Allu Arjun Jail Again: అల్లు అర్జున్ మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమా? పోలీసులు ఏం చేయబోతున్నారు!
అయితే ‘పుష్ప 2’ ప్రీమియర్ షో తొక్కిసలాట ఘటనపై రేవంత్ సర్కార్ సీరియస్‌గానే ఉన్నట్లు కనిపిస్తోంది. అసెంబ్లీలో ఘటనపై ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది.
- By Gopichand Published Date - 08:10 AM, Sun - 22 December 24

Allu Arjun Jail Again: తెలంగాణలో ఎప్పుడూ లేనివిధంగా మొదటిసారి ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ అనే మాదిరిగా మారిపోయింది. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయంలో మొదట్నుంచి హీరో అల్లు అర్జున్‌దే (Allu Arjun Jail Again) నిర్ణక్ష్యం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే శనివారం అసెంబ్లీలో ఇదే విషయమై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి బన్నీపై, టాలీవుడ్‌పై కాస్త ఘాటు విమర్శలు చేశారు. ఒక్కరకంగా చెప్పాలంటే వార్నింగ్ ఇచ్చారు.
అయితే ‘పుష్ప 2’ ప్రీమియర్ షో తొక్కిసలాట ఘటనపై రేవంత్ సర్కార్ సీరియస్‌గానే ఉన్నట్లు కనిపిస్తోంది. అసెంబ్లీలో ఘటనపై ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. ఆస్పత్రిలో ఉన్న బాలుడిని కాకుండా జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్‌ని సినీ ప్రముఖులు పరామర్శించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ బెయిల్ రద్దవుతుందని, ఆయనకు జైలు తప్పదేమోనన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రస్తావించిన విషయాలను బట్టి చూస్తే మధ్యంతర బెయిల్ పొడిగింపుకు న్యాయ వ్యవస్థ అంగీకరించకపోవచ్చు. రెగ్యులర్ బెయిల్ అప్లై చేసుకోమని కోర్టు చెబితే ఈ లోగా పోలీసులు లోపల వేసేయొచ్చని అంటున్నారు. ప్రభుత్వాలు ఎప్పుడూ సినీ రంగానికి వ్యతిరేకంగా పనిచేయవు. మరీ సీఎం రేవంత్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరీ!
Also Read: Shreyas Iyer: దేశవాళీలో అయ్యర్ పరుగుల వరద.. 55 బంతుల్లో సెంచరీతో విధ్వంసం
బన్నీ ప్రెస్ మీట్‌తో బలపడిన అరెస్ట్ వార్తలు!
అయితే సీఎం రేవంత్ అసెంబ్లీ అన్న మాటలకు కౌంటర్‌గా శనివారం రాత్రి 8 గంటలకు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఒక దురదృష్టకర ప్రమాదమని అల్లు అర్జున్ అన్నారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఘటనలో ఎవరి తప్పూ లేదని చెప్పారు. శ్రీతేజ్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు తాను ప్రెస్‌మీట్ పెట్టలేదని స్పష్టం చేశారు. తన వ్యక్తిత్వం గురించి దుష్ప్రచారం చేస్తుండటం బాధిస్తోందన్నారు.
ప్రభుత్వంతో వివాదం కోరుకోవడం లేదంటూనే బన్నీ సీఎం రేవంత్‌కు పలు విషయాల్లో కౌంటర్ ఇచ్చారు. పర్మిషన్ లేకున్నా రోడ్ షో చేశారని అసెంబ్లీలో రేవంత్ అంటే, రావద్దని పోలీసులు అప్పుడే చెబితే వెనక్కి వెళ్లేవాన్నని బన్నీ చెప్పారు. ఇక అది రోడ్ షో కాదని, కార్‌పై నుంచి చేయి ఊపానన్నారు. అటు ప్రమాదం గురించి చెప్పి, వెళ్లాలని పోలిస్ హెచ్చరించినా మళ్లీ చేతులూపుతూ వెళ్లారని సీఎం అన్నారు. అయితే తనకు పోలీసులు ఏమీ చెప్పలేదని బన్నీ పేర్కొన్నారు. అయితే అల్లు అర్జున్ సీఎం రేవంత్ ప్రతి మాటకు కౌంటర్ వేసినట్లు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బన్నీని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారనే వార్తలు కూడా హల్‌చల్ చేస్తున్నాయి.