HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Gaddar Is The Epitome Of Telangana Deputy Cm Bhatti

Deputy CM Bhatti: తెలంగాణ మొత్తానికి ప్రతిరూపం గద్దర్: డిప్యూటీ సీఎం భట్టి

సినీ పరిశ్రమల అవార్డుల విషయానికొస్తే నంది అవార్డులు ఒక పండుగల నిర్వహించేవారు. రాష్ట్ర విభజన తర్వాత ఎందుకో గత ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోలేదు అన్నారు.

  • By Gopichand Published Date - 08:03 PM, Mon - 14 October 24
  • daily-hunt
Deputy CM Bhatti
Deputy CM Bhatti

Deputy CM Bhatti: తెలంగాణ సినీ పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున గౌరవిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి (Deputy CM Bhatti) విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన గద్దర్ సినీ అవార్డుల కమిటీ మొదటి సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ సినీ పరిశ్రమ దేశంలోనే కాదు ప్రపంచములోనే శాసించే స్థాయికి ఎదగాలని అన్నారు. సినీ పరిశ్రమకు ఏ సమస్యలు ఉన్నా వినడానికి, పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి మీ అందరితో చెప్పాలని కోరినట్టు వివరించారు.

సినీ పరిశ్రమల అవార్డుల విషయానికొస్తే నంది అవార్డులు ఒక పండుగల నిర్వహించేవారు. రాష్ట్ర విభజన తర్వాత ఎందుకో గత ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోలేదు అన్నారు. తెలంగాణ అంటేనే సాంస్కృతిక జీవనం. తెలంగాణ అంటేనే ఆట, పాట.. ఇక్కడ బాధ వచ్చిన సంతోషం వచ్చినా పాట ద్వారానే వ్యక్త పరుస్తాము అని వివరించారు. తెలంగాణ సంస్కృతి చాలా గొప్పది… అందర్నీ అక్కున చేర్చుకొని, ప్రేమించే సంస్కృతి మన రాష్ట్రంలో ఉంటుంది అన్నారు. అసమానతలు, వైరుధ్యాల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నారు అని వివరించారు.

పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అంటూ సమాజాన్ని తెలంగాణ రాష్ట్ర సాధనకు సమాయత్తం చేసి నడిపించిన ప్రజా యుద్ధనౌక గద్దర్ అని డిప్యూటీ సీఎం అన్నారు. గద్దర్ ఒక లెజెండ్, ఒక శతాబ్ద కాలంలో ఆయన లాంటి వ్యక్తి పుడతారని నేను అనుకోవడం లేదని, ప్రపంచంలోని అన్ని సమస్యలపై ఆయన ప్రజలను పాటలతో కదిలించాలని తెలిపారు.

Also Read: Puri Jagannadh : పూరీనే కాదన్నా యంగ్ హీరో..?

తెలంగాణ ఆట, పాటను ప్రపంచానికి పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి గద్దర్ అని అన్నారు. తెలంగాణలో ఏ గ్రామంలో చూసిన గద్దర్ లాగే పాడాలని ప్రయత్నిస్తుంటారు, ఆయనను అనుకరిస్తుంటారు తెలంగాణ మొత్తానికి గద్దర్ ప్రతిరూపమని తెలిపారు. అడవి, సినిమా, మానవులు, రాజ్యాంగం అన్నిట్లో గద్దర్ తనదైన ముద్ర వేశారని అన్నారు.

గద్దర్ మొదట విప్లవోద్యమ బాటలో అడవి బాట పట్టిన కాలక్రమమైన దేశంలోని అన్ని సమస్యలకు భారత రాజ్యాంగమే పరిష్కారమని భావించి దాన్ని ఆయన విస్తృతంగా ప్రచారం చేశారని వివరించారు. అన్ని అంశాలు పరిశీలించే రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ పేరిట సినిమా అవార్డులు ఇవ్వాలని నిర్ణయించిందని కమిటీ సభ్యులకు వివరించారు.

అన్ని అవార్డుల తరహాలోనే అన్ని రంగాలకు గద్దర్ అవార్డులు ఇచ్చుకోవచ్చని తెలిపారు. సినీ పరిశ్రమలోని అందర్నీ గౌరవించుకోవాలి, ప్రతి అవార్డు గొప్పగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుందని తెలిపారు. గద్దర్ అవార్డుల కార్యక్రమం గొప్ప పండుగలా జరగాలి, ఏ తేదీన జరపాలనేది కమిటీ నిర్ణయం తీసుకోవాలని కోరారు. గద్దర్ ను అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తిగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు. కొద్దిరోజుల్లోనే కమిటీ మరో మారు సమావేశమై త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం కమిటీ సభ్యులను కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కాన్సెప్ట్ అద్భుతమైనదని ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ సమావేశంలో డిప్యూటీ సీఎం కు అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్కిల్ యూనివర్సిటీలో యాక్టింగ్ స్కిల్స్ నేర్పించేందుకు ప్రత్యేక కోర్స్ ఏర్పాటు చేయాలని కమిటీ సభ్యులు కోరారు. అన్ని అంశాలు పరిశీలించి ఇంటిగ్రేటెడ్ స్కూల్, స్కిల్ యూనివర్సిటీలో యాక్టింగ్, కల్చర్ కు సంబంధించిన అంశాలకు చోటు కల్పించడం పై నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం తెలిపారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, కమిటీ సభ్యులు నర్సింగరావు, తనికెళ్ల భరణి, సురేష్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, దిల్ రాజు, హరి శంకర్, వందేమాతరం శ్రీనివాస్, అల్లాని శ్రీధర్, గుమ్మడి విమల సమాచార శాఖ కమిషనర్ హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Cinema News
  • cm revanth
  • congress
  • Deputy CM Bhatti
  • Gaddar
  • Revanth Sarkar
  • telangana
  • Telugu Film Industry
  • tollywood

Related News

Jubilee Hills

Jubilee Hills: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థికి సీపీఐ సంపూర్ణ మద్దతు!

రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ అయిన మహేష్ కుమార్ గౌడ్ శుక్రవారం సీపీఐ కార్యాలయం మాగ్దూం భవన్‌లో సీపీఐ ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు.

  • Liquor Shops

    Liquor Shops: మద్యం దుకాణాలకు భారీగా దరఖాస్తులు!

  • Cctv Camera In Bathroom

    CCTV Camera In Bathroom: బాత్రూంలో సీక్రెట్ కెమెరా.. ఓనర్ అరెస్ట్

  • Telusu Kada

    Siddhu Jonnalagadda : తెలుసు కదా రివ్యూ!

  • Government moves towards new reforms.. Cabinet files into digital form

    Telangana Cabinet Meeting : నవంబర్ 23న క్యాబినెట్ భేటీ.. బీసీ రిజర్వేషన్లపై ప్రకటన?

Latest News

  • CM Chandrababu: లండన్‌ పర్యటనకు సీఎం చంద్రబాబు.. ఆస్ట్రేలియా పర్యటనకు మంత్రి లోకేశ్!

  • Kiran Navgire: చ‌రిత్ర సృష్టించిన టీమిండియా క్రికెట‌ర్‌!

  • Garib-Rath Train: త‌ప్పిన పెను ప్ర‌మాదం.. రైలులో అగ్నిప్ర‌మాదం!

  • Afghanistan-Pakistan War: విషాదం.. ముగ్గురు క్రికెట‌ర్లు దుర్మ‌ర‌ణం!

  • Pawan Kalyan Next Film : పవన్-లోకేశ్ కాంబోలో సినిమా?

Trending News

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd