GST Collection: దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది శుభవార్తే..!
డేటా ప్రకారం సెంట్రల్ జీఎస్టీ వసూళ్లు రూ.34,141 కోట్లు, స్టేట్ జీఎస్టీ రూ.43,047 కోట్లు, ఇంటిగ్రేటెడ్ ఐజీఎస్టీ రూ.91,828 కోట్లు, సెస్ రూ.13,253 కోట్లు. నవంబర్‌లో మొత్తం స్థూల జీఎస్‌టీ ఆదాయం 8.5 శాతం పెరిగి రూ.1.82 లక్షల కోట్లకు చేరుకుంది.
- By Gopichand Published Date - 11:22 PM, Sun - 1 December 24

GST Collection: దేశ ఆర్థిక వ్యవస్థకు శుభవార్త వెలువడింది. వస్తు, సేవల పన్ను (GST Collection) వల్ల ప్రభుత్వ ఖజానా భారీగా పెరిగింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. నవంబర్ నెలలో దేశీయ లావాదేవీల నుండి GST వసూళ్లు 8.5 శాతం పెరిగి రూ.1.82 లక్షల కోట్లకు పైగా ఉన్నాయి. అంతకుముందు అక్టోబర్ నెలలో రికార్డు స్థాయిలో రూ.1.87 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు రాబట్టింది.
డేటా ప్రకారం సెంట్రల్ జీఎస్టీ వసూళ్లు రూ.34,141 కోట్లు, స్టేట్ జీఎస్టీ రూ.43,047 కోట్లు, ఇంటిగ్రేటెడ్ ఐజీఎస్టీ రూ.91,828 కోట్లు, సెస్ రూ.13,253 కోట్లు. నవంబర్‌లో మొత్తం స్థూల జీఎస్‌టీ ఆదాయం 8.5 శాతం పెరిగి రూ.1.82 లక్షల కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే నెలలో రూ. 1.68 లక్షల కోట్లుగా ఉంది.
Also Read: Telangana: తెలంగాణకు మరో గుడ్ న్యూస్.. 400 మందికి ఉద్యోగాలు?
అక్టోబర్‌లో రూ.1.87 లక్షల కోట్ల వసూళ్లు
అక్టోబర్‌లో రూ. 1.87 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు 9 శాతం వార్షిక వృద్ధితో రెండో అత్యుత్తమ జీఎస్‌టీ వసూళ్లు. ఇప్పటి వరకు అత్యధికంగా ఏప్రిల్ 2024లో రూ. 2.10 లక్షల కోట్ల కంటే ఎక్కువ వసూలు చేసింది. సమీక్షిస్తున్న నెలలో దేశీయ లావాదేవీల ద్వారా జీఎస్టీ ఆదాయం 9.4 శాతం పెరిగి రూ.1.40 లక్షల కోట్లకు చేరుకోగా, దిగుమతులపై పన్ను ద్వారా వచ్చే ఆదాయం దాదాపు 6 శాతం పెరిగి రూ.42,591 కోట్లకు చేరుకుంది. ఈ నెలలో రూ.19,259 కోట్ల విలువైన రీఫండ్‌లు జారీ చేయబడ్డాయి. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 8.9 శాతం తక్కువ. రీఫండ్‌లను సర్దుబాటు చేసిన తర్వాత నికర జీఎస్‌టీ వసూళ్లు 11 శాతం పెరిగి రూ.1.63 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
డిసెంబర్ 21న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
GST కౌన్సిల్ 55వ సమావేశం డిసెంబర్ 21న రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జరుగుతుంది. అధికారిక వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. జిఎస్‌టి కౌన్సిల్ 55వ సమావేశం 2024 డిసెంబర్ 21న రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జరగనుంది. నగరంలోని ఫైవ్ స్టార్ హోటల్‌లో జరిగే ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక మంత్రి, ఇతర రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.