HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Karate Kalyani Supported Shivajis Comments

శివాజీ వ్యాఖ్యలను సమర్థించిన కరాటే కల్యాణి

  • Author : Vamsi Chowdary Korata Date : 24-12-2025 - 11:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sivaji
Sivaji

karate kalyani : హీరోయిన్లు వేసుకునే దుస్తులపై సినీనటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదంగా మారిన నేపథ్యంలో ఈ అంశంపై సినీనటి కరాటే కల్యాణి స్పందించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, శివాజీ వ్యాఖ్యలను సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీశాయి. శివాజీ మాటల తీరు తప్పుగా అనిపించవచ్చని అంగీకరిస్తూనే, ఆయన ఉద్దేశాన్ని మాత్రం తప్పుగా అర్థం చేసుకుంటున్నారని కరాటే కల్యాణి అభిప్రాయపడ్డారు.

“నేను శివాజీని సమర్థిస్తాను. భారతదేశంలో స్త్రీలకు ఎంతో ఔన్నత్యం ఉంది. కట్టు, బొట్టు మన సంస్కృతి. భారతీయ మహిళ అంటే ప్రపంచం మొత్తం గౌరవంగా చూస్తుంది. శివాజీ చెప్పిన విధానంలో కొంత తేడా ఉండొచ్చు కానీ ఆయన భావన మాత్రం తప్పు కాదు” అని ఆమె వ్యాఖ్యానించారు. శివాజీ మాట్లాడిన ఒకే ఒక్క మాటను తీసుకుని పెద్ద రాద్ధాంతం చేస్తున్నారని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇక గతంలో పాటల్లో వాడిన పదాల అంశాన్ని ప్రస్తావిస్తూ, “చికిరి చికిరి పాటలో కూడా ఇలాంటి పదాలే వాడారు. అప్పుడు వాటిపై ఎందుకు ఎవరూ స్పందించలేదు? చిన్మయి ఎందుకు అప్పుడే ప్రశ్నించలేదు?” అంటూ ఆమె నిల‌దీశారు.

డ్రెస్సింగ్ విషయంలో మరింత ఘాటుగా స్పందించిన కరాటే కల్యాణి, అనసూయ తన కుమారుడి ఒడుగు కార్యక్రమంలో సంప్రదాయ పట్టు చీర కట్టుకోవడాన్ని ఉదాహరణగా చూపించారు. “అవసరమైనప్పుడు సంప్రదాయాలను గుర్తు చేసుకుంటారు. అంటే సంప్రదాయం విలువ వారికి తెలుసు” అని వ్యాఖ్యానించారు. ఇండస్ట్రీలో ఎదిగినవారు సమాజానికి రోల్ మోడల్‌గా ఉండాలని, అర్ధనగ్న ప్రదర్శనలు చేయకుండానే చీరలు కట్టుకుని అందంగా కనిపించవచ్చని చెప్పారు.

ఇటీవల హీరోయిన్ నిధి అగర్వాల్ దుస్తులపై తాను చేసిన పోస్టును ప్రస్తావిస్తూ, సమాజంలో వస్తున్న మార్పులు, యువతలో పెరుగుతున్న అలవాట్లపై ఆందోళన వ్యక్తం చేశారు. కరాటే కల్యాణి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, సంప్రదాయం-వ్యక్తిగత స్వేచ్ఛ అంశంపై మరోసారి చర్చకు తెరలేపాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • anasuya bharadwaj
  • dress code
  • karate kalyani
  • Nidhi Agarwal
  • Sivaji
  • Telugu Cinema
  • tollywood

Related News

I will only do such films from now on... Kajal's sensational decision.

Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన సినీ ప్రయాణంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా హీరోయిన్లు పెళ్లయ్యాక, తల్లి అయ్యాక సినిమాలకు దూరం అవుతుంటారు లేదా గ్లామర్ పాత్రలకే పరిమితమవుతుంటారు. కానీ, కాజల్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. మాతృత్వం పొందిన తర్వాత తన ఆలోచనా విధానంలో, కథల ఎంపికలో పూర్తి మార్పు వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. ఇకపై తాను చేసే ప

  • Nagabandham Movie Review

    Nagabandham: నాగబంధం మూవీ రివ్యూ

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd