Yuvraj Singh : మంచు లక్ష్మి బర్త్ డే పార్టీ లో యువరాజ్ సింగ్ సందడి
yuvraj singh : క్రికెటర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) కనిపించడం..లక్ష్మి తో సన్నిహితంగా ఉన్న ఫొటోస్ , వీడియోస్ వైరల్ గా మారాయి
- Author : Sudheer
Date : 09-10-2024 - 7:53 IST
Published By : Hashtagu Telugu Desk
మంచు లక్ష్మి (Manchu Lakshmi)..మంచు ఫ్యామిలీ నుండి గ్రాండ్ గా చిత్రసీమలో అడుగుపెట్టిన మంచు లక్ష్మి..ఆ రేంజ్ లో సక్సెస్ కాలేకపోయింది. నిర్మాత గా , నటి గా , విలన్ గా , యాంకర్ గా ఇలా తనలోని టాలెంట్ లన్ని బయటకు తీసింది కానీ ఎందులోనూ సక్సెస్ కాలేదు. కాకపోతే సోషల్ మీడియా (Social Media) లో మాత్రం యాక్టివ్ గా ఉంటూ తనపై కానీ తన ఫ్యామిలీ ఫై కానీ ఎవరైనా ట్రోల్స్ , విమర్శలు చేస్తే మాత్రం దిమ్మతిరిగే కౌంటర్లు ఇస్తుంటుంది. తాజాగా నిన్న (అక్టోబర్ 08 ) ఆమె బర్త్ డే. ఈ సందర్బంగా సన్నిహితులకు గ్రాండ్ పార్టీ ఇచ్చింది. ఈ పార్టీ లో క్రికెటర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) కనిపించడం..లక్ష్మి తో సన్నిహితంగా ఉన్న ఫొటోస్ , వీడియోస్ వైరల్ గా మారాయి.
ఈ బర్త్ డే పార్టీ కోసం యువరాజ్ ప్రత్యేకంగా హైదరాబాద్ రావడం చర్చనీయాంశంగా మారింది. అసలు లక్ష్మీ ప్రసన్నకు యువీకి ఏమిటి సంబంధం అనే చర్చ మొదలైంది. అయితే యువీ, లక్ష్మీ మంచి స్నేహితులు అని సమాచారం. క్రికెటర్‌గా ఉన్న సమయంలో యువీ హైదరాబాద్ వచ్చినప్పుడు లక్ష్మీని తరచూ కలిసేవాడు. ఈ క్రమంలోనే బర్త్ డేకు హాజరయ్యాడని తెలుస్తోంది. ఇక ఈ బర్త్ డే పార్టీలో సినీ తారలు ప్రగ్యా జైస్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ , జూనియర్ ఎన్టీఆర్ సతీమణి స్నేహ, కొణిదెల సుస్మిత కూడా సందడి చేశారు. తన పుట్టినరోజు వేడుకకు సంబంధించిన వీడియోను లక్ష్మీ తన సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఆ వీడియోలో అందరి కళ్లు యువీపై పడ్డాయి.
Read Also : FSSAI : ఆహార నాణ్యత పరీక్షల కోసం తిరుమల, కర్నూలులో ల్యాబ్‌ల ఏర్పాటు..