Celebrity Cricket League: హైదరాబాద్‌లో సెలబ్రిటీ క్రికెట్ లీగ్.. 10,000 మంది విద్యార్థులకు ఉచిత ప్రవేశం
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (Celebrity Cricket League)కి హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తుందని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ) అధ్యక్షుడు ఎ. జగన్మోహన్ రావు శుక్రవారం ప్రకటించారు.
- Author : Gopichand
Date : 23-02-2024 - 6:49 IST
Published By : Hashtagu Telugu Desk
Celebrity Cricket League: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (Celebrity Cricket League)కి హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తుందని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ) అధ్యక్షుడు ఎ. జగన్మోహన్ రావు శుక్రవారం ప్రకటించారు. ఈ లీగ్ తొలి దశ మ్యాచ్‌లు షార్జాలో జరుగుతుండగా, రెండో దశ మ్యాచ్‌లు మార్చి 1 నుంచి 3వ తేదీ వరకు హైదరాబాద్‌లో జరుగుతాయని ఆయన తెలిపారు. ఈ లీగ్‌లో ఆడేందుకు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌తోపాటు దేశంలోని సినీ ప్రముఖులు, తారలు హైదరాబాద్ వస్తున్నారని తెలిపారు.
10,000 మంది కళాశాల విద్యార్థులకు ఉచిత ప్రవేశం
హైదరాబాద్, తెలంగాణ కళాశాలల విద్యార్థులకు ఉచితంగా ఈ మ్యాచ్‌లను చూపించాలని సీసీఎల్‌వో నిర్వాహకులను కోరగా వారు వెంటనే అంగీకరించారని జగన్‌మోహన్‌రావు తెలిపారు. దీంతో 10,000 కాలేజీలను (ఇంటర్మీడియట్, యూజీ, పీజీ, ఇంజినీరింగ్, మెడికల్ విద్యార్థులు) ఉచితంగా స్టేడియంలోకి అనుమతించనున్నారు. ఆసక్తి గల కళాశాలల ప్రిన్సిపాళ్లు తమ విద్యాసంస్థల నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్యను విద్యార్థుల పేర్లతో పాటు HCA hca.ccl2024@gmail.comకు ఇమెయిల్ చేయాలని సూచించారు. వాటిని పరిశీలించిన తర్వాత తమ సిబ్బంది సమాధానం ఇస్తారని చెప్పారు. మ్యాచ్‌లకు వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా ఐడీ కార్డులతో రావాలని తెలిపారు.
Also Read: Vijay Antony: విజయ్ ఆంటోనీ “లవ్ గురు” మూవీ నుంచి ‘చెల్లెమ్మవే..’ లిరికల్ సాంగ్ రిలీజ్
హైదరాబాద్‌లో ఆరు మ్యాచ్‌లకు ఆతిథ్యం
జగన్ మోహన్‌రావు మాట్లాడుతూ హైదరాబాద్‌లో మూడు రోజుల్లో ప్రతిరోజు రెండు మ్యాచ్‌ల చొప్పున మొత్తం ఆరు మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు తెలిపారు. హీరో అక్కినేని అఖిల్ సారథ్యంలో టాలీవుడ్ టీమ్ తెలుగు వారియర్స్ ఆడుతున్నదని అన్నారు. ముంబై హీరోస్, కేరళ స్ట్రైకర్స్, భోజ్‌పురి దబాంగ్స్, బెంగాల్ టైగర్స్, చెన్నై రైనోస్, కర్ణాటక బుల్డోజర్స్, పంజాబ్ డి షేర్ జట్లు తలపడనున్నాయి. ఒక్కో జట్టుకు దేశం నలుమూలల నుంచి ప్రముఖులు ఆడతారని జగన్ మోహన్ రావు తెలిపారు.
We’re now on WhatsApp : Click to Join