Xiaomi SU7: ఇండియలో ఎలక్ట్రిక్ కారును ప్రదర్శించిన షావోమీ.. ఫీచర్స్ గురించి తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!
ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న క్రేజ్ గురించి డిమాండ్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ ఎలక్ట్రిక్ వాహనాల వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని జరగకపోవడంతో ప్రభుత్వాలు కూడా ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు పూర్తిగా మదర్ తెలుపుతున్నాయి.
- By Anshu Published Date - 11:00 AM, Sun - 14 July 24

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న క్రేజ్ గురించి డిమాండ్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ ఎలక్ట్రిక్ వాహనాల వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని జరగకపోవడంతో ప్రభుత్వాలు కూడా ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు పూర్తిగా మదర్ తెలుపుతున్నాయి. దానికి తోడు డీజిల్,పెట్రోల్ ధరల నుంచి ఉపశమనం లభిస్తుండడంతో వాహన వినియోగదారులు ఎక్కువ శాతం మంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని దిగ్గజ ఆటో మొబైల్ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేస్తున్నాయి.
ఈ క్రమంలోనే ప్రముఖ ఎలక్ట్రాకిన్ దిగ్గజం షావోమీ సైతం ఒక ఎలక్ట్రిక్ కారును తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. అలాగే ఆ దేశంలో తొలి ఎలక్ట్రిక్ సెడాన్ కారును కూడా ఆవిష్కరించింది. ఇంకా అధికారికంగా ఈ కారును లాంచ్ చేయకపోయినప్పటికీ కారులో ఉన్న ఫీచర్లను తెలుపుతూ ప్రదర్శనలు నిర్వహిస్తోంది. అలాగే తాజాగా షావోమీ ఇండియాలో 10 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో భారత్ లో కూడా ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. అధునాతన ఫీచర్లుతో కూడిన ఈ కారు యూజర్లను ఆకట్టుకుంటోంది. మరి ఈ కారు ప్రత్యేకతల విషయానికి వస్తే..
షావోమీ ఈ కారును పూర్తి స్థాయి హై పెర్ఫార్మెన్స్ ఎకో సిస్టమ్ సెడాన్‌గా డెవలప్ చేసింది. ఈ కారులో ఇ మోటార్, సీటీబీ ఇంటిగ్రేటెడ్ బ్యాటరీ, షియోమి డై కాస్టింగ్, షియోమి పైలట్ అటానమస్ డ్రైవింగ్, స్మార్ట్ క్యాబిన్ వంటివి ప్రత్యేకంగా డెవలప్ చేశారు. కంపెనీకి చెంది సుమారు 3400 మంది ఇంజనీర్లు, 1000 మంది టెక్నికల్ సిబ్బంది కృషి చేశారు. ఇకపోతే ఈ కారు ఫీచర్ల విషయానికొస్తే.. ఈ కారు గరిష్టంగా 673 హెచ్‌పి పవర్, 838 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. కేవలం 2.78 సెకన్లలో 100 కిలో మీటర్ల వేగాన్ని అందుకోగలదు. షావోమీ కారు గరిష్టంగా 265 కిలో మీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఇక ఈ కారును ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఏకంగా 800 కిలోమీటర్లు దూసుకెళ్లొచ్చు. ఈ కారులో 56 ఇంచెస్ హెడ్ అప్ డిస్‌ప్లే, రొటేటింగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 16.1 ఇంచెస్ 3కే అల్ట్రా క్లియర్ కంట్రోల్ స్క్రీన్, మూవింగ్ డ్యాష్‌బోర్డ్ వంటి అధునాతన ఫీచర్లను కూడా అందించారు. ఈ కారుకు సంబంధించిన మరిన్ని ఫీచర్లు అలాగే ధర విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.