HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ys Vijayamma Open Letter To Ysr Fans

YS Vijayamma Open Letter: వైఎస్‌ఆర్‌ అభిమానులకు విజయమ్మ లేఖ.. ఆస్తుల వ‌ల‌న కుటుంబం విడిపోవాల్సి వ‌చ్చింది!

జగన్ చెప్పింది ఏంటంటే..."పిల్లలు పెద్ద వాళ్ళు అయ్యారు.. నాకు అల్లుళ్ళు వస్తారు.. నీకు అల్లుడు, కోడలు వస్తారు.. మనం కలిసి ఉన్నట్లు వాళ్ళు కలిసి ఉండకపోవచ్చు..కాబట్టి విడిపోదాం" అన్నాడు. అలా 2019 వరుకు కలిసి ఉన్న కుటుంబం, ఆస్తుల పరంగా విడిపోవాలని నిర్ణయం జరిగింది.

  • By Gopichand Published Date - 07:15 PM, Tue - 29 October 24
  • daily-hunt
YS Vijayamma
YS Vijayamma

YS Vijayamma Open Letter: వైఎస్‌ఆర్‌ అభిమానులకు విజయమ్మ బహిరంగ లేఖ (YS Vijayamma Open Letter) రాశారు. ‘‘వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిని ప్రేమించే ప్రతి కుటుంబానికి నా అభ్యర్థన. నా కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో అర్థం కావట్లేదు. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే చాలా బాధేస్తుంది. జరగకూడనివన్నీ నా కళ్లముందే జరిగిపోతున్నాయి. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు మాట్లాడుతున్నారు’’ అని లేఖలో పేర్కొన్నారు.

ఇంకా ఆ లేఖ‌లో.. రాజశేఖర్ రెడ్డి ప్రేమించే ప్రతి హృదయానికి, ఈ కుటుంబాన్ని ఆదరించి అక్కున చేర్చుకున్న ప్రతి ఒక్కరికీ మీ విజయమ్మ చేస్తున్న అభ్యర్థన. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మనసుకి చాలా చాలా బాదేస్తుంది. పెద్దలంటారు.. ఇంటి గుట్టు వ్యాధి రట్టు.. తెరిచిన పుస్తకం అని రాజశేఖర్ రెడ్డి ఎప్పుడు అనేవారు. అయితే ఇలా కాదు. చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి, నేను, నా పిల్లలు చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. నా కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో నాకు అర్థం కావడం లేదు. నేను అడుకోవడానికి ఎంత ప్రయత్నించినా, జరగకూడనివి అన్ని నా కళ్ళముందే జరిగి పోతున్నాయి. ఈ కుటుంబం గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. అబద్ధాల పరంపర కొనసాగుతుంది. తెలిసి కొంత తెలియకుండా కొంత మాట్లాడుతున్నారు. ఎంతగానో అవి దావాలనంగా ఎక్కడెక్కడికీ పోతున్నాయి. ఇవి కంటిన్యూ అవ్వకూడదు. నా పిల్లలిద్దరికీ కాదు.. చెప్పాలంటే ఇది రాష్ట్రానికి కూడా మంచిది కాదు. నేను మీ ముందుకు ఈ విషయంగా రాకూడదని అనుకున్నా. అయినా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కుటుంబం గురించి తప్పుగా మాట్లాడే వారందరినీ ఒకటి అడుగుతున్నా… ఈ కుటుంబాన్ని ప్రేమించిన వారు మీరు.

మా జీవితంలో మీరందరూ భాగమే అనుకుంటున్నాను. ఇది రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం. రాజశేఖర్ రెడ్డి గారికి మేము ఎంతో.. మీరు కూడా అంతే. ఆయన మమ్మల్ని ఎలా ప్రేమించారో.. మిమ్మల్ని అంతగానే ప్రేమించారు. మీరు కూడా అంతకంటే ఎక్కువగా మా కుటుంబాన్ని ప్రేమించారు. అంతెందుకు.. రాజశేఖర్ రెడ్డి మన మధ్యనుంచి వెళ్ళిపోయాక నా పిల్లలను, ఆయన ఉన్నప్పటి కంటే ఎక్కువగా ప్రేమించి, ఆదరించి అక్కున చేర్చుకున్నారు. అది నేను ఎన్నటికీ మరిచి పోలేను. అందుకు నా జన్మంతా మీకు రుణపడి ఉంటూ.. హృదయ పూర్వకంగా నా కృతజ్ఞతలు తెలుపు కుంటున్నాను. మీ అందరికీ మీ ఆడబిడ్డగా రెండు చేతులు ఎత్తి మనవి చేసుకుంటున్నాను. దయచేసి ఈ కుటుంబం గురించి, నా పిల్లల గురించి తక్కువ చేసి మాట్లాడవద్దని కోరుతున్నా. ముఖ్యంగా సోషల్ మీడియా లో కల్పిత కథలు రాయవద్దు. దూషణలు చేయవద్దు. ఈ కుటుంబం మీద నిజమైన ప్రేమ ఉంటే.. ఇంతకంటే ఎక్కువ మాట్లాడవద్దు. వాళ్ళు ఇద్దరు సమాధాన పడతారు. మీరెవరు రెచ్చ గొట్టవద్దని నా మనవి. నేను నమ్మిన దేవుడు యేసయ్య.. సమాధాన కర్త. నా బిడ్డల సమస్యలకు పరిష్కారం ఇస్తాడని నా నమ్మకం.

Also Read: Bro Anil Kumar : తనపై జగన్ విపరీతమైన ఒత్తిడి తెచ్చాడు – బ్రదర్ అనిల్‌కుమార్

ఇటీవల వైవీ సుబ్బారెడ్డి, విజయ సాయి రెడ్డి, ఇతరులు అందరూ… వాళ్ళు మాట్లాడుతున్నది వాళ్ళు ప్రేమించే YSR గురించి అని మరిచి.. తీస్తున్నది ఆయన కుటుంబ పరువు అని స్పృహ లేకుండా.. ఎన్నో అసత్యాలు చెప్పారు. YSR బ్రతికి ఉండగానే ఆస్తులు పంచేశారు అని అన్నారు. ఇది అవాస్తవం. YSR పిల్లలు ఇద్దరు పెరుగుతున్న రోజుల నుండి, కొన్ని ఆస్తులు పాప పేరు మీద.. అలాగే కొన్ని ఆస్తులు జగన్ పేరు మీద పెట్టారు. అది ఆస్తులు పంచడం ముమ్మాటికీ కాదు. YSR బ్రతికి ఉండగనే షర్మిలకు ఆస్తులు ఇచ్చేశారు అని లిస్ట్ చదివారు. అలాగే జగన్ పేరు మీద పెట్టిన ఆస్తుల లిస్ట్ చదివి ఉండాల్సింది. YSR చేసింది పంపకం కాదు. కొన్ని ఆస్తులు ఇద్దరు బిడ్డల పేరు మీద పెట్టారు అంతే.

విజయసాయి రెడ్డి ఆడిటర్ గా ఉన్నారు కాబట్టి ఆయనకు అన్ని తెలుసు. వైవి సుబ్బారెడ్డి ఈ ఇంటి బంధువుగా MOU పై సాక్షి సంతకం చేశారు. అయినా…. మీడియాలో అవాస్తవాలు మాట్లాడటం నాకు చాలా బాధ కలిగించింది. అబద్దాల పరంపర కొనసాగకుండా ఉండటానికి సూటిగా నిజం చెప్తున్న.వీరు ఇద్దరు నా పిల్లలు. వీరిని నేను, YSR ఎంతో అపురూపంగా ప్రేమగా పెంచుకున్నాం. అమ్మగా నాకు ఇద్దరు సమానమే. అలాగే రాజశేఖర్ రెడ్డి గారి మాట సమానమే. ఆస్తులు కూడా ఇద్దరికీ సమానం అనేది నిజం. నలుగురు చిన్నబిడ్డలకు సమానంగా ఉండాలన్న YSR గారి ఆజ్ఞ నిజం. ఆస్తులు వృద్ధిలోకి తేవడంలో జగన్ కష్టం ఉందనేది నిజం. కానీ అన్ని ఆస్తులు కుటుంబ ఆస్తులే అన్నది నిజం. జగన్ బాధ్యత గల కొడుకు గా కుటుంబ ఆస్తులను సంరక్షించాలి అన్నది కూడా నిజం. YSR గారి చివరి రోజుల్లో, జగన్ ఆయనకు ఇచ్చిన మాట ” నాన్న నీ తర్వాత ఈ లోకంలో, పాప మేలు కోరే వారిలో నేను మొదటి వాడిని ” అని మాట ఇచ్చింది కూడా నిజం. ఇది “నాలో నాతో YSR అనే పుస్తకం”లో ఎప్పుడో రాశా.
రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉండగా ఆస్తులు పంచలేదు. ఉన్న ఆస్తులను ఒక్కొక్కరు చూసుకున్నారు. అందరం కలిసి ఉన్నాం. అన్ని కుటుంబ ఆస్తులే. ఇక పంచుదాం అనుకొనే సరికి, ఆయన ప్రమాదంలో వెళ్ళిపోయారు. ఈ విషయం ఆడిటర్ గా సాయి రెడ్డి కి స్పష్టంగా తెలుసు. తెలిసి కూడా అవాస్తవాలు మాట్లాడారు.

రాజశేఖర్ రెడ్డి మన మధ్య నుంచి వెళ్ళిపోయాక.. 2009 నుంచి 2019 వరకు 10 ఏళ్లు కలిసి ఉన్నారు. డివిడెండ్ రూపంలో జగన్ వాటా తీసుకొని, 200 కోట్లు పాప భాగానికి ఇచ్చారు. MOU ప్రకారం జగన్ 60 శాతం.. పాపకు 40 శాతం అయితే, MOUకు ముందు…సగం సగం డివిడెండ్ తీసుకొనే వారు.. ఎందుకంటే పాపకు సమాన వాట ఉంది కాబట్టి. వీటి అన్నింటికీ అప్పుడు, ఇప్పుడు, నేనే సాక్షిని. 2019లో సిఎం అయిన రెండు నెలలకు, డివైడ్ అవ్వాలని ఇజ్రాయిల్ లో జగన్ ప్రపోజల్. జగన్ చెప్పింది ఏంటంటే…”పిల్లలు పెద్ద వాళ్ళు అయ్యారు.. నాకు అల్లుళ్ళు వస్తారు.. నీకు అల్లుడు, కోడలు వస్తారు.. మనం కలిసి ఉన్నట్లు వాళ్ళు కలిసి ఉండకపోవచ్చు..కాబట్టి విడిపోదాం” అన్నాడు. అలా 2019 వరుకు కలిసి ఉన్న కుటుంబం, ఆస్తుల పరంగా విడిపోవాలని నిర్ణయం జరిగింది.

ఆ తర్వాత విజయవాడలో, నా సమక్షంలో, ఆస్తుల్లో ఇవి జగన్ కి, ఇవి పాప కి అని అనుకున్నారు. 2019 లో అప్పుడు రాసిన MOU నే ఈ MOU. ఇది జగన్ నోటితో చెప్పి.. ఆయన చేతితో రాసిన MOU నే ఇది. హక్కు ఉంది కాబట్టే పాప కి 200 కోట్లు డివిడెండ్లు ఇచ్చారు. పాపకి హక్కు ఉంది కాబట్టే MOU రాసుకున్నారు. అఫిషియల్ గా రాసుకున్నారు. MOU లో పాపకు ఇవ్వాల్సిన ఆస్తులు జగన్ గిఫ్ట్ గా ఇస్తున్నవి కాదు. జగన్ భాధ్యత గా ఇస్తున్నవి. అటాచ్ మెంట్ లో లేవు కాబట్టి, MOU లో ఉన్న సరస్వతి షేర్స్ 100 శాతం, MOU లో లేని ఎలహంక ప్రాపర్టీ 100 శాతం, పాపకు వెంటనే ఇస్తాను అని జగన్ అప్పుడే మాట ఇచ్చి సంతకం పెట్టాడు. ఇవి కూడా ఇవ్వకుండ.. ఆటాచ్ మెంట్లో లేని ఆస్తుల విషయంలో కూడా పాపకు అన్యాయం జరిగింది. పాప భాగానికి వచ్చిన భారతి సిమెంట్స్, సాక్షి మీడియా, YSR గారి ఇల్లు ఇలాంటివి కేసుల తర్వాత ఇవ్వాల్సి ఉంది. 2019 వరకు కలిసి ఉన్నాము. షర్మిలమ్మ ను బిజినెస్ లో ఇన్వాల్వ్ చేయలేదు. అయినా షర్మిలమ్మ పాలిటిక్స్ లో జగన్ చెప్పినట్లు చేసింది. జగన్ కోసం నిస్వార్థంగా కష్టపడింది. జగన్ అధికారంలో రావడానికి పాప కృషి ఎంతో ఉంది.

జన్మనిచ్చిన ప్రతి తల్లిదండ్రులకు బిడ్డలు అందరూ సమానమే. ఒక బిడ్డ ఇంకో బిడ్డకు అన్యాయం చేస్తుంటే, చూసి తట్టుకోవడం చాలా కష్టం. తల్లిగా, అన్యాయం జరిగిన బిడ్డ పక్షాన ఉండి మాట్లాడటం నా విధి, నా ధర్మం. ఇంత మంది పెద్ద మనుషులు చెప్తున్న అబద్ధాల మధ్య నిజం తెలియాలనే.. ఇన్ని విషయాలు చెప్పాల్సి వచ్చింది. వాస్తవాలు ఇవే… అయినప్పటికీ, వాళ్ళు ఇద్దరు అన్నా చెల్లెళ్ళు. ఇది వాళ్ళిద్దరి సమస్య. ఈ సమస్యను వారే పరిష్కరించుకుంటారు. రాజశేఖర్ రెడ్డి ఉండి ఉంటే ఈ ఆస్తుల సమస్య ఉండేది కాదు. ఇంతటి వివాదం జరిగేది కాదు. ఆస్తుల విషయంపై నేనూ ఇలా రావాల్సిన అవసరం పడేది కాదు. అయినా దీని విషయంగా జరుగుతున్న రచ్చను చూసి.. నా మాటలు మాత్రమే ఆపుతాయనీ విశ్వసిస్తూ. నేను రాకపోతే ఇలానే కొనసాగుతుందని.. మీ ముందుకు రావాల్సి వచ్చింది. మరొక్కసారి మీ అడబిడ్డగా ప్రతి ఒక్కరినీ, ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దని కోరుకుంటూ.. ప్రేమతో వైఎస్. విజయ రాజశేఖర్ రెడ్డి అని ఒక సంచ‌ల‌న లేఖ విడుద‌ల చేశారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • ap news
  • vijaysai reddy
  • ys jagan
  • ys sharmila
  • ys vijayamma
  • YS Vijayamma Letter
  • YS Vijayamma Open Letter
  • ysr
  • ysrcp
  • yv subba reddy

Related News

Pithapuram

Pithapuram : భారతదేశం లోని అష్టాదశ మహా శక్తి పీఠాల్లో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం

Pithapuram : భారతదేశం లోని అష్టాదశ మహా శక్తి పీఠాల్లో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం పిఠాపురంలోని కుక్కుటేశ్వరుడి దేవాలయంలో ఉండేది. ఈ పీఠం మూలంగానే పిఠాపురానికి పీఠికాపురం అనే పేరు వచ్చిందని అంటారు. Pithapuram Charitra : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పిఠాపురం హాట్‌ టాపిక్‌. ఏ నోట విన్నా పిఠాపురం మాటే. ఈ పిఠాపురం.. కాకినాడ జిల్లాలో ఉంది. అయితే.. పిఠాపురాన్ని పూర్వం పీఠికాపురం అనేవారు. ఈ ఊరికి అధిపత

  • Minister Nara Lokesh

    Minister Nara Lokesh: మంత్రి నారా లోకేశ్ చొరవతో నెరవేరిన చిన్నారి జెస్సీ కల!

  • Elections

    Elections: మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలు?

  • Botsa Satyanarayana

    YCP: కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన‌ కార్మిక బిల్లుపై వైసీపీ తీవ్ర అభ్యంత‌రం!

  • Jagan

    Jagan: కొత్త జీఎస్టీపై జ‌గ‌న్ కీల‌క ట్వీట్‌.. ఏమ‌న్నారంటే!

Latest News

  • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

  • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

  • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

  • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

  • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd