Who is Ashok Elluswamy: ‘టెస్లా’కు దిక్సూచి అశోక్ ఎల్లుస్వామి.. ఆయన ఎవరు ?
అశోక్ ఎల్లుస్వామి(Who is Ashok Elluswamy) తమిళనాడు రాష్ట్రంలో జన్మించారు.
- By Pasha Published Date - 01:09 PM, Thu - 15 May 25

Who is Ashok Elluswamy: సుందర్ పిచాయ్.. మన దేశంలోని తమిళనాడు నుంచి గూగుల్ సీఈఓ రేంజుకు ఎదిగారు. అశోక్ ఎల్లుస్వామి కూడా తమిళనాడు నుంచి విఖ్యాత ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా (Tesla)కు ఏఐ సాఫ్ట్‌వేర్ విభాగం వైస్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో అశోక్ నివసిస్తున్నారు. ఈయన 2019 నుంచి టెస్లా ఆటోపైలట్ సాఫ్ట్‌వేర్ విభాగం డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్నారు. ఇంతకీ అశోక్ ఎల్లుస్వామి నేపథ్యం ఏమిటి ? తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బాస్, అపర కుబేరుడు ఎలాన్ మస్క్ గురించి ఏం చెప్పారు ? ఈ కథనంలో చూద్దాం..
Also Read :Kancha Gachibowli : పర్యావరణ నష్టాన్ని పూడ్చకపోతే వాళ్లు జైలుకే.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
అశోక్ ఎల్లుస్వామి.. విద్యార్థి నుంచి సైంటిస్టు దాకా..
- అశోక్ ఎల్లుస్వామి(Who is Ashok Elluswamy) తమిళనాడు రాష్ట్రంలో జన్మించారు.
- ఆయన చెన్నై శివార్లలోని గిండీలో ఉన్న ‘కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ గిండీ’లో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. 2005 – 2009లో ఈ కోర్సును చేశారు.
- 2010లో అశోక్ ఎల్లుస్వామి చెన్నైలో ఉన్న WABCO Vehicle Control Systems అనే కంపెనీలో చేరారు. ఇదొక అమెరికన్ కంపెనీ. ఈ కంపెనీ కార్లు, ట్రక్కులు, లారీల వంటి భారీ వాహనాలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ సస్పెన్షన్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌మిషన్ ఆటోమేషన్ వ్యవస్థలను తయారు చేసేది.
- WABCO Vehicle Control Systems లో 2012 వరకు అశోక్ పనిచేశారు. ఈక్రమంలో వాహనాల్లోని అన్ని రకాల ఎలక్ట్రానిక్ వ్యవస్థల తయారీ, పనితీరుపై ఆయన మంచి అవగాహనను పెంచుకున్నారు.
- అనంతరం అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం పిట్స్‌బర్గ్‌లో ఉన్న కార్నెగీ మెలాన్ యూనివర్సిటీలో చదివారు. 2012 – 2013 వరకు ఈ వర్సిటీలో రోబోటిక్స్ సిస్టమ్ డెవలప్‌మెంట్‌లో మాస్టర్ ఆఫ్ సైన్స్ కోర్సును చేశారు.
- రోబోటిక్స్ కోర్సును పూర్తి చేసిన తర్వాత అశోక్.. అమెరికాలోని బెల్మోంట్‌లో ఉన్న ఫోక్స్ వ్యాగన్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ల్యాబ్‌లో ఇంటర్న్‌గా చేరారు. అక్కడ దాదాపు 7 నెలల పాటు పనిచేసి ఎలక్ట్రానిక్ వాహనాల రీసెర్చ్ లోతుపాతుల గురించి అవగాహనకు వచ్చారు.
- 2014లో ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లాలో అశోక్ చేరారు. అప్పట్లో టెస్లా కంపెనీ ఆటో పైలట్ విభాగం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హోదాలో ఆయన చేరిక జరిగింది.
- 2021లో ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. టెస్లా కంపెనీ ఆటోపైలట్ విభాగం కోసం తాను తొలుత రిక్రూట్ చేస్తున్న వ్యక్తే అశోక్ ఎల్లుస్వామి అని ప్రకటించారు. అశోక్ లేకుంటే టెస్లా కేవలం సాధారణ కార్ల కంపెనీగా మిగిలిపోయేదన్నారు. దీన్నిబట్టి టెస్లాకు అశోక్ చేసిన సేవలను మనం అర్థం చేసుకోవచ్చు.
Also Read :Mukesh Ambani Jackpot : పెట్టుబడి రూ.500 కోట్లు.. లాభం రూ.10వేల కోట్లు.. అంబానీకి జాక్‌పాట్!
మస్క్ వారానికి 90 గంటలు పనిచేస్తారు : అశోక్ ఎల్లుస్వామి
‘‘రిస్క్ తీసుకోవడానికి ఎలాన్ మస్క్ ఎప్పుడూ వెనకడుగు వేయరు. ఆయన చాలా తెలివైనవారు. భవిష్యత్తును ముందుగానే అంచనా వేయగలరు. మస్క్ వారానికి 90 గంటలు పనిచేస్తారు. ఆయనతో కలిసి పనిచేయడం నా అదృష్టం’’ అని అశోక్ ఎల్లుస్వామి చెప్పుకొచ్చారు. ‘‘ప్రస్తుతం కారున్న వాళ్లంతా డ్రైవర్లపై ఆధారపడుతున్నారు. 2035 నాటికి అన్నీ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లే వస్తాయి’’ అని ఆయన జోస్యం చెప్పారు.