‌కు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఇకపై 24 గంటలు షాపులు ఓపెన్..!
రాష్ట్రంలోని దుకాణాలు, సంస్థలకు 24×7 వ్యాపారాలకు సడలింపు ఇస్తూ తెలంగాణ (Telangana) ప్రభుత్వం మంగళవారం మార్గదర్శకాలను విడుదల చేసింది.
- By Gopichand Published Date - 09:04 AM, Sat - 8 April 23

Hyderabad: రాష్ట్రంలోని దుకాణాలు, సంస్థలకు 24×7 వ్యాపారాలకు సడలింపు ఇస్తూ తెలంగాణ (Telangana) ప్రభుత్వం మంగళవారం మార్గదర్శకాలను విడుదల చేసింది.వ్యాపారాలకు ప్రయోజనం చేకూర్చే చర్యలో ప్రభుత్వం అన్ని దుకాణాలు, వ్యాపారులు, దుకాణదారులు, షాపింగ్స్ మాల్స్, రెస్టారెంట్లతో సహా రోజుకు 24 గంటలు వారంలో ఏడు రోజులు తెరిచి ఉంచుకోవచ్చని అనుమతిస్తూ నిబంధనలను జారీ చేసింది. ఏప్రిల్ 4న జీవో జారీ కాగా.. శుక్రవారం వెలుగులోకి వచ్చింది.
కార్మిక శాఖ ఉత్తర్వులు ఇలా ఉన్నాయి.. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ దుకాణాలు, సంస్థల చట్టం 1988లోని సెక్షన్ 7 (తెరిచే మరియు మూసివేసే సమయాలు) నుండి మినహాయింపును మంజూరు చేయడానికి మార్గదర్శకాలను జారీ చేసింది,. సెక్షన్ 2 (21)లో నిర్వచించిన విధంగా అన్ని దుకాణాలు, సంస్థలకు రాష్ట్రంలో 24×7 ఆపరేటింగ్ కోసం తెలంగాణ షాప్స్ & ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ 1988 కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐ.రాణి కుముదిని జిఒ ఎంఎస్ నెం 4 జారీ చేశారు. వ్యాపార సంస్థలు తమ ఉద్యోగులకు ఐడి కార్డులు, వీక్లీ ఆఫ్‌లు, వారంవారీ పని గంటలు, ఓవర్‌టైమ్ వేతనాలు వర్తించే చోట, వేతనానికి బదులుగా పరిహారంతో కూడిన సెలవులు ఇవ్వాలని షరతులు ఉన్నాయి. నోటిఫై చేయబడిన జాతీయ పండుగ లేదా సెలవు దినాలలో విధులకు హాజరయ్యే ఉద్యోగులు, మహిళా ఉద్యోగుల భద్రత, రాత్రి షిఫ్టులలో పని చేయడానికి మహిళా ఉద్యోగుల సమ్మతి వారికి రవాణా సౌకర్యం కల్పించడం ఉంటుంది.
Also Read: Gold Price Today: బంగారం కొనాలనుకుంటున్నారా.. అయితే నేటి పసిడి, వెండి ధరలు ఇవే..!
మేనేజ్‌మెంట్‌లు ఖచ్చితమైన రికార్డులను నిర్వహించాలని, సమయానికి రిటర్న్‌లను సమర్పించాలని GO నిర్దేశించింది. అనుమతులు పోలీసు చట్టం, నిబంధనలకు లోబడి ఉంటాయి. 24 గంటలూ తెరిచి ఉంచే షాపులు వార్షిక రుసుముగా రూ. 10 వేలు చెల్లించాల్సి ఉంటుంది. పోలీసు యాక్ట్, రూల్స్‌ను అంగీకరిస్తేనే షాపులు 24 గంటలూ నిర్వహించుకునేందుకు అనుమతి లభిస్తుంది.