Allu Arjun: అల్లు అర్జున్ కు అస్వస్థత.. రెండు వారాల పాటు ‘పుష్ప 2’ షూటింగ్ వాయిదా..?!
'పుష్ప' తర్వాత సౌత్ సూపర్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది. 'పుష్ప 2' చిత్రానికి సీక్వెల్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
- By Gopichand Published Date - 09:10 PM, Sat - 2 December 23

Allu Arjun: ‘పుష్ప’ తర్వాత సౌత్ సూపర్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది. ‘పుష్ప 2’ చిత్రానికి సీక్వెల్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అంతకుముందే ఈ సినిమా సెట్స్ నుండి కొత్త అప్‌డేట్ వచ్చింది. హిందుస్థాన్ టైమ్స్ కథనం ప్రకారం.. అల్లు అర్జున్ వెన్ను నొప్పి కారణంగా ‘పుష్ప 2’ షూటింగ్ రెండు వారాల పాటు వాయిదా పడింది.
అల్లు అర్జున్ ‘జాతర గెటప్’లో ఒక పాట, ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరించారు. అయితే దుస్తులు, శక్తివంతమైన యాక్షన్ సన్నివేశాల కారణంగా అతనికి తీవ్రమైన వెన్నునొప్పి మొదలైనట్లు సమాచారం. అయినప్పటికీ అల్లు అర్జున్ షూటింగ్ కొనసాగించాల్సి వచ్చింది. అయితే అతని ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సూపర్ స్టార్ షూటింగ్ నుండి విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు కథనాలు వస్తున్నాయి.
Also Read: Silk Smitha Biopic: సిల్క్ స్మిత ది అన్ టోల్డ్ స్టోరీ.. ఫస్ట్ లుక్ రిలీజ్
సుకుమార్ రచన, దర్శకత్వం వహించిన ‘పుష్ప: ది రైజ్’ 2021 సంవత్సరంలో విడుదలైంది. బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. యాక్షన్ డ్రామా చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో తన నటనకు గాను అల్లు ఇటీవలే ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్న విషయం కూడా తెలిసిందే. ఈ విషయంపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
We’re now on WhatsApp. Click to Join.