New Suzuki Access 125: పేరుకే స్కూటీ.. ఫోన్‌లో ఉన్న ఫీచర్లు అన్ని ఉన్నాయ్!
కొత్త సుజుకి యాక్సెస్ 125 డిజైన్ ఇప్పుడు మెరుగ్గా కనిపిస్తోంది. ఇది స్మార్ట్, స్లిమ్‌గా మారింది. ఇప్పుడు ఈ స్కూటర్ యువతతో పాటు కుటుంబ వర్గానికి కూడా నచ్చుతుంది.
- By Gopichand Published Date - 03:45 PM, Tue - 21 January 25

New Suzuki Access 125: 125సీసీ స్కూటర్ సెగ్మెంట్లో సుజుకి యాక్సెస్ (125 New Suzuki Access 125) బెస్ట్ సెల్లర్. చాలా కాలంగా ఈ స్కూటర్ అప్‌డేట్ చేయబడిన మోడల్ లేదు. కానీ ఇప్పుడు కంపెనీ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో యాక్సెస్ 125 2025 వెర్షన్‌ను పరిచయం చేసింది. ఈసారి దాని డిజైన్, ఫీచర్లలో పెద్ద మార్పులు చేశారు. ఈ స్కూటర్ 3 వేరియంట్లలో విడుదల చేయనున్నారు. యాక్సెస్ 125 ధర రూ. 81,700 నుండి రూ. 93,300 మధ్య ఉంటుంది.
సుజుకి యాక్సెస్ 125 స్టాండర్డ్ ఎడిషన్
కొత్త యాక్సెస్ స్టాండర్డ్ ఎడిషన్ ధర రూ.81,700 నుండి ప్రారంభమవుతుంది. ఫీచర్ల గురించి చెప్పాలంటే.. ఇది LCD ఇన్స్ట్రుమెంట్ స్క్రీన్, USB ఛార్జింగ్ పోర్ట్, హజార్డ్ లైట్, డ్యూయల్ యుటిలిటీ పాకెట్లను ముందు భాగంలో కలిగి ఉంది. భద్రత కోసం స్కూటర్‌లో CBS సిస్టమ్, పార్కింగ్ బ్రేక్, సైడ్ స్టాండ్ ఇంటర్‌లాక్ ఉన్నాయి. మీరు ఈ స్కూటర్‌ను పెరల్ గ్రేస్ వైట్, మెటాలిక్ మ్యాట్ బ్లాక్, మెటాలిక్ మ్యాట్ స్టెల్లార్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు.
Also Read: Gautam Adani First Business: గౌతమ్ అదానీ తన మొదటి వ్యాపారంలో ఎంత సంపాదించారో తెలుసా?
సుజుకి యాక్సెస్ 125 ప్రత్యేక ఎడిషన్
కొత్త యాక్సెస్ స్పెషల్ ఎడిషన్ ధర రూ.88,200. సాలిడ్ ఐస్ గ్రీన్ కలర్ కాకుండా మీరు ఈ స్కూటర్‌లో మరో 3 కలర్ ఆప్షన్‌లను పొందుతారు. మెరుగైన బ్రేకింగ్ కోసం ఇది ముందు భాగంలో డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్ సౌకర్యాన్ని కలిగి ఉంది. ఇది బేస్ మోడల్ నుండి కొంచెం అధునాతనమైనది.
సుజుకి యాక్సెస్ 125 రైడ్ కనెక్ట్ ఎడిషన్
రైడ్ కనెక్ట్ ఎడిషన్ కొత్త యాక్సెస్ స్కూటర్ టాప్ వేరియంట్. దీని ధర రూ.93,300. ఇందులో మీరు చాలా మంచి ఫీచర్లను చూడబోతున్నారు. ఈ స్కూటర్‌లో బ్లూటూత్ ఆధారిత కనెక్టివిటీ సౌకర్యం ఉంది. దీనితో వినియోగదారులు కాల్స్, SMS, WhatsApp అలర్ట్‌లు, ఓవర్ స్పీడింగ్ అలర్ట్‌లు, వాతావరణ అప్‌డేట్‌లు, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్‌లను పొందుతారు. ఈ స్కూటర్‌లో డిజిటల్ వాలెట్ కూడా ఉంది. ఇందులో డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ సాఫ్ట్ కాపీలను ఉంచవచ్చు.
డిజైన్, ఇంజిన్
కొత్త సుజుకి యాక్సెస్ 125 డిజైన్ ఇప్పుడు మెరుగ్గా కనిపిస్తోంది. ఇది స్మార్ట్, స్లిమ్‌గా మారింది. ఇప్పుడు ఈ స్కూటర్ యువతతో పాటు కుటుంబ వర్గానికి కూడా నచ్చుతుంది. ఇంజన్ గురించి చెప్పాలంటే.. ఇందులో 124సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 8.4బిహెచ్‌పి పవర్, 10.2ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది CVT గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. సౌకర్యవంతమైన ప్రయాణం కోసం స్కూటర్‌లో టెలిస్కోపిక్ ఫ్రంట్, వెనుకవైపు స్వింగ్ ఆర్మ్ సస్పెన్షన్ ఉన్నాయి.