Allu Arjun Jail: రేపు ఉదయం 6 గంటల తర్వాత అల్లు అర్జున్ విడుదల.. ఆశగా ఎదురుచూస్తున్న అర్హ!
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆయనకు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది.
- By Gopichand Published Date - 11:50 PM, Fri - 13 December 24

Allu Arjun Jail: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జైలు (Allu Arjun Jail)లో గడిపే అవకాశం ఉంది. అయితే అల్లు అర్జున్ ఈరోజు రాత్రి జైల్లో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఉత్తర్వులు ఇంకా తమకు అందలేదని జైలు అధికారులు చెబుతున్నారు. బన్నీ లాయర్లు తెచ్చిన మధ్యంతర బెయిల్ కాపీలు సరిగా లేవని అధికారులు అంటున్నట్లు సమాచారం. అయితే అల్లు అర్జున్ ఈరోజు జైలు నుండి విడుదల కాకపోవచ్చని జైలు అధికారులు అంటున్నారు. దీంతో చంచల్‌గూడ జైలు వద్ద ఉద్రిక్తత నెలకొంది.
నటుడు అల్లు అర్జున్ ఇంకా చంచల్‌గూడ జైల్లోనే ఉన్నారు. ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసినా.. పూచీకత్తు బాండ్లు తీసుకుని న్యాయవాదులు జైలుకు చేరుకున్నప్పటికీ, కొన్నిగంటల నుంచి విడుదల ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో ఈ రాత్రికి అల్లు అర్జున్ జైల్లోనే ఉండే అవకాశముంది. బన్ని కోసం మంజీరా క్లాస్-1 బ్యారక్‌ను జైలు సిబ్బంది సిద్ధం చేశారు. రేపు ఉదయం 6 గంటల తర్వాత అల్లు అర్జున్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
Also Read: Telengana CM Revanth Reddy: అల్లు అర్జున్ నాకు తెలుసు.. నేను అల్లు అర్జున్‌కు తెలుసు: సీఎం రేవంత్
అల్లు అరవింద్ అసహనం
అల్లు అర్జున్ విడుదల ఆలస్యం కావడంతో నిర్మాత, బన్నీ తండ్రి అల్లు అరవింద్ అసహనం వ్యక్తం చేశారు. కావాలనే లేట్ చేస్తున్నారని అల్లు అరవింద్ ఆరోపిస్తూ.. చంచల్ గూడ జైలు నుండి క్యాబ్ బుక్ చేసుకుని కోపంగా వెళ్లిపోయారు. ఇకపోతే ఇప్పటికే అల్లు అర్జున్ నివాసానికి భారీ సంఖ్యలో టాలీవుడ్ హీరోలు చేరుకున్నారు.
ALLU ARJUN,S DAUGHTER ARHA WAITS AT HOME FOR HER FATHER TO COME.#AlluArjun#AlluArjunArrestedNews #AlluArjunArrested #Telangana #Pushpa2 #Pushpa2TheRule #PakistanCricket pic.twitter.com/2UBimHtc56
— MANSA R. UNIYAL🇮🇳 (@journlist_Mansa) December 13, 2024
తండ్రి కోసం అల్లు అర్హ ఎదురుచూపులు
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆయనకు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది. ఈ క్రమంలోనే తన తండ్రి కోసం అర్హ ఎదురుచూస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బన్నీ కోసం ఎదురుచూస్తున్న అర్హ.. తన ఇంటి వద్ద మీడియాకు చేతులు ఊపుతున్న వీడియో బయటికి వచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.