Chiranjeevi- Ram Charan: రామ్ చరణ్ కోసం వెనక్కి తగ్గిన చిరంజీవి..!
శనివారం దసరా కానుకగా విశ్వంభర టీజర్‌ను మేకర్స్ గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు సమాచారం ఇచ్చారు.
- By Gopichand Published Date - 04:39 PM, Sat - 12 October 24

Chiranjeevi- Ram Charan: మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ (Chiranjeevi- Ram Charan) కోసం వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. మెగాస్టార్ హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం విశ్వంభర. ఇప్పటికే ఈ మూవీని వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రావటం లేదని మేకర్స్ తెలిపారు. తనయుడు రామ్ చరణ్ కోసం విశ్వంభర మూవీని పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు మూవీ డైరెక్టర్ వశిష్ఠ మీడియా ముఖంగా తెలియజేశారు. రామ్ చరణ్- డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీని తొలుత డిసెంబర్ 20కి విడుదల చేద్దామనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ మూవీ జనవరి 10న రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.
శనివారం దసరా కానుకగా విశ్వంభర టీజర్‌ను మేకర్స్ గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు సమాచారం ఇచ్చారు. ఈ సమావేశంలో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు డైరెక్టర్ వశిష్ఠ మాట్లాడుతూ.. మా మూవీ అంత రెడీ అయిపోయింది. కానీ మేము సంక్రాంతి బరి నుంచి తప్పుకుంటున్నాం. కేవలం రామ్ చరణ్, దిల్ రాజ్ గారి కోసం విశ్వంభరను జనవరి 10న విడుదల చేయటంలేదని తెలిపాడు. త్వరలోనే కొంత డేట్ రిలీజ్ చేయనున్నట్లు వివరించారు.
Also Read: Political Parties: శ్రీకాళహస్తిలో భగ్గుమన్న రాజకీయ కక్షలు.. ఒకరిపై ఒకరు చెప్పులతో దాడి
ఇకపోతే మెగా ఫ్యాన్స్ అంత ఎదురుచూస్తున్న మెగాస్టార్ నటించిన ‘విశ్వంభర’ టీజర్ విడుదలైంది. ‘దసరా’ పర్వదినాన్ని పురస్కరించుకొని చిత్రబృందం శనివారం టీజర్ రిలీజ్ చేసింది. చిరంజీవి లుక్స్, పవర్‌ఫుల్ మ్యూజిక్, గ్రాండ్ విజువల్స్‌తో ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన టీజర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సోషియో ఫాంటసీ మూవీలో త్రిష హీరోయిన్. ఆషికా రంగనాథ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీని దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించినట్లు సమాచారం. చిరంజీవి కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా ఇది. ఈ సినిమాకి సంగీత దర్శకులుగా కీరవాణి పాటలు అందించారు. యు.వి.క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.