Director Trivikram Srinivas: హీరోయిన్ సమంతను ఓ కోరిక కోరిన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్!
ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో త్రివిక్రమ్ మాట్లాడుతూ.. సమంత గారు మీరు అప్పుడప్పుడు బొంబాయిలోనే కాకుండా కొంచెం హైదరాబాద్‌లో జరిగే వాటికి కూడా.. రాస్తాం మేము రాస్తే మీరు చేస్తారా? మీరు చెయ్యారేమో అనే భయంతో మేము రాయటంలేదు.
- By Gopichand Published Date - 08:02 AM, Wed - 9 October 24

Director Trivikram Srinivas: స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Director Trivikram Srinivas).. హీరోయిన్ సమంతను ఓ కోరిక కోరారు. ఎక్కువ శాతం ముంబైలో కాకుండా హైదరాబాద్ కూడా వచ్చి వెళ్తుండాలని ఆయన జిగ్రా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సమంతను సభాముఖంగా అడిగేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో త్రివిక్రమ్ మాట్లాడుతూ.. సమంత గారు మీరు అప్పుడప్పుడు బొంబాయిలోనే కాకుండా కొంచెం హైదరాబాద్‌లో జరిగే వాటికి కూడా.. రాస్తాం మేము రాస్తే మీరు చేస్తారా? మీరు చెయ్యారేమో అనే భయంతో మేము రాయటంలేదు. మీరందరూ ఆవిడకి అత్తారింటికి దారేది అని చెప్పాను సమంత గారు హైదరాబాద్ రావటానికి దారి ఏదో చెప్పమనండి. ఆవిడకి సమంత గార్కి హైదరాబాద్‌కు దారి ఇది అని చెప్పాలి మీరందరూ అని తెలుగు వాళ్లందరూ కలిసి మనం ఏదైనా హ్యాష్ ట్యాగ్ లేదా ట్విట్టర్‌లో ట్రెండ్రింగ్ ఏదో ఒకటి చేద్దాం. ఆవిడ కోసం ఓకేనా అని అభిమానులను అడిగారు. ఆయన హైదరాబాద్ రావాలని అడిగినప్పుడు సమంత క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ సైతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Also Read: Yuvraj Singh : మంచు లక్ష్మి బర్త్ డే పార్టీ లో యువరాజ్ సింగ్ సందడి
సమంత గారూ ఎప్పుడూ ముంబై లోనే ఉండొద్దు.. అప్పుడప్పుడు హైదరాబాద్ వస్తూ వుండండి.
మీరు చెయ్యారేమో అని నేను మీకోసం క్యారెక్టర్లు రాయడం లేదు.#Samantha #Trivikram pic.twitter.com/fNxgZbZJS2
— Telugu360 (@Telugu360) October 8, 2024
త్రివిక్రమ్ ఇంకా మాట్లాడుతూ.. నా ఇద్దరూ ఫేవరేట్ యాక్టర్స్ ఇక్కడే ఉన్నారు సమంత గారు అండ్ ఆలియా గారు అంటే నేను ఆలియా గారితో ఇంకా పని చేయలేదు. ప్యూచర్‌లో ఎప్పుడైనా అవకాశం వస్తుంది. ఏమో చూడాలి. సమంత గారితో పని చేశా నేను మూడు సినిమాలు అండ్ నేను ఇప్పుడే ఆలియా గార్కి చెబుతున్నా.. ఎందుకంటే తెలుగు, తమిళ, మలయాళం అన్ని చోట్ల ఒకే రకమైన ఫ్యాన్ బేస్ ఉన్న యాక్టర్లు నాకు తెలిసి రజనీకాంత్ గారు తర్వాత సమంత గారు అనుకుంటా సో లేదు ఇది ప్రేమతో కాదు నిజం.
ఆ సమంత అంది కదా ఏమంటారు దాన్ని మీ సినిమాకి మీరే హీరోలు అని హీరోయిన్లు అని ఎవరు అన్నారు. మీరు ఎప్పట్నుంచో హీరోలే.. ఏమాయ చేసావే చేసిన సినిమా అయితే నేను నాకు బన్నీ గారు ఫోన్ చేసి సమంత అని ఒక కొత్త హీరోయిన్ వచ్చింది చూశారా. మీరు ఆవిడ కోసం సినిమా చూడండి అని చెప్పాడు. పెద్ద పెద్ద ఫ్యాన్ బన్నీ అప్పుడు. సో అందుకని మీరు అప్పట్నుంచి హీరోలే ఎప్పుడూ హీరోలే. ఎందుకంటే మా అమ్మలు లేకుండా మేము లేము. మీరు లేకుండా మీ తర్వాత తరం లేదు. సో ఖచ్చితంగా మీరు ఎప్పటికి హీరోలే. మీరు ఆ విషయంలో మీకు ఎవరో పవర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఎవరో ఎంపవర్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ పవర్‌పుల్ శక్తి అంటేనే స్త్రీ కదా అందులోను ఈ తొమ్మిది రోజులు ప్రపంచం మొత్తం చెబుతున్నాం. మన హోల్ ప్రపంచానికి అంతటికి మీరే శక్తి మీరే కొంచెం మాకు ఇవ్వాలి వీలుంటే మమ్మల్ని కొంచెం ఎంపవర్ చేయండి అని ముగించారు.