Bro Anil Kumar : తనపై జగన్ విపరీతమైన ఒత్తిడి తెచ్చాడు – బ్రదర్ అనిల్‌కుమార్
Bro Anil Kumar : తనపై జగన్ విపరీతమైన ఒత్తిడి తెచ్చాడు - బ్రదర్ అనిల్‌కుమార్
- By Sudheer Published Date - 06:55 PM, Tue - 29 October 24

గత కొద్దీ నెలలుగా వైస్సార్ ఫ్యామిలీ (YSR Family) లో ఆస్తుల గొడవలు (Property Disputes) జరుగుతున్నాయనే ప్రచారం జరిగింది కానీ నేరుగా బయటపడలేదు. కానీ రీసెంట్ గా ఈ గొడవలను జగన్ (Jagan) బయటపెట్టారు. ఆస్తుల కోసం ఏకంగా తల్లికి , చెల్లికి నోటీసులు ఇచ్చి తన నిజస్వరూపం ఏంటో తెలిపాడు. ఇక జగన్ నోటీసులపై షర్మిల (Sharmila) , తల్లి విజయమ్మ(Vijayamma) కు కూడా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. ఈ తరుణంలో షర్మిల భర్త, బ్రదర్ అనిల్‌కుమార్ (Bro Anil Kumar) ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో జగన్ కు సంబంధించి పలు కీలక విషయాలను తెలిపి షాక్ ఇచ్చారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, సీఎం జగన్ తనపై బీజేపీ ఒత్తిడితో మత బోధన ఆపాలని ఒత్తిడి తెచ్చారని , షర్మిల జోక్యం చేసుకుని ఎవరి వృత్తి వారిదని, ఎవరో ఏదో అన్నారని ఆపడం తగదని ఆమె కన్వీన్స్ చేసే ప్రయత్నం చేశారు, తాను ఆ విధానాలను ఆపనని నిర్ణయం తీసుకోవడం తో తనను పక్కన పెట్టారని చెప్పుకొచ్చాడు. అనిల్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు వైసీపీ శ్రేణుల్లో చర్చ గా మారాయి.
2019 ఎన్నికల తర్వాత సీఎం జగన్ ఇంటికి ప్రశాంత్ కిషోర్ (పీకె) వెళ్లి, తెలంగాణలో పార్టీ పెట్టడం గురించి చర్చించారని తెలుస్తోంది. అయితే, జగన్ ఈ ప్రతిపాదనపై ఆసక్తి చూపకపోవడంతో అన్నా-చెల్లి మధ్య విభేదాలు మరింతగా పెరిగాయని అనిల్ కుమార్ పరోక్షంగా వెల్లడించారు.
Read Also : Harish Rao : బిడ్డా మీ పేర్లు డైరీలో రాసుకుంటున్నాం..పోలీసులకు హరీశ్ వార్నింగ్..!