HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >With This Scheme You Can Earn Rs 10 Lakhs In Just Five Years

Mutual Fund: ఈ స్కీంతో ఐదేళ్లలోనే చేతికి రూ. 10 లక్షలు..!

  • Author : Vamsi Chowdary Korata Date : 15-11-2025 - 11:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Baroda Bnp Paribas Large An
Baroda Bnp Paribas Large An

దీర్ఘకాలంలో మెరుగైన రిటర్న్స్ అందుకునేందుకు మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్ అని చెబుతుంటారు నిపుణులు. ఇక్కడ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ బెనిఫిట్ కారణంగా.. సంపద ఏటా పెరుగుతూనే ఉంటుందని చెప్పొచ్చు. ఇప్పుడు రూ. 10 వేల సిప్‌ను ఐదేళ్లలోనే ఏకంగా రూ. 10 లక్షలు చేసిన మ్యూచువల్ ఫండ్ స్కీమ్ గురించి మనం ఇప్పుడు చూద్దాం.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు స్టాక్ మార్కెట్‌ రిస్క్‌కు లోబడి ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఇక్కడ స్టాక్ మార్కెట్లు పతనం అవుతుంటే.. మ్యూచువల్ ఫండ్లలో లాభాలు తగ్గుతుంటాయని చెప్పొచ్చు. అయితే ఇది కొంత కాలం మాత్రమే ఉంటుంది. దీర్ఘకాలంలో మెరుగైన రిటర్న్స్ అందుకోవచ్చని నిపుణులు సూచిస్తుంటారు. ఇక్కడ కాంపౌండింగ్ ప్రయోజనాల కోసం మ్యూచువల్ ఫండ్లలో ఎక్కువగా జనం ఇన్వెస్ట్ చేస్తుంటారు. దీనినే చక్రవడ్డీ అంటారు. చక్రవడ్డీ అంటే వడ్డీపై వడ్డీ వస్తుంది. ఈ కారణంగానే.. ఏటా కాలం గడుస్తున్న కొద్దీ కూడా సంపద పెరుగుతూ పోతూనే ఉంటుంది. స్టాక్ మార్కెట్లు పతనం అవుతున్నాయని వెంటనే ఇందులో నుంచి పెట్టుబడుల్ని ఉపసంహరించుకోవద్దని గుర్తుంచుకోవాలి. అస్థిరత కొంత కాలమే ఉంటుంది. దీర్ఘకాలంలో మాత్రం మరింత ఎక్కువగా లాభాలు వస్తుంటాయి.

మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఎన్నో పథకాలు.. చిన్న మొత్తాల పెట్టుబడిపైనా పెద్ద మొత్తంలో రాబడి ఇచ్చాయి. ఇక్కడ కనీసం రూ. 500 నుంచి కూడా ఇన్వెస్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇలా అద్భుత స్థాయిలో రిటర్న్స్ అందించిన ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ గురించి తెలుసుకుందాం. అదే బరోడా బీఎన్‌పీ పారిబస్ మ్యూచువల్ ఫండ్ నుంచి.. బరోడా BNP పారిబస్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్.

ఈ స్కీమ్ లాంగ్ రన్‌లో కాసుల పంట పండించింది. నెలకు రూ. 10 వేల చొప్పున సిప్ పెట్టుబడి పెట్టిన వారికి కేవలం ఐదేళ్లలోనే రూ. 10 లక్షల వరకు రావడం విశేషం. ఈ మేరకు ఫండ్ హౌస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. లాంగ్ టర్మ్ పెట్టుబడిదారులకు ఇది బెస్ట్ ఆప్షన్ అని పేర్కొంది. కేవలం ఐదేళ్ల వ్యవధిలోనే ఈ ఫండ్ నిర్వహణలోని ఆస్తుల విలువ ఏకంగా రూ. 1500 కోట్ల మార్కు దాటింది.

లంప్‌సమ్ పెట్టుబడుల విషయానికి వస్తే.. ఒకేసారి రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసిన వారికి ఐదేళ్లలో రూ. 2.74 లక్షలు వచ్చాయని చెప్పొచ్చు. ఇక్కడ రెట్టింపునకు మించి లాభం వచ్చిందన్నమాట. సంజయ్ చావ్లా ఈ ఫండ్ మేనేజర్‌గా ఉన్నారు. ఈయన ఈక్విటీకి చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్‌గా ఉన్నారు. కిరణ్ మెహ్తా సీనియర్ అనలిస్టుగా ఉన్నారు. గత మూడేళ్ల వ్యవధిలో చూస్తే సగటున వార్షిక ప్రాతిపదికన 17.08 శాతం రాబడి అందించింది. ఇదే సమయంలో బెంచ్‌మార్క్ BSE లార్జ్ అండ్ మిడ్ క్యాప్ టీఆర్ఐ 13.9 శాతం రాబడినే ఇచ్చింది. ఇది లార్జ్, మిడ్ క్యాప్ కంపెనీ స్టాక్స్‌లో కనీసం 35 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేస్తుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Baroda Bnp Paribas
  • Baroda BNP Paribas Large and Midcap Fund
  • BNP
  • BSE
  • Bussiness
  • midcap
  • Mutual Fund
  • stock market

Related News

Tech Mahindra Layoffs

టెక్‌ మహీంద్రాలో 30వేల లేఆఫ్‌లంటూ వార్తలు..

Tech Mahindra Layoffs  ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ టెక్ మహీంద్రాలో భారీ స్థాయిలో లేఆఫ్స్ జరుగుతున్నాయని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఏకంగా 30 వేల మందిని తొలగిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తలపై టెక్ మహీంద్రా కీలక ప్రకటన చేసింది. ఉద్యోగుల తొలగింపుల వార్తల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన

  • Stock Market

    వార్‌ నష్టాలకు బ్రేక్‌.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు

Latest News

  • Gas Shortage : రైల్ ప్రయాణికులకు LPG షాక్

  • Velugumatla Demolition : కూల్చడం ఎందుకు..? మళ్లీ ఇల్లు కట్టించుడు ఎందుకు..? భూదాన్ ఘటన పై కేటీఆర్ ఫైర్

  • Divorce : విడాకులు తీసుకున్న అల్లు అర్జున్ హీరోయిన్

  • అమరావతిలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు..!

  • Heart Attack: అలర్ట్..గుండె జబ్బులు ఉంటే శరీరంలో కనిపించే లక్షణాలు

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd