New Ministers : మంత్రివర్గ విస్తరణ.. ఆ నలుగురికి బెర్త్.. ఎమ్మెల్యేల టఫ్ ఫైట్
వీరి పేర్లపై ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతల నుంచి కేసీ వేణుగోపాల్(New Ministers) అభిప్రాయ సేకరణ చేస్తున్నారట.
- By Pasha Published Date - 08:41 AM, Wed - 12 February 25

New Ministers : తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు హాట్ టాపిక్ మంత్రివర్గ విస్తరణే. కొత్త మంత్రులు అయ్యేది ఎవరు ? అనే దానిపై చర్చ నడుస్తోంది. ఈ అంశంపై కాంగ్రెస్ హైకమాండ్ యాక్టివేట్ అయింది. మంత్రుల ఎంపికపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణుగోపాల్ ముమ్మర కసరత్తు చేస్తున్నారు. మాదిగ (ఉపకులం) కోటా కింద స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాల సామాజికవర్గం నుంచి గడ్డం వివేక్ వెంకటస్వామి పేర్లను ఆయన పరిశీలిస్తున్నట్లు తెలిసింది. రెడ్డి సామాజికవర్గం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, వెలమ సామాజికవర్గం నుంచి ప్రేమ్‌సాగర్‌రావు, ముదిరాజ్ సామాజికవర్గం నుంచి వాకిటి శ్రీహరి, లంబాడా వర్గం నుంచి బాలునాయక్ పేర్లు పరిశీలనలో ఉన్నాయట.
Also Read :Chicken Quality : బర్డ్ ఫ్లూ భయాలు.. చికెన్ కొనేటప్పుడు ఇవి చెక్ చేయండి
అభిప్రాయ సేకరణ, సామాజిక సమీకరణాలు, ఉమ్మడి జిల్లాల ప్రాతినిధ్యం
వీరి పేర్లపై ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతల నుంచి కేసీ వేణుగోపాల్(New Ministers) అభిప్రాయ సేకరణ చేస్తున్నారట. తెలంగాణలోని సామాజిక సమీకరణాలు, ఉమ్మడి జిల్లాల వారీగా ప్రాతినిధ్యం వంటి అంశాలను కూడా ఆయన పరిగణనలోకి తీసుకోనున్నారు. ఫిబ్రవరి నెలాఖరులోగా మంత్రుల ఎంపిక ప్రక్రియ కొలిక్కి రావొచ్చని అంచనా వేస్తున్నారు. తొలి విడతగా నలుగురికి తెలంగాణ మంత్రివర్గంలో అవకాశం ఇస్తారని అంటున్నారు. ఒకవేళ ఈ నెలాఖరులోగా మంత్రివర్గ విస్తరణ జరగకపోతే, స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే దానిపై కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటన చేయనుంది.
Also Read :Tenali Ramakrishna : తెనాలి రామకృష్ణగా నాగచైతన్య..?
పోటాపోటీగా..
మంత్రి పదవుల రేసులో ఉన్న కడియం శ్రీహరిపై ప్రస్తుతం అనర్హత కత్తి వేలాడుతోంది. ఈ నెల 18న సుప్రీంకోర్టు స్పందనను బట్టి, ఆయన విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకోనుంది. వివేక్ కుటుంబానికి ఒక ఎంపీ, రెండు ఎమ్మెల్యే సీట్లు ఉండడం కడియంకు పెద్ద అవరోధంగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకే చెందిన ప్రేమ్‌సాగర్‌రావు నుంచి వివేక్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది. ప్రేమ్‌సాగర్‌రావుకు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క మద్దతు ఉంది. నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి పేరును మంత్రి పదవి కోసం సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదిస్తున్నారట. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బాలునాయక్‌లు మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. రాజగోపాల్‌రెడ్డి సోదరుడు ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్నారు. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశాలు తక్కువేనని అంటున్నారు.ఎస్టీ లంబాడా కోటాలో బాలు నాయక్‌కు మంత్రి పదవి దక్కొచ్చు.