HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >The Divided Political Parties In Srikalahasti Attacked Each Other With Sandals

Political Parties: శ్రీకాళహస్తిలో భగ్గుమన్న రాజకీయ కక్షలు.. ఒకరిపై ఒకరు చెప్పులతో దాడి

గొడ‌వ కాస్త పెద్ద‌ది కావ‌టంతో ఆలయం బయట ఉన్న చెప్పులు, క‌ర్ర‌ల‌ను ఉప‌యోగించుకున్నారు. ఒకరిపై ఒకరు చెప్పులతో కొట్టుకుంటూ గొడవలు చేసుకోవడంతోపాటు కర్రలతో కూడా దాడులు చేసుకున్నారు.

  • Author : Gopichand Date : 12-10-2024 - 4:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Political Parties
Political Parties

Political Parties: ఏపీలో మ‌రోసారి రాజ‌కీయ క‌క్ష‌లు (Political Parties) భ‌గ్గుమ‌న్నాయి. శ్రీకాళహస్తిలోని భాస్కర్ పేట నందు చాముండేశ్వరి ఆలయంలో కమిటీ అధ్యక్షుడు (వైసీపీ) పులి రామచంద్రయ్య నవరాత్రుల వేడుకలు నిర్వ‌హిస్తున్నారు. శ‌నివారం విజయదశమి కావ‌టంతో అమ్మవారిని దర్శించుకోవడానికి శ్రీకాళహస్తి పురపాలక సంఘం మాజీ చైర్మన్ పార్థసారధి (టీడీపీ) దేవాల‌యానికి వ‌చ్చారు. ఈ క్ర‌మంలో పార్థసారధి, రామచంద్రయ్యకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చేటుచేసుకుంది. వాగ్వాదం కాస్త గొడవగా మారి ఆలయం బయట ఉన్న చెప్పులు, కర్రలతో దాడులు చేసుకున్నారు.

గొడ‌వ కాస్త పెద్ద‌ది కావ‌టంతో ఆలయం బయట ఉన్న చెప్పులు, క‌ర్ర‌ల‌ను ఉప‌యోగించుకున్నారు. ఒకరిపై ఒకరు చెప్పులతో కొట్టుకుంటూ గొడవలు చేసుకోవడంతోపాటు కర్రలతో కూడా దాడులు చేసుకున్నారు. అక్కడే ఉన్న భక్తులు ఇద్దరినీ విడదీసి గొడవను స‌దుమ‌ణిగేలా చేశారు. అయితే గతంలో రామలక్ష్మణుల లాగా ఉన్న పార్థసారథి, పులి రామచంద్రయ్య మధ్య గత కొన్ని సంవత్సరాలుగా బార్ కు సంబంధించిన డబ్బుల లావాదేవీల విషయంలో గొడవలు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. అప్పటినుంచి ఇరువురి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని చెబుతున్నారు.

Also Read: Optimus Robot : ఇరగదీసిన ఆప్టిమస్ రోబో.. వామ్మో మనుషుల్ని మించిపోయింది 

దసరా నాడు భగ్గుమన్న రాజకీయ కక్షలు..
(Disturbing audio )

అధికార, విపక్ష పార్టీల నాయకుల మధ్య ఘర్షణ ఒకరిపై ఒకరు దాడి శ్రీకాళహస్తీ పురపాలక సంఘం మాజీ చైర్మన్, ఆలయ కమిటీ చైర్మన్ పులి రామచంద్రయ్య మధ్య వాగ్వాదం . శ్రీకాళహస్తి చాముండేశ్వరి ఆలయం వద్ద ఘటన గతంలో మిత్రులుగా ఉండి.. ఆర్థిక… pic.twitter.com/wR3ka9WXPa

— ChotaNews (@ChotaNewsTelugu) October 12, 2024

మిత్రులు కాస్త శత్రువులుగా మారి ప్రచారం మాధ్యమాల్లో ఒకరిపై ఒకరు దుష్ప్రచారాలు చేసుకున్నారు. గతంలో కొంతమంది పెద్ద మనుషులు ఇందులో జోక్యం చేసుకొని వారి ఇరువురి మధ్య సంధికి ప్రయత్నించారు. అయితే రాజకీయపరంగా వేరువేరు పార్టీలో ఉన్న ఇరువురు ఏనాడు రాజీకి పోకపోవడంతో వారి ఇద్దరి మధ్య రాజకీయ కక్షలు పెరిగి పెరిగి పెద్దదై, నేడు విజయదశమి నాడు గుడి వద్ద చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకునే సమయంలో గొడ‌వ‌కు దారితీసింది. గత రాజకీయ కక్షలు కాస్త భగ్గుమని ఆలయం అనే విచక్షణ జ్ఞానం లేకుండా ఇరువురు నాయకులు ఒకరిపై ఒకరు చెప్పులతో కొట్టుకోవడం ఇప్పుడు రాష్ట్ర‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశమైంది.

Also Read: Kaithal Accident: పండ‌గ‌పూట విషాదం.. 8 మంది దుర్మ‌ర‌ణం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • ap news
  • ap politics
  • politics
  • Srikalahasti
  • tdp
  • ycp
  • YCP vs TDP

Related News

Jagan

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డుకోవడానికి తాము ఇక్కడ లేమని, కేవలం ప్రచారం కోసం లేదా రాజకీయ కారణాలతో ఇటువంటి పిల్స్ వేస్తున్నారా అని ఎంపీ గురుమూర్తిని ఉద్దేశించి కోర్టు వ్యాఖ్యానించింది.

  • Amaravati

    అమరావతిలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు..!

  • Ap Cm Chandrababu Naidu

    చంద్రబాబు కీలక నిర్ణయాలు.. ఉగాది సందర్భంగా 2.5 లక్షల మందికి సీఎం కానుక!

  • Ap Ev Charging Stations

    ఏపీలో తొలి దశలో 135 ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు

  • AI Services In AP Government Hospitals

    ఏపీలో 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఐ సేవలు

Latest News

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

  • TALRadio : ఈ రేడియో ఆన్ చేస్తే అన్ని మంచి వార్తలే! !

  • Big Shock : యూజర్లకు బిగ్ షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేయబోతున్న కేంద్రం ?

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd