Welfare Schemes Vs Labourers: సంక్షేమ పథకాలపై ఎల్‌అండ్‌టీ ఛైర్మన్ సంచలన కామెంట్స్
నిర్మాణ రంగంలో కార్మికుల వలసలు తగ్గిపోవడం మంచి పరిణామమే. అయితే దీనిపై తాజాగా ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్(Welfare Schemes Vs Labourers) ఆందోళన వ్యక్తంచేశారు.
- By Pasha Published Date - 10:15 AM, Wed - 12 February 25

Welfare Schemes Vs Labourers: మనదేశంలోని అన్ని రాజకీయ పార్టీలూ సంక్షేమ పథకాలతోనే జనంలోకి వెళ్తున్నాయి. పార్టీలను జనంతో కనెక్ట్ చేస్తున్నవి సంక్షేమ పథకాలే. అలాంటి సంక్షేమ పథకాలపై ప్రఖ్యాత నిర్మాణ రంగ కంపెనీ ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Also Read :Postal Jobs 21413 : భారీగా ‘తపాలా’ జాబ్స్.. తెలుగు రాష్ట్రాల్లోనూ వందలాది ఖాళీలు
కార్మికుల లభ్యత గురించే ఆందోళన
నిర్మాణ రంగంలో కార్మికుల వలసలు తగ్గిపోవడం మంచి పరిణామమే. అయితే దీనిపై తాజాగా ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్(Welfare Schemes Vs Labourers) ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్లే కార్మికుల వలసలు తగ్గిపోయాయని చెప్పారు. సంక్షేమ పథకాల రుచి మరిగిన కార్మికులు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి పనులు చేయడానికి ఆసక్తి చూపడం లేదని ఆయన కామెంట్ చేశారు. తాజాగా చెన్నైలో జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సదస్సులో ప్రసంగిస్తూ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎల్ అండ్ టీ కంపెనీలో ప్రస్తుతం 2.5 లక్షల మంది ఉద్యోగులు, 4 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారని చెప్పిన ఆయన.. ఉద్యోగుల సంఖ్య కొంత తగ్గినా పెద్దగా దాని ప్రభావం కనిపించడం లేదన్నారు. తన ఆందోళన అంతా కార్మికుల లభ్యత గురించేనని ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్ చెప్పారు. సంక్షేమ పథకాల వల్ల లబ్ధి లభిస్తుండటంతో కార్మికులు తమ సొంత ప్రాంతాలను వదిలేసి వచ్చేందుకు సిద్ధపడటం లేదన్నారు.
వైట్ కాలర్ ఉద్యోగులు కూడా మారిపోయారు
వైట్ కాలర్ ఉద్యోగాలు చేస్తున్న వృత్తి నిపుణులకు కూడా ఇదే విధమైన ఆలోచన వచ్చినట్లు తనకు అనిపిస్తోందని ఆయన తెలిపారు. ‘‘నేను ఎల్ అండ్ టీ కంపెనీలో ఇంజినీర్‌గా చేరినప్పుడు మా బాస్ ఢిల్లీలో జాబ్ చేయాల్సి ఉంటుందని నాతో చెప్పారు. కానీ, ఈ రోజుల్లో ఎవరైనా అభ్యర్థికి అలా చెబితే ‘బై’ అని వెళ్లిపోతున్నారు’’ అని ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Also Read :New Ministers : మంత్రివర్గ విస్తరణ.. ఆ నలుగురికి బెర్త్.. ఎమ్మెల్యేల టఫ్ ఫైట్
భార్యను చూస్తూ ఉండిపోతారా ?
గతంలో వర్క్‌లైఫ్ బ్యాలెన్స్‌పై సుబ్రహ్మణ్యన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు. ఎంతకాలం అలా భార్యను చూస్తూ ఉండిపోతారు. ఇంట్లో తక్కువ సమయం, ఆఫీసులో ఎక్కువ సమయం ఉంటామని భార్యలకు చెప్పాలి. వారానికి 90 గంటల పాటు పనిచేయాలి. ఆదివారం సెలవునూ వదిలేయాలి’’ అని ఆయన పేర్కొనడాన్ని చాలామంది బహిరంగంగా వ్యతిరేకించారు.