Sonali Phogat: విషాదం.. గుండెపోటుతో నటి, బీజేపీ నాయకురాలు మృతి
టెలివిజన్ నటి, హర్యానా బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ (42) సోమవారం రాత్రి గోవాలో గుండెపోటుతో మరణించారు.
- By Balu J Published Date - 01:27 PM, Tue - 23 August 22

టెలివిజన్ నటి, హర్యానా బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ (42) సోమవారం రాత్రి గోవాలో గుండెపోటుతో మరణించారు. సోనాలి తన సిబ్బందితో కలిసి విహారయాత్ర కోసం గోవా వెళ్లారు. సోనాలి ఫోగట్ చివరిసారిగా సల్మాన్ ఖాన్ రియాలిటీ షో బిగ్ బాస్ 14 లో కనిపించింది. ఆమె వైల్డ్ కార్డ్ పోటీదారుగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఫుల్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. సోనాలి ఫోగట్ 2016లో ’ఏక్ మా జో లఖోన్ కే లియే బని అమ్మ’ అనే టీవీ సీరియల్‌తో తన కెరీర్‌ను ప్రారంభించింది. అప్పటి నుండి అనేక హర్యానా సినిమాలు, మ్యూజిక్ ఆల్బమ్స్ లలో కనిపించింది.
ఆమె చివరిగా ‘ది స్టోరీ ఆఫ్ బద్మాష్‌గఢ్’ అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది. 2019 హర్యానా ఎన్నికలలో బిజెపి టిక్కెట్‌పై అడంపూర్ నుండి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సోనాలి కూడా ప్రముఖ రాజకీయ నాయకురాలు. కుల్దీప్ బిష్ణోయ్‌పై ఆమె పోటీ చేశారు. సోనాలికి యశోధర ఫోగట్ అనే కూతురు ఉంది. 2016లో ఆమె భర్త సంజయ్ ఫోగట్ తన ఫామ్‌హౌస్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాడు. సోనాలి మరణం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.