HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >It Is Sad To Hear That Amararaja Group Will Leave The Telangana Ktr

KTR : ‘అమర రాజా’ తెలంగాణను వీడుతామని ప్రకటించడం బాధాకరం : కేటీఆర్

బీఆర్ఎస్ హయాంలో మహబూబ్‌నగర్ జిల్లాలో శంకుస్థాపన జరిగిన అమరరాజా బ్యాటరీ ప్లాంట్‌ విషయమై ఇటీవలే అమరరాజా ఎనర్జీ అండ్‌ మొబిలిటీ గ్రూప్ ఛైర్మన్ గల్లా జయదేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

  • Author : Pasha Date : 11-08-2024 - 12:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Amararaja Group Ktr

KTR : బీఆర్ఎస్ హయాంలో మహబూబ్‌నగర్ జిల్లాలో శంకుస్థాపన జరిగిన అమరరాజా బ్యాటరీ ప్లాంట్‌ విషయమై ఇటీవలే అమరరాజా ఎనర్జీ అండ్‌ మొబిలిటీ గ్రూప్ ఛైర్మన్ గల్లా జయదేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం హయాంలో బ్యాటరీ ప్లాంట్‌ కోసం ఇచ్చిన హామీలను ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చకపోతే తమ ప్లాంట్‌ను వేరే చోటు తరలిస్తామని స్పష్టం చేశారు. దీనిపై తాజాగా ఆదివారం బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ స్పందించారు. అమర రాజా సంస్థ రాష్ట్రాన్ని వీడతామంటూ ప్రకటించటం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టొద్దని కాంగ్రెస్ సర్కారుకు కేటీఆర్(KTR) సూచించారు. బ్రాండ్ తెలంగాణ ఇమేజ్‌కు నష్టం వాటిల్లకుండా సీఎం చర్యలు చేపట్టాలని కోరారు.

We’re now on WhatsApp. Click to Join

అమర రాజా సంస్థ తెలంగాణ నుంచి వెళ్లిపోతామని చెప్పడం దురదృష్టకరమని కేటీఆర్ చెప్పారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా సంస్థలు రాష్ట్రాన్ని వీడాయన్నారు. కేన్స్ టెక్నాలజీ అనే సంస్థ తెలంగాణ నుంచి గుజరాత్‌కు వెళ్లిపోయిందని ఆయన తెలిపారు. కార్నింగ్ సంస్థ తమ ప్లాంట్‌ను చెన్నైకి తరలించిందని చెప్పారు.  ఇప్పుడు అమరరాజా కూడా వెళ్లిపోతానని చెబుతుండటం తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌కు తీవ్ర నష్టం కలిగిస్తుందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో రూ. 9,500 కోట్ల పెట్టుబడులు పెట్టేలా అమరరాజా సంస్థను ఒప్పించేందుకు తాము చాలా కష్టపడ్డామని ఆయన గుర్తు చేసుకున్నారు.

Also Read :Money Mool Accounts : దడ పుట్టిస్తున్న ‘మనీ మూల్‌ అకౌంట్స్’.. బ్యాంకులకు పెనుసవాల్

వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయంతో రెవెన్యూ సర్ ప్లేస్ స్టేట్‌గా ఉందన్నారు. కానీ స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రే తెలంగాణ దివాలా తీసిందని ప్రచారం చేస్తుండటం ఆవేదన కలిగిస్తోందని పేర్కొన్నారు. కంపెనీలకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను కొనసాగించాల్సిన బాధ్యత కాంగ్రెస్ సర్కారుపై ఉందన్నారు. లేదంటే మరిన్ని సంస్థలు తెలంగాణ రాష్ట్రాన్ని వదిలే ముప్పు ఉందన్నారు. శనివారం రోజు (ఆగస్టు 10న) మహబూబ్‌నగర్‌ జిల్లాలో సెల్‌ మాన్యుఫాక్చరింగ్‌ కస్టమర్‌ క్వాలిఫికేషన్‌ ప్లాంటు నిర్మాణానికి భూమి పూజ చేసిన గల్లా జయదేవ్‌.. 1.5 గిగావాట్ల బ్యాటరీ ప్యాక్‌ ప్లాంట్‌ ఫేజ్‌-1కు ప్రారంభోత్సవం చేశారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్లాంటు తరలింపు కామెంట్స్ చేశారు.

Also Read :Paris Olympics 2024 : ఏడు పతకాలు జస్ట్ మిస్.. ఆరు పతకాలతో సరిపెట్టుకున్న భారత్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AmaraRaja Group
  • CM Revanth Reddy
  • ktr
  • telangana

Related News

Kalvakuntla Kavitha lashes out at KTR.

kavitha kalvakuntla: కేటీఆర్ పై కల్వకుంట్ల కవిత ఫైర్

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్‌లోకి వెళ్తానని ప్రచారం చేస్తున్నారని.. అయితే తన కంఠంలో ప్రాణం ఉండగా మళ్లీ బీఆర్ఎస్‌లోకి వెళ్లేదే లేదని, ఆ పార్టీతో జతకట్టేదే లేదని ఆమె స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా తాను ఎన్నో అవమానాలకు గురయ్యానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి బాయి బాటలో భాగంగా కొత్తగూడెం పర్యటనకు వెళ్లిన సందర్భంగా

  • Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

    ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

  • Even though KTR got entangled in his own challenge, Revanth Reddy gained the upper hand over BRS!

    Cm Revanth Reddy: తన సవాలులో తానే చిక్కుకున్న KTR.. BRS పై పైచేయి సాధించిన రేవంత్ రెడ్డి!

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd