Tollywood : ఫిబ్రవరిలో రెడీ సిద్ధంగా క్రేజీ ప్రాజెక్టులు
Tollywood : ‘గేమ్ ఛేంజర్,’ ‘డాకు మహారాజ్,’ ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి మూడు ప్రధాన చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో రెండు సినిమాలు భారీ విజయాలు సాధించాయి. వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం సంక్రాంతి సీజన్ విజేతగా నిలిచింది. రాబోయే రెండు వారాల వరకు పెద్ద చిత్రాలు విడుదల కావడానికి అవకాశం లేకపోవడం వల్ల ఈ సినిమాలు బాక్సాఫీస్‌ను శాసించేలా కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి నెలలో పలు క్రేజీ ప్రాజెక్టులు విడుదల కానున్నాయి.
- By Kavya Krishna Published Date - 05:08 PM, Mon - 20 January 25

Tollywood : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్‌లో మంచి విజయాలను అందించింది. ‘గేమ్ ఛేంజర్,’ ‘డాకు మహారాజ్,’ ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి మూడు ప్రధాన చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో రెండు సినిమాలు భారీ విజయాలు సాధించాయి. వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం సంక్రాంతి సీజన్ విజేతగా నిలిచింది. రాబోయే రెండు వారాల వరకు పెద్ద చిత్రాలు విడుదల కావడానికి అవకాశం లేకపోవడం వల్ల ఈ సినిమాలు బాక్సాఫీస్‌ను శాసించేలా కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి నెలలో పలు క్రేజీ ప్రాజెక్టులు విడుదల కానున్నాయి.
తండేల్ (ఫిబ్రవరి 7) : అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన పాన్-ఇండియా చిత్రం ‘తండేల్’ ఫిబ్రవరి 7న విడుదల కానుంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను బన్నీ వాస్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ‘లవ్ స్టోరీ’ తర్వాత చైతూ – సాయి పల్లవి కలిసి నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఒక మత్స్యకారుడిగా చైతన్య డీగ్లామర్ పాత్రలో కనిపించనుండటం, అందమైన ప్రేమకథ ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి.
పట్టుదల (ఫిబ్రవరి 6) : అజిత్ కుమార్, త్రిషా కృష్ణన్ నటించిన తమిళ చిత్రం ‘పట్టుదల’ డబ్బింగ్ వెర్షన్ ఫిబ్రవరి 6న విడుదలవుతోంది. మగిళ్ తిరుమేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా గతంలో పొంగల్‌కు విడుదల కావాల్సి ఉండగా, ఇప్పుడు ఫిబ్రవరి 6న థియేటర్లకు రానుంది.
వాలెంటైన్స్ వీక్ స్పెషల్ :
వాలెంటైన్స్ వీక్ సందర్భంగా ఫిబ్రవరి 14న మూడు చిత్రాలు విడుదల అవుతున్నాయి
లైలా: విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో, రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్.
దిల్ రూబా: కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో.
బ్రహ్మా ఆనందం: బ్రహ్మానందం – రాజా గౌతమ్ తండ్రీకొడుకులుగా నటించిన ప్రత్యేక చిత్రం.
మహాశివరాత్రి స్పెషల్
మహాశివరాత్రి సీజన్‌కి సంబంధించి పలు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన తమ్ముడు సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి నటించిన భైరవం చిత్రం సైతం రెడీకి సిద్ధమైంది. వీటితో పాటు ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలో శబ్దం సినిమా కూడా రిలీజ్‌కు రెడీ అయ్యింది.
ఇక ఫిబ్రవరి చివరి వారంలో
మజాకా: సందీప్ కిషన్ – రీతూ వర్మ జంటగా రూపొందిన చిత్రం.
డ్రాగన్: ప్రదీప్ రంగనాథ్ – అనుపమ జంటగా.
జాబిలమ్మ నీకు అంత కోపమా: ధనుష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం.
ఈ సంక్రాంతి సీజన్ విజయాలతో టాలీవుడ్ 2025ను ఘనంగా ఆరంభించింది. రాబోయే నెలల్లో మరిన్ని బ్లాక్ బస్టర్లు ప్రేక్షకులను అలరించబోతున్నాయి.
Kolikapudi Srinivasrao: టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఎదుట ఏమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు..