Tata Tiago: రూ. 4.99 లక్షలకే కారు.. బుకింగ్ కూడా ప్రారంభం!
కొత్త ఫేస్‌లిఫ్ట్ టియాగో ఇంజన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ కారు 5 స్పీడ్ మ్యాన్యువల్, AMT గేర్‌బాక్స్‌తో లభించే పాత 3 సిలిండర్లు, 1.2L పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది.
- By Gopichand Published Date - 02:28 PM, Fri - 10 January 25

Tata Tiago: టాటా మోటార్స్ భారతదేశంలో తమ చిన్న కారు టియాగో (Tata Tiago) ధరను ప్రకటించింది. కార్ బుకింగ్ ప్రారంభమైంది. కొత్త టియాగో ఫీచర్ల గురించి ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఈ నెలలో ప్రారంభమయ్యే ఆటో ఎక్స్‌పో 2025లో ఈ కారు మిగిలిన వివరాలు కూడా వెల్లడి చేయనున్నారు. కొత్త టియాగో పెట్రోల్, సిఎన్‌జి, ఎలక్ట్రిక్ వెర్షన్లలో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ కారు మారుతి సుజుకి సెలెరియోతో నేరుగా పోటీపడుతుంది.
డిజైన్ లో స్వల్ప మార్పులు
కొత్త టియాగో డిజైన్‌లో టాటా మోటార్స్ చెప్పుకోదగ్గ మార్పులు ఏమీ చేయలేదు. అయితే కొంచెం కొత్తదనాన్ని ఇందులో చూడవచ్చు. దీని ఫ్రంట్ గ్రిల్‌లో మార్పు ఉంది. బంపర్ డిజైన్‌లో కొత్తదనం ఉంది. కారులో అమర్చిన టైర్లు కొత్త డిజైన్‌లో ఉన్నాయి. ఈ కారు పరిమాణంలో ఎటువంటి మార్పు లేదు. దాని ఇంటీరియర్‌లో కూడా ఎటువంటి మార్పు లేదని తెలుస్తోంది. ఈ కారు పరిమాణం మునుపటిలాగే ఉంది.
Also Read: Delhi Assembly Elections : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
ఇంజిన్- పవర్
కొత్త ఫేస్‌లిఫ్ట్ టియాగో ఇంజన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ కారు 5 స్పీడ్ మ్యాన్యువల్, AMT గేర్‌బాక్స్‌తో లభించే పాత 3 సిలిండర్లు, 1.2L పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. జనవరిలో జరగనున్న ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో కొత్త మోడల్‌ను ప్రదర్శించనున్నారు.
ఫీచర్లు
కొత్త టియాగో 7.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేకి మద్దతు ఇస్తుంది. కారు చాలా మంచి సౌండ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, వెనుక పార్కింగ్ సెన్సార్, EBD, ఎయిర్‌బ్యాగ్‌లతో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ కారును కొత్త రంగులలో కూడా కొనుగోలు చేయవచ్చు. అయితే దీని ధర రూ. 4.99 లక్షల నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.