Telangana: తెలంగాణకు మరో గుడ్ న్యూస్.. 400 మందికి ఉద్యోగాలు?
తెలంగాణ రాష్ట్రంలో రూ. వెయ్యి కోట్ల కోకో కోలా గ్రీన్ ఫీల్డ్ ప్లాంటును సోమవారం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించనున్నారు.
- By Gopichand Published Date - 11:08 PM, Sun - 1 December 24

Telangana: సీఎం రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణలో భారీ పెట్టుబడులకు సంస్థలు ముందుకు వస్తున్నాయి. అలాగే ఇప్పటికే ఉన్న సంస్థలు వాటి పరిధిని పెంచుకుంటున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ (Telangana)లో పెట్టుబడులను ప్రొత్సహిస్తున్నారు. అలాగే యువతకు ఉపాధి అవకాశాలు కలిగించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అనేక సంస్థల పెట్టుబుడులకు సీఎం రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. రేవంత్ సర్కార్ ఇప్పటికే పలు సంస్థల పెట్టుబడులకు అనుమతి ఇవ్వగా తాజాగా మరో సంస్థకు అనుమతి ఇచ్చింది.
తెలంగాణ రాష్ట్రంలో రూ. వెయ్యి కోట్ల కోకో కోలా గ్రీన్ ఫీల్డ్ ప్లాంటును సోమవారం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించనున్నారు. కోకో కోలా, థమ్స్ అప్ లాంటి శీతల పానీయాలను ఉత్పత్తి చేసే హిందుస్థాన్ బివరేజెస్ సంస్థ బండ తిమ్మాపూర్ ఫుడ్ పార్కులో నిర్మించిన భారీ బాట్లింగ్ యూనిట్ ను సోమవారం మధ్నాహ్నం 12 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబులు ప్రారంభించనున్నారు. దాదాపు రూ.1,000 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ గ్రీన్ ఫీల్డ్ బాట్లింగ్ ప్లాంట్ ఇటీవలే నిర్మాణం పూర్తి చేసుకుంది. ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో పనిచేసే నాటికి 400 మందికి కొత్తగా ఉద్యోగాలు లభిస్తాయని వర్గాలు చెబుతున్నాయి.
Also Read: TPCC Chief Angry: బీజేపీ సుద్దాపూస మాటలు మాట్లాడుతుంది.. టీపీసీసీ చీఫ్ ఆగ్రహం!
400 మందికి ఉద్యోగాలు?
రూ. వెయ్యి కోట్ల కోకో కోలా గ్రీన్ ఫీల్డ్ ప్లాంటు ద్వారా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కోకో కోలా, థమ్స్ అప్ లాంటి శీతల పానీయాలను ఉత్పత్తి చేసే హిందుస్థాన్ బివరేజెస్ సంస్థ బండ తిమ్మాపూర్ ఫుడ్ పార్కులో నిర్మించిన భారీ బాట్లింగ్ యూనిట్ ను ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ ప్లాంట్ పూర్తిగా అందుబాటులోకి వస్తే 400 మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలుస్తోంది.