Hindenburg Research: హిండెన్‌బర్గ్ పాత ఆరోపణలే వల్లె వేస్తోంది.. అవన్నీ అవాస్తవం : అదానీ గ్రూప్
అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల ధరను కృత్రిమంగా పెంచేందుకు ఉపయోగించిన బెర్ముడా, మారిషస్ ఫండ్‌లలో సెబీ ఛైర్‌పర్సన్ మాధబి పురి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయంటూ ‘హిండెన్‌బర్గ్ రీసెర్చ్’ విడుదల చేసిన నివేదిక కలకలం రేపింది.
- By Pasha Published Date - 01:44 PM, Sun - 11 August 24
Hindenburg Research: అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల ధరను కృత్రిమంగా పెంచేందుకు ఉపయోగించిన బెర్ముడా, మారిషస్ ఫండ్‌లలో సెబీ ఛైర్‌పర్సన్ మాధబి పురి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయంటూ ‘హిండెన్‌బర్గ్ రీసెర్చ్’ విడుదల చేసిన నివేదిక కలకలం రేపింది. దీనిపై తాజాగా ఇవాళ అదానీ గ్రూప్ స్పందించారు. ‘హిండెన్‌బర్గ్ రీసెర్చ్’ నివేదికను అదానీ గ్రూప్ ఖండించింది. తమ వ్యాపార గ్రూపుపై కుట్రతోనే అలాంటి నివేదికలను పదేపదే ‘హిండెన్‌బర్గ్ రీసెర్చ్’ విడుదల చేస్తోందని ఆరోపించింది. హిండెన్ బర్గ్ స్వార్థపూరిత ప్రయోజనాల కోసం సమాచారాన్ని వక్రీకరిస్తూ ఇన్వెస్టర్లను తప్పుదోవపట్టించేందుకు యత్నిస్తోందని అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. హిండెన్‌బర్గ్ గతంలో చేసిన ఆరోపణలపై ఇప్పటికే సమగ్ర దర్యాప్తు జరిగిందని అదానీ గ్రూప్ (Hindenburg Research) గుర్తు చేసింది. ఆ సంస్థ చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని బట్టబయలైందని పేర్కొంది. భారత సుప్రీంకోర్టు సైతం అదానీ గ్రూపునకు క్లీన్‌చిట్ ఇచ్చిందని తెలిపింది. అయినా హిండెన్‌బర్గ్ పాత ఆరోపణలనే వల్లె వేస్తోందని దుయ్యబట్టింది. ఈమేరకు వివరణతో కూడిన సమాచారాన్ని స్టాక్ ఎక్స్ఛేంజీలకు అదానీ గ్రూప్ అందించింది.
We’re now on WhatsApp. Click to Join
అదానీ గ్రూపునకు చెందిన విదేశీ కంపెనీల కార్యకలాపాలు పారదర్శకంగానే జరుగుతున్నాయని తెలిపింది. వాటికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచుతున్నట్లు వెల్లడించింది. తమ కంపెనీలకు ఏ వ్యక్తితోనూ వాణిజ్య సంబంధాలు లేవని స్పష్టం చేసింది. పరోక్షంగా సెబీ ఛైర్‌పర్సన్ మాధబి పురిని ఉద్దేశించి అదానీ గ్రూప్ ఈ వ్యాఖ్య చేసింది. తమ కంపెనీల కార్యకలాపాలు చట్టాలకు లోబడి కొనసాగుతున్నాయని వెల్లడించింది.
Also Read :Vehicles PUC Certificates : ఆ సర్టిఫికెట్ లేకుండా పెట్రోలు బంకుకు వెళ్లారో.. భారీ ఫైన్!
గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ నియంత్రణలో బెర్ముడా, మారిషస్‌లలో అదానీ గ్రూపునకు డొల్ల కంపెనీలు ఉన్నాయని హిండెన్ బర్గ్ నివేదిక తెలిపింది. ఆ కంపెనీలలో సెబీ ఛైర్ పర్సన్ మాధబి పురి, ఆమె భర్త ధావల్ బచ్‌లకు వాటాలు ఉన్నాయని వెల్లడించింది. ఆ దంపతుల నికర సంపద దాదాపు రూ.83 కోట్లు ఉంటుందని అంచనా వేసింది. అయితే ఈ ఆరోపణలను ఖండిస్తూ సెబీ ఛైర్ పర్సన్ మాధబి పురి శనివారం అర్ధరాత్రి తర్వాత 1.30 గంటలకు ఓ ప్రకటన విడుదల చేశారు. తమకు అదానీ గ్రూపుతో సంబంధం లేదని ఆమె తేల్చి చెప్పారు.
Also Read :KTR : ‘అమర రాజా’ తెలంగాణను వీడుతామని ప్రకటించడం బాధాకరం : కేటీఆర్
Related News
Sebi Chief Received Crores : మహీంద్రా గ్రూప్ నుంచి రూ.కోట్లు సంపాదించారు.. సెబీ చీఫ్‌పై కాంగ్రెస్ ఆరోపణలు
ఈవిధంగా సెబీ చీఫ్(Sebi Chief Received Crores) హోదాలో ఉన్నవారు అక్రమ ప్రయోజనాలను పొందడం అనేది సెబీ నిబంధనల ఉల్లంఘన పరిధిలోకి వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా చెప్పారు.