HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Allu Sirish Allu Sirishs Engagement Is A Big Deal

Allu Sirish: ఘనంగా అల్లు శిరీష్-నయనిక నిశ్చితార్థం.. మెగా ఫ్యామిలీ సందడి!

తన తాతగారి జయంతిని పురస్కరించుకుని ఈ శుభకార్యాన్ని నిర్వహించడం తన నాయనమ్మ కోరికను తీర్చినట్లైందని శిరీష్ భావోద్వేగానికి లోనైనట్టు తెలుస్తోంది.

  • Author : Gopichand Date : 31-10-2025 - 10:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Allu Sirish
Allu Sirish

Allu Sirish: మెగా కుటుంబంలో మరో శుభకార్యం ఘనంగా జరిగింది. టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ (Allu Sirish), నాయనికా రెడ్డిల నిశ్చితార్థ వేడుక అట్టహాసంగా, పూర్తి కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. అక్టోబర్ 31వ తేదీన (అల్లు రామలింగయ్య గారి జయంతి సందర్భంగా) ఈ వేడుకను జరుపుకోవాలని శిరీష్ కొద్ది రోజుల క్రితమే ప్రకటించిన సంగతి తెలిసిందే.

కుటుంభ సభ్యుల నడుమ నిశ్చితార్థం

శిరీష్, నయనికల నిశ్చితార్థం వధువు నాయనికా రెడ్డి నివాసంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య జరిగింది. ముందుగా అవుట్‌డోర్ ఎంగేజ్‌మెంట్ ప్లాన్ చేసినప్పటికీ హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాల కారణంగా వేదికను ఇండోర్‌కు మార్చినట్లు సమాచారం. అయినప్పటికీ మెగా, అల్లు కుటుంబాల ఆశీస్సుల మధ్య ఈ కార్యక్రమం పండుగ వాతావరణాన్ని తలపించింది.

Also Read: Men Get Romantic: రాత్రి 12 దాటితే మగవారి మనసు ఎందుకు మారుతుంది?

Allu Sirish and Nayanika .congratulations to the couple.they looks great together pic.twitter.com/D48734ZHVO

— 📸 (@onlyypictures) October 31, 2025

మెగా ఫ్యామిలీ సందడి

ఈ ప్రత్యేక వేడుకకు టాలీవుడ్‌లోని మెగా, అల్లు కుటుంబాల ప్రముఖులు హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో మెగా స్టార్ దంపతులు చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్- ఉపాసన, అల్లు అర్జున్- స్నేహ, అల్లు అరవింద్ దంపతులు, నాగబాబు దంపతులు, వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి దంప‌తులు హాజ‌రైన‌ట్లు తెలుస్తోంది.

మెగా కుటుంబంలోని అగ్ర తారలందరూ ఒకే వేదికపైకి చేరడంతో వేడుకకు మరింత శోభ వచ్చింది. నూతన జంట శిరీష్-నయనికకు శుభాకాంక్షలు తెలుపుతూ వారితో కలిసి చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ సహా ఇతర కుటుంబ సభ్యులు ఫొటోలు దిగారు. ఈ అద్భుతమైన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కొత్త జీవితానికి తొలి అడుగు

తన తాతగారి జయంతిని పురస్కరించుకుని ఈ శుభకార్యాన్ని నిర్వహించడం తన నాయనమ్మ కోరికను తీర్చినట్లైందని శిరీష్ భావోద్వేగానికి లోనైనట్టు తెలుస్తోంది. ఇరు కుటుంబాల స‌మ‌క్షంలో నిశ్చితార్థం వారి వివాహ బంధానికి తొలి అడుగు పడింది. త్వరలోనే శిరీష్-నయనికల వివాహ తేదీని ప్రకటించే అవకాశం ఉంది. సందడితో నిండిన ఈ ఎంగేజ్‌మెంట్ వేడుకతో అల్లు అభిమానులు, సినీ ప్రేమికులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పెళ్లికి సంబంధించిన అప్డేట్స్ కోసం అందరూ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Allu Sirish
  • Cinema News
  • engagement
  • Entertainment News
  • viral news

Related News

    Latest News

    • Sunstroke : వడదెబ్బతో చనిపోతే తెలంగాణ సర్కార్ రూ.4 లక్షల పరిహారం

    • Royal Stag Boom Box : రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్‌తో హోరెత్తిన విశాఖ తీరం

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    • Myra : భారతీయ ప్రయాణికుల కోసం సరికొత్త టెక్నాలజీ

    • కొలెస్ట్రాల్ ఉందా? అయితే ఈ జ్యూస్ తాగండి!

    Trending News

      • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

      • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

      • Prabhakar Prasad: అమెరికా లో చాయ్ అమ్ముతూ ఇండియన్ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

      • టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసిన భార‌త్‌!

      • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో చ‌రిత్ర సృష్టించిన శాంస‌న్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd