YS Jagan : మళ్లీ మూడు రాజధానులే..! జై వైజాగ్..
మూడు రాజధానులపై సమగ్ర బిల్లు తీసుకొస్తామని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించాడు. గత మూడు రాజధానుల బిల్లులో కొన్ని లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్ది మళ్లీ మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెడతామని ప్రకటించాడు.
- Author : CS Rao
Date : 22-11-2021 - 3:21 IST
Published By : Hashtagu Telugu Desk
మూడు రాజధానులపై సమగ్ర బిల్లు తీసుకొస్తామని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించాడు. గత మూడు రాజధానుల బిల్లులో కొన్ని లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్ది మళ్లీ మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెడతామని ప్రకటించాడు. అభివృద్ధి వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ దిశగా మళ్లీ బిల్లు పెడతామని వివరించాడు. ఈసారి న్యాయపరమైన చిక్కులు లేకుండా సమగ్ర బిల్లును మూడు రాజధానులపై తీసుకొస్తామని జగన్ చెప్పాడు. ఏపీ రాజధానికిగా విశాఖ ఉండడానికి అన్ని రకాల అర్హతలు ఉన్నాయని జగన్ అన్నాడు.-అమరావతికి లక్ష కోట్లకు పైగా ఖర్చు అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత ఖర్చు పెట్టే పరిస్థితి లేదు.
-వైజాగ్ కు అన్ని రకాల మౌలిక వసతులు ఉన్నాయి. హైదరాబాద్, బెంగుళూరుకు పోటీగా అభివృద్ధికి సాధ్యం
-మూడు రాజధానులపై ఏడాదిన్నరగా రాద్ధాంతం చేస్తున్నారు. న్యాయపరమైన చిక్కులు క్రియేట్ చేస్తున్నారు
-శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం వికేంద్రీకరణ బిల్లు పెట్టాం. కేంద్రీకరణ నుంచి బయటకు రావడానికి ఆ బిల్లు పెట్టాం.
-హైద్రాబాద్ లాంటి సూపర్ క్యాపిటల్ వద్దని 2019 ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అన్ని ప్రాంతాల అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది.
-వికేంద్రకరణ బిల్లుపై అపోహలు, ఆరోపణలు, న్యాయస్థానాల్లో కేసులు, దుష్ఫ్రచారాలు చేశారు. బిల్లును మరింత మెరుగు పరిచేందుకు మార్పులు చేస్తూ మూడు రాజధానులపై సమగ్ర బిల్లు పెడతాం