GOLD: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్
- Author : Vamsi Chowdary Korata
Date : 05-05-2026 - 10:29 IST
Published By : Hashtagu Telugu Desk
పసిడి ప్రియులకు అదిరే శుభవార్త. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. వరుసగా రెండో రోజూ పసిడి ధరలు దిగివచ్చాయి. క్రితం రోజు తులం బంగారం రేటు ఏకంగా రూ.1300 వరకు తగ్గగా, ఈరోజు మరో రూ.440 మేర పడిపోయింది. అలాగే ఈరోజు వెండి ధర సైతం రూ.5000 మేర దిగివచ్చింది. ఈ క్రమంలో మే 5వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో 22, 24 క్యారెట్ల బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త లభించింది. దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా దిగివచ్చాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, హార్ముజ్ జలసంధిని శాశ్వతంగా తెరిచి ఉంచడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన బంగారం ధరలు దిగివచ్చేందుకు కారణమైనట్లు బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. హార్ముజ్‌లో చిక్కుకున్న విదేశీ నౌకలను సురక్షితంగా గమ్యాలకు చేర్చేందుకు ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ప్రకటించారు. గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గడం దేశీయంగానూ ధరలు దిగివచ్చేందుకు దోహదపడింది. సాధారణంగా అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు, అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పుడు బంగారం ధరలు పెరుగుతుంటాయి. కానీ, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు బంగారం ధరలపై విరుద్ధంగా ప్రభావం చూపిస్తున్నాయి. అమెరికా నిర్ణయాలు ప్రధానంగా ఇక్కడ ప్రభావితం చేస్తున్నాయి. ఈ క్రమంలో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా రెండో రోజూ తగ్గాయి. దీంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో మే 5వ తేదీన 22, 24 క్యారెట్ల బంగారం రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
బంగారం ధరలతో పాటు వెండి ధరలు సైతం తగ్గడం ఊరట కలిగించే విషయంగా చెప్పవచ్చు. దేశీయ మార్కెట్లో ఈరోజు కిలో వెండి ధర రూ.5000 మేర తగ్గింది. దీంతో హైదరాబాద్‌లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,65,000 మార్క్ వద్ద అమ్ముడవుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల్లో ఊహించని మార్పులు జరుగుతున్నాయి. క్రితం రోజు వరకు భారీగా దిగివచ్చిన పసిడి రేట్లు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. అయితే వెండి రేటు తగ్గింది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 8 డాలర్లు పెరిగి 4532 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 0.29 శాతం మేర తగ్గి 72.81 డాలర్ల వద్ద అమ్ముడవుతోంది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు వరుసగా రెండో రోజూ తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రేటు 10 గ్రాములకు క్రితం రోజు రూ.1310 మేర తగ్గగా, ఈరోజు మరో రూ.440 మేర దిగివచ్చింది. దీంతో తులం బంగారం ధర రూ.1,49,180 వద్దకు పడిపోయింది. ఇక 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు క్రితం రోజు రూ.1200 మేర తగ్గగా, ఈరోజు మరో రూ.400 మేర పడిపోయింది. దీంతో తులం రేటు రూ.1,36,750 వద్దకు దిగివచ్చింది.