HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Teena Sravya In Controversy

పవిత్రమైన మేడారంలో హీరోయిన్ టీనా శ్రావ్య చేసిన పనికి అంత ఛీ కొడుతున్నారు !!

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో ఆమె చేసిన పని సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. తన పెంపుడు కుక్కతో కలిసి జాతరకు వెళ్లిన ఆమె, అక్కడ దైవానికి మొక్కు తీర్చుకునే క్రమంలో కుక్కకు 'తులాభారం' వేయడం

  • Author : Sudheer Date : 21-01-2026 - 12:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Teena Sravya Medaram
Teena Sravya Medaram

టాలీవుడ్‌లో ‘కమిటీ కుర్రోళ్లు’, ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నటి టీనా శ్రావ్య ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్నారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో ఆమె చేసిన పని సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. తన పెంపుడు కుక్కతో కలిసి జాతరకు వెళ్లిన ఆమె, అక్కడ దైవానికి మొక్కు తీర్చుకునే క్రమంలో కుక్కకు ‘తులాభారం’ వేయడం ఇప్పుడు విమర్శలకు కేంద్రబిందువైంది. భక్తిశ్రద్ధలతో కొలిచే అమ్మవార్ల సన్నిధిలో ఇలాంటి చర్యలు చేపట్టడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

సాధారణంగా మేడారం జాతరలో భక్తులు తమ కోర్కెలు తీరినందుకు ప్రతిఫలంగా తమ బరువుకు సమానమైన బెల్లాన్ని (స్థానికంగా బంగారం అని పిలుస్తారు) అమ్మవార్లకు సమర్పిస్తుంటారు. అయితే, టీనా శ్రావ్య తన పెంపుడు కుక్కను త్రాసులో కూర్చోబెట్టి, దానికి సమానంగా బెల్లాన్ని తూచడం గమనార్హం. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో, పలువురు భక్తులు మండిపడుతున్నారు. జాతర పవిత్రతను, సంప్రదాయాలను గౌరవించాలని, మూగజీవాల పట్ల ప్రేమ ఉండొచ్చు కానీ దైవ కార్యాల్లో ఇలాంటి పద్ధతులు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు, ఈ వ్యవహారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు నెటిజన్లు టీనా శ్రావ్యను సమర్థిస్తూ, మొక్కు అనేది వ్యక్తిగతమని, మూగజీవాలను కూడా కుటుంబ సభ్యుల్లా భావించే క్రమంలో ఆమె అలా చేసి ఉండవచ్చని పేర్కొంటున్నారు. పెంపుడు జంతువుల ఆరోగ్యం కోసమో లేదా మరేదైనా కారణంతోనో ఆమె తన మొక్కును చెల్లించుకుందని, ఇందులో తప్పు పట్టాల్సింది ఏమీ లేదని వారు వాదిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, ఆధ్యాత్మిక క్షేత్రాల్లో పాటించాల్సిన నియమ నిబంధనలు మరియు పెంపుడు జంతువుల ప్రవేశంపై ఈ ఘటన మరోసారి పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • controversy
  • Medaram
  • medaram tula baaram
  • teena sravya
  • teena sravya dog
  • teena sravya medaram

Related News

Bcm Temple

Bhadrachalam Temple : రామయ్య గోత్ర నామాల వివాదంపై హైకోర్టు క్లారిటీ

ఇరుపక్షాల వాదనలను సుదీర్ఘంగా విన్న హైకోర్టు, తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. భద్రాచలం ఆలయానికి ఉన్న విశిష్టత, భక్తుల నమ్మకాలు మరియు చారిత్రక ఆధారాలను బేరీజు వేస్తూ న్యాయస్థానం

    Latest News

    • కేకేఆర్ ఫ్యాన్‌కు ముంబై ఇండియన్స్ ఫ్యాన్ ప్రపోజ్!

    • ఐపీఎల్‌లో రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. క్యాప్డ్ ప్లేయర్ అంటే ఏమిటి?!

    • జనాభా గణన.. 33 ప్రశ్నలు సిద్ధం!!

    • Price Hike : ఏసీ, స్మార్ట్ టీవీ కొనుగోలు చేసేవారికి బ్యాడ్ న్యూస్

    • బ్లడ్ క్యాన్సర్ అంటే ఏమిటి? ఎందుకు ప్రమాదకరం?

    Trending News

      • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

      • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

      • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

      • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

      • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd